హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

priyanka reddy: నిందితుల ఇళ్లల్లో పరిస్థితి ఇది, మహ్మద్ యజమాని శ్రీనివాస్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడిన ఘటనలో ప్రధాన నిందుతుడైన మహ్మద్ ఆరీఫ్(పాషా)తోపాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిని శనివారం 14 రోజులపాటు రిమాండ్‌కు తరలించారు.

priyanka reddy murder: ఉరితీయండి లేదా కాల్చేయండి.. చెన్నకేశవులు తల్లి

తన కొడుకు అలాంటివాడు కాదంటూ..

తన కొడుకు అలాంటివాడు కాదంటూ..

నిందితులంతా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవారే. గుడిగండ్ల గ్రామానికి చెందిన జొల్లు నవీన్, జొల్లు శివలు అన్నదమ్ముల పిల్లలు. చెన్నకేశవులుది కూడా అదే గ్రామం. ప్రధాన నిందితుడు మహ్మద్ తల్లి మోలే బీ వద్దకు మీడియా వెళ్లి ప్రశ్నించగా.. తన కొడుకు అలాంటివాడు కాదని తెలిపింది.

ఊర్లో బాగానే ఉండేవాడు..

ఊర్లో బాగానే ఉండేవాడు..

తన కొడుకు హైదరాబాద్‌లో లారీ నడిపిస్తున్నాడని.. బుధవారం అర్ధరాత్రి ఇంటికి వచ్చాడని తెలిపింది. అయితే, బుధవారం అర్ధరాత్రి తర్వాత పోలీసులమని చెప్పి ఎవరో వాడిని తీసుకెళ్లారని చెప్పింది. తన కొడుకు ఊర్లో మాత్రం బాగానే ఉండేవాడని తెలిపింది.

మరో ఇద్దరు నిందితుల ఇంట్లో పరిస్థితి ఇలా..

మరో ఇద్దరు నిందితుల ఇంట్లో పరిస్థితి ఇలా..

కాగా, మరో ఇద్దరు నిందితులు నవీన్, శివ ఇంట్లో కూడా ఆందోళనకర వాతావరణమే కనిపించింది. ఉదయం నుంచి వాళ్ల గురించి ఎవరికీ ఏమీ తెలియడం లేదు.. తెల్లవారకముందే వచ్చి ఎవరో తీసుకుని వెళ్లారని వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. టీవీలో ఈ వార్తలు వచ్చేంత వరకూ తమకు ఈ విషయం తెలియదని చెప్పారు. కాగా, ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులను మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ హైదరాబాద్‌లో పరామర్శించారు.

Recommended Video

#PriyankaReddy : భగ్గుమన్న మహిళా లోకం.. ఉరి శిక్ష తధ్యమా ? || Oneindia Telugu
లారీ ఓనర్ అరెస్ట్

లారీ ఓనర్ అరెస్ట్

ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ ఆరిఫ్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితుడు మహ్మద్ నడిపే లారీ యజమాని శ్రీనివాస్ రెడ్డిని కూడా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మహ్మద్ గురించిన విషయాలను తెలుసుకునేందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

English summary
Priyanka Reddy Murder: prime accused's mother response.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X