• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లారీలు అడ్డుపెట్టి రేప్ చేసి చంపి ... ప్రియాంకా రెడ్డి హత్య లారీ డ్రైవర్ల పనే !!

|

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ కేసులో ప్రియాంకా రెడ్డి పై అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు . ఆపై ఆమెను దహనం చేసిన దుండగులు లారీ డ్రైవర్లే అని ప్రాధమిక అంచనాకు వచ్చారు పోలీసులు. ఇది లారీ డ్రైవర్ల పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

సోదరి భవ్యతో మాట్లాడిన మాటలే కీలకంగా పోలీసుల దర్యాప్తు

సోదరి భవ్యతో మాట్లాడిన మాటలే కీలకంగా పోలీసుల దర్యాప్తు

లారీలను అడ్డుగా పెట్టి ఆమెపై అత్యాచారం చేసి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే లారీలో ఉన్న వ్యక్తి స్కూటీని బాగు చేయిస్తానని తీసుకెళ్లి షాపు మూసేసి ఉందని మళ్లీ వచ్చాడని, తనకు భయం వేస్తోందనిప్రియాంకా రెడ్డి తన సోదరి భవ్యతో చెప్పింది. ఇక ఈ కేసులో ఆమె సోదరి తో మాట్లాడిన మాటలే కీలకంగా మారాయి. వీటి ఆధారంగానే ఈ కేసులో ప్రియాంకా రెడ్డిపై ఘాతుకానికి పాల్పడింది డ్రైవర్ లే అయి ఉంటారని, ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు .

లారీలను అడ్డుగా పెట్టి రేప్ .. టోల్ గేట్ సమీపంలో మద్యం సేవించిన ఆనవాళ్ళు

లారీలను అడ్డుగా పెట్టి రేప్ .. టోల్ గేట్ సమీపంలో మద్యం సేవించిన ఆనవాళ్ళు

టోల్‌బూత్‌కు 50 మీటర్ల దూరంలో, లారీలను అడ్డుగా లారీల చాటున ఆమెపై అత్యాచారం చేసి, చంపేసి, అక్కణ్నుంచి 28 కిలోమీటర్ల దూరానికి ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి, పెట్రోలు పోసి నిప్పంటించేశారు అని పోలీసులు భావిస్తున్నారు. అక్కడ అందుకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. టోల్‌గేటు వద్ద దొరికిన ఆనవాళ్లను బట్టి దుండగులు మద్యం సేవించినట్లు తెలుస్తోంది . టోల్‌బూత్‌కు 50 మీటర్ల దూరంలోప్రియాంక బట్టలు కనిపించాయి . ఆమెపై ఘోరమైన అత్యాచారం జరిగిందని పోలీసులు టోల్ గేటు సమీపంలోని సీన్ ను బట్టి అర్ధం చేసుకున్నారు.

టోల్ గేట్ సమీపంలో ఆమె దుస్తులు

టోల్ గేట్ సమీపంలో ఆమె దుస్తులు

ఆమె లోదుస్తులు, చిరిగిన పైదుస్తులు టోల్ గేటు సమీపంలో కనిపించాయి. దీంతో లారీ డ్రైవర్ లే ఆమెను కంటెయినర్‌ లారీ పక్కకు లాక్కెళ్లి అత్యాచారం చేసి, చంపేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అక్కడ వాహనాల రద్దీ ఉండడంతో ఆమె కేకలు వేసినా కూడా బయట వారికి వినిపించడం కష్టం అని వారు గుర్తించారు. అసలు ఆ లారీ డ్రైవర్లే ఆమె స్కూటీకి కావాలని పంక్చర్‌ చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కావాలని ఆమె కోసం కాపు కాచి చేశారా లేకా ఆమె స్కూటీ పాడయింది కాబట్టి ఆ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని చేశారా ? ఇంతకీ ఇంత ఘోరానికి పాల్పడింది ఎవరు అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతుంది.

నేరస్తులను ఉరి తియ్యాలని ప్రియాంకా రెడ్డి తండ్రి ఆక్రోశం

నేరస్తులను ఉరి తియ్యాలని ప్రియాంకా రెడ్డి తండ్రి ఆక్రోశం

ఇక ప్రియాంకా రెడ్డి తల్లిదండ్రులు జరిగిన దారుణానికి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన కుమార్తెను అత్యంత దారుణంగా చంపిన హంతకులను బహిరంగంగా ఉరి తీయాలని ప్రియాంక తండ్రి శ్రీధర్‌రెడ్డి కోరారు. చాలా కష్ట నష్టాలు అనుభవించి చదివించుకున్న తన కూతుర్నిఈ విధంగా పొట్టనపెట్టుకున్నారంటూ కన్నీటిపర్యంతమయ్యారు. కూతుళ్లను చదివించి ప్రయోజకులను చేశామనిచెప్పిన ఆయన తమ కుమార్తె ఆత్మకు శాంతి చేకూరాలంటే నేరగాళ్లను గుర్తించి శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

  Vet Doctor Murder Case Solved, Four People Arrested
  ప్రియాంకాది చాలా సున్నితమైన మనస్తత్వం, అందుకే ఇలా ... అని కన్నీరు మున్నీరు అయిన తల్లి

  ప్రియాంకాది చాలా సున్నితమైన మనస్తత్వం, అందుకే ఇలా ... అని కన్నీరు మున్నీరు అయిన తల్లి

  ప్రియాంకా రెడ్డిది చాలా సున్నితమైన మనస్తత్వం అని దాని వల్లే తమ కుమార్తె కిరాతకుల చేతిలో బలైందని ప్రియాంక తల్లి విజయ కన్నీరు మున్నీరు అవుతున్నారు . దారుణంగా రేప్ చేసి చంపిన వారు ఆమె మృత దేహాన్ని అక్కడ నుండి తీసుకెళ్ళి ఎవరికీ ఆనవాళ్ళు దొరకకుండా ప్రియాంకరెడ్డి మృతదేహాన్ని తగలబెట్టారు. కానీ ఆమె దేహం కాలుతుండగా స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించటంతో పోలీసులు ఈ మర్డర్ మిస్టరీ ఛేదించే పనిలో ఉన్నారు.

  English summary
  A Veterinary doctor priyanka reddy murder happened in Shadnagar of The Rangareddy district .Priyanka Reddy is believed to have been raped and murdered . The police later came to the conclusion that the thugs who burned her were lorry drivers. Police are investigating the matter, saying it is suspected that it was the lorry drivers.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X