వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యవసాయ వర్సిటీలో ఫీజుల దందా..! నిబంధనలకు విరుద్దంగా ఫీజులు పెంచే వ్యూహం..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ ఫీజు దందా మొదలుపెట్టింది. వ్యవసాయ సీట్లకు డిమాండ్‌ ఉందని, ఇతర రాష్ట్రాల్లోకి వెళుతున్నారన్న సాకుతో సీట్లు పెంచుతూ భారీ ఫీజులకు తెరలేపింది. వంద సీట్లు పెంచాలని, అందులో 75 సీట్లలో ఒక్కోదానికి ఏడాదికి లక్షన్నర రూపాయలు అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది.

అకడమిక్‌ కౌన్సిల్‌ ఆమోదం..! ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు..!!

అకడమిక్‌ కౌన్సిల్‌ ఆమోదం..! ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు..!!

దీనికి సాధారణ ఫీజులు కలుపుకుంటే కోర్సు మొత్తానికి 8 లక్షల రూపాయలకు కుపైగా ఖర్చు అవుతుంది. మరో 25 సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటా కింద పరిగణించి ఒక్కోదానికి ఏడాదికి లక్షన్నర ఫీజుతోపాటు ప్రవేశ సమయంలో 4.76 లక్షల రూపాయలు (6,800 అమెరికా డాలర్లు) అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఎన్‌ఆర్‌ఐ సీటు కోర్సు మొత్తానికి, సాధారణ ఫీజుతో కలిపి 12 లక్షల రూపాయలకు పైగా ఖర్చు కానుందని వర్సిటీ వర్గాలు వివరించాయి.

వంద సీట్లు పెంచేందుకు ప్రణాళికలు..! ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచాలని నిర్ణయం..!!

వంద సీట్లు పెంచేందుకు ప్రణాళికలు..! ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచాలని నిర్ణయం..!!

ఈ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌.సుధీర్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు అధ్యక్షతన జరి గిన వర్సిటీ 10వ అకడమిక్‌ కౌన్సిల్‌ సమావేశం పలు తీర్మానాలు చేసిందని సుధీర్‌కుమార్‌ తెలిపారు. విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు కళాశాలల్లో అధిక మొత్తం ఫీజులు చెల్లించి బీఎస్సీ వ్యవసాయ కోర్సులను అభ్యసిస్తున్నారని తెలుస్తోంది.

నిభందనలకు విరద్దం..! పట్టించుకోని యంత్రాంగం..!!

నిభందనలకు విరద్దం..! పట్టించుకోని యంత్రాంగం..!!

ఈ నేపథ్యంలో వర్సి టీలో మరో వంద సీట్లు పెంచాలని ప్రతిపాదించిన ట్లు పేర్కొన్నారు. 75 పేమెంట్‌ సీట్లు ఎంసెట్‌ ర్యాంక్‌ ఆధారంగా భర్తీ చేస్తామని, రిజర్వేషన్‌ విధానం పాటిస్తామని తెలిపారు. ఈ సీట్లకు సాధారణ ఫీజుతోపాటు అదనంగా ఏడాదికి లక్షా 50 వేల రూపాయలు, ఎన్‌ఆర్‌ఐ కోటాలోని 25 సీట్లకు సాధారణంగా కోర్సుకు చెల్లించే ఫీజుతోపాటు ఏడాదికి లక్షా 50 వేల రూపాయలు అదనంగా చెల్లించాలని పేర్కొన్నారు.

పేరుకే ఆదర్శ విశ్వ విద్యాలయం..! అంతా దందానే..!!

పేరుకే ఆదర్శ విశ్వ విద్యాలయం..! అంతా దందానే..!!

బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌కోర్సు సీట్లను 59 నుంచి 75కి పెం చుతూ నిర్ణయం తీసుకున్నామని, వర్సిటీ పరిధిలో ఉన్న పది ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో సీట్ల సంఖ్యను 330 నుంచి 220కి తగ్గిస్తున్నామని తెలిపారు. ఈ ప్రతిపాదనల్ని వర్సిటీ కౌన్సిల్‌ ఆమోదించిన తరు వాత ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు.

English summary
Professor Jayasankar agriculture university started fees buisiness. The demand for agricultural seats and the prospect of going to other states increased seats and raised huge fees. It has decided to increase the number of seats, in addition to one lakh each, in each of the 75 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X