వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీరనున్న నీటి గోస .. ప్రాజెక్టుల నిర్మాణం ఎందుకు ఆలస్యమైందంటే ..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలో జలసిరులు కురిపించే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమవడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. తెలంగాణ భవన్ వద్ద బాణాసంచా కాల్చి ధూం ధాం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు గులాల్ చల్లుకుంటూ .. నినాదాలు చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు.

కేసీఆరే కర్త ..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కర్త, కర్మ, క్రియ కేసీఆర్ అని స్పష్టంచేశారు. ప్రాజెక్టు కేసీఆర్ మానస పుత్రికగా అభివర్ణించారు. దేశంలో ఇంత గొప్ప ప్రాజెక్టు మరే రాష్ట్రంలో లేదని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని .. అందులో ఇక నీటి గోస పూర్తిగా తీరనుందని పేర్కొన్నారు. వాస్తవానికి ప్రాజెక్టుల నిర్మాణానికి కోర్టు కేసులు ఓ కారణమని గుర్తుచేశారు. ట్రిబ్యునల్ లో కేసులు పెండింగ్ లో ఉండటంతో పూర్తి అయ్యేందుకు ఆలస్యమవుతుందని చెప్పారు. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పటివరకు తెలంగాణ నీటి సమస్యకు పరిష్కారం చూపలేకపోయిందని మండిపడ్డారు.

projects construction late .. reason is ?

ఆనంద డోలికలు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి గుర్తుచేశారు. దీంతో సాగునీటి గోస తప్పుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ సహా మిగతా నగరాలు ,పల్లెలకు 40 టీఎంసీల మంచినీరు అందుతుందని .. దీంతోపాటు పరిశ్రమలకు కూడా 16 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తోందని పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి సరిపడా నీటిని రైతులకు అందిస్తామని చెప్పారు.

English summary
TRS series has been sinking in celebration with the launch of the Kaleshwaram project that spills water into Telangana. The fireworks were shot at the Telangana Bhavan. Under the leadership of Minister Talasani Srinivas Yadav, activists spent a lot of time cheering and chanting slogans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X