వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త జిల్లాలతో కిరికిరి..! టీచర్ల లెక్క తేలని వైఖరి..! విద్యాశాఖలో అంతా గజిబిజి..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : గవర్నమెంట్,ప్రైవేట్ స్కూళ్లు,కాలేజీల్లో పని చేస్తున్న టీచర్లు, లెక్చరర్ల వివరాలు సేకరించడంలో విద్యాశాఖ ఉన్నతాదికారులకు ఇబ్బందులేర్పడుతున్నాయి. రాష్ట్రం మొత్తం 43,017 విద్యాసంస్థల్లో 2.4 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరి వివరాలను ఆన్‌ లైన్‌ లో పొందుపర్చాలని పాఠశాల విద్యాశాఖ భావించింది. మార్చి 2 నుంచి 16లోగా వివరాలన్నీ ఆన్‌ లైన్‌ లో అప్‌ డేట్‌ చేయాలని డీఈఓలకు అప్పట్లో ఆదేశాలిచ్చింది. ఇప్పటికే యూడైస్‌ ద్వారా సేకరించిన వివరాల్లో మార్పులు సరిచేసి, అప్‌ డేట్‌ చేస్తే సరిపోతుందని సూచించింది.

టెక్నికల్‌ సమస్యతో ఇబ్బందులు..! అప్ లోడ్ అవ్వని వివరాలు..!!

టెక్నికల్‌ సమస్యతో ఇబ్బందులు..! అప్ లోడ్ అవ్వని వివరాలు..!!

అయితే నిర్ణీత సమయం (మార్చి16) నాటికి కేవలం1.09 లక్షల టీచర్ల వివరాలే అప్‌ డేట్‌ అయ్యాయి. అంటే సగం మంది వివరాలు కూడా రాలేదన్నమాట. దీంతో గడువును ఈనెల 23 నాటికి పొడిగించారు. అయినా కేవలం1.45 లక్షల (60.60%) వివరాలే అప్‌ డేట్‌ చేశారు. ఇవన్నీ కేవలం 26,062 స్కూళ్ల టీచర్ల వివరాలే. దీంతో మరో రెండు సార్లు డేట్లు పొడగించారు. అయినా ఇప్పటికీ33 వేల విద్యాసంస్థల నుంచి 1.90 లక్షల(79%)మంది వివరాలు మాత్రమే అందినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే వీటిలో గవర్నమెంట్‌ టీచర్ల వివరాలే ఎక్కువున్నాయి.

 అసలు టీచర్లు ఎంత మంది..! అదికారిక, అనదికారికంగా రికార్డుల్లోకి ఎంత మంది..!!

అసలు టీచర్లు ఎంత మంది..! అదికారిక, అనదికారికంగా రికార్డుల్లోకి ఎంత మంది..!!

ప్రైవేట్‌ టీచర్ల వివరాలివ్వడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈనెల 23లోగా టీచర్ల వివరాలను అప్‌ డేట్‌ చేయాలని మరోసారి డీఈఓలకు ఆదేశించారు. టీచర్ల డేటాను అప్‌ డేట్‌ చేయడంలో టెక్నికల్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాలు,మండలాలు ఏర్పడ్డాయి. దానికి అనుగుణంగా స్కూళ్ల యూడైస్‌ కోడ్స్‌‌ మారా యి. టీచర్ల బదిలీలూ జరిగాయి.

 లెక్క తేల్చే పనిలో ఉన్నతాదికారులు..! ఇబ్బంది పెడుతున్న కొత్త జిల్లాలు,మండలాలు..!!

లెక్క తేల్చే పనిలో ఉన్నతాదికారులు..! ఇబ్బంది పెడుతున్న కొత్త జిల్లాలు,మండలాలు..!!

వారు కొత్తగా వెళ్లి న మండలాల్లో వివరాలు ఎంట్రీ చేస్తే, పాత జిల్లా, పాత మండలం డైస్‌ కోడ్స్‌‌ కన్పిస్తున్నాయి. వాటిని మార్చాలని ఎస్‌ఎస్‌ఏ ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఈ సమస్యను అధిగమిస్తేనే టీచర్ల పూర్తి వివరాలు సేకరించే వీలుంది. అయితే ఈ సమస్య కొంత తీరిందనీ, ప్రభుత్వ, లోకల్‌ స్కూళ్లలో దాదాపు టీచర్ల వివరాలు సేకరించినట్టు అధికారులు చెబుతున్నారు.

 డేటా అంశంలో సాంకేతిక లోపం..! సతమతమవుతున్న యంత్రాంగం..!!

డేటా అంశంలో సాంకేతిక లోపం..! సతమతమవుతున్న యంత్రాంగం..!!

కానీ ప్రైవేటు విద్యాసంస్థలతోపాటు సంక్షేమ శాఖలకు సంబంధించిన స్కూళ్లలో పనిచేసే టీచర్ల వివరాలను ఇవ్వడంలేదని పేర్కొంటున్నారు. సంగారెడ్డితోపాటు పలు జిల్లాల్లో వివరాలు ఇవ్వబోమని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు వాదిస్తున్నట్టు తెలిసింది. అయితే వారిని కన్విన్స్‌ ‌చేయడంలో ఆ జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలున్నాయి.

English summary
Teachers in government, private schools, colleges and college teachers are struggling to find the details of the lecturers. There are over 2.4 lakh teachers in 43,017 educational institutions across the state. The School Education Department considers these details online. The DMOs were then asked to update online from March 2 to 16.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X