వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రూ.7కోట్లు రాజశేఖర్ సినిమా కోసమేనా?: సినీ నిర్మాతపై లోతుగా దర్యాప్తు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవల టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.7కోట్ల పాతనోట్ల వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఆ నోట్ల మార్పిడికి ప్రయత్నించిన ఇద్దరు సినీ ప్రొడక్షన్‌ మేనేజర్లను సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సినీ నిర్మాతలకు లింకులు..

సినీ నిర్మాతలకు లింకులు..

తమిళనాడులోని ఓ సినీ నిర్మాత ఈ నోట్లను నగరానికి చేరవేసినట్లు గుర్తించిన పోలీసులు.. ఈ వ్యవహారంతో సినీనటి జీవిత రాజశేఖర్‌ కుటుంబానికి ఉన్న సంబంధాలపైనా దర్యాప్తు చేపట్టారు. అయితే, జీవిత ఇప్పటికే ఆ వ్యవహారంతో తమకు సంబంధం లేదని చెప్పిన విషయం తెలిసిందే. కాగా, అజ్ఞాతంలో వున్న నిర్మాత కోసం పోలీసులు గాలిస్తున్నారు.

2006 నుంచీ సినిమాలు..

2006 నుంచీ సినిమాలు..

శుక్రవారం సికింద్రాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో డీసీపీ బి లింబారెడ్డి మీడియాతో వివరాలు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన సినీ నిర్మాత ఎం. కోటేశ్వర్‌ రాజు జ్యో స్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ మూవీ బ్యానర్‌ పేరుతో 2016 నుంచి తెలుగు, తమిళ సినిమాలు నిర్మిస్తున్నారు.

రాజశేఖర్ గరుడవేగ సినీ నిర్మాణం కోసం..

రాజశేఖర్ గరుడవేగ సినీ నిర్మాణం కోసం..

ఈ నేపథ్యంలో సదరు బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ‘ఎస్‌వీవీ గరుడవేగ' సినిమా కోసం జూబ్లీహిల్స్‌ లో కార్యాలయం ప్రారంభించారు. కూకట్‌పల్లిలో ఉంటున్న పి పురుషోత్తం(50), బోరబండకు చెందిన పి శ్రీనివాసరావు(45) సినీ ప్రొడక్షన్‌ మేనేజర్‌లుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోటేశ్వర్‌రాజు 7కోట్ల విలువైన రూ.1000, రూ.500 పాత నోట్లను తీసుకొచ్చి వీటిని మార్చితే 10% కమీషన్‌ ఇస్తానని ప్రొడక్షన్‌ మేనేజర్‌లకు ఆశ చూపారు.

70లక్షల కమీషన్ కోసం ఆశపడి..

70లక్షల కమీషన్ కోసం ఆశపడి..

రూ.70లక్షలు కమీషన్‌ వస్తుందని ఆశపడి వీరిద్దరు నోట్ల మార్పిడి ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారంతో గురువారం సెంట్రల్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జ్యో స్టార్‌ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించగా గుట్టు రట్టయ్యింది. నిందితులను కస్టడీకి తీసుకుని మరింత సమాచారం రాబడతామని డీసీపీ వివరించారు.

ఎలా వచ్చింది...

ఎలా వచ్చింది...

ఇంత భారీ మొత్తంలో డబ్బు ఎలా వచ్చిందనే విషయం చెన్నైలో వున్న కోటేశ్వరరాజును అదుపులోకి తీసుకుంటే బయటపడతాయని డీసీపీ తెలిపారు. కోటేశ్వర్‌ రాజు స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ అని, కొన్నాళ్ల క్రితం చెన్నైలో స్థిరపడ్డారని వెల్లడించారు.

జీవిత బంధువేనా?

జీవిత బంధువేనా?

పోలీసుల అదుపులోని ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకుడు శ్రీనివాస్ సినీ నటి జీవితకు సమీప బంధువు అని సమాచారం. ఇది ఇలా ఉండగా, పాత నోట్ల మార్పిడీ కేసులో అరెస్టయిన శ్రీనివాస్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటి జీవిత స్పష్టం చేశారు. తన వద్ద పనిచేస్తున్న మేనేజర్లలో శ్రీనివాస్ కూడా ఒకరు, అంతే తప్ప అతడితో, పాత నోట్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పారు. తన సోదరుడి పేరు మురళీ శ్రీనివాస్ అని, అనారోగ్యంతో బాధపడుతున్న అతను ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఆమె చెప్పారు.

English summary
The Hyderabad Task Force police on Friday confirmed that the film production managers who were arrested at Jubilee Hills on Thursday were trying to exchange the Rs 7 crore demonetized currency on commission basis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X