హైదరాబాద్ మెట్రో ఎఫెక్ట్: అనూహ్యంగా పెరిగిన ధరలు, మియాపూర్ టు నాగోల్
హైదరాబాద్: మెట్రో రైలు రాక నేపథ్యంలో హైదరాబాదులో ఆ మార్గంలో భూముల ధరలు భారీగా పెరిగాయి, పెరుగుతున్నాయి. మియాపూర్ - నాగోల్ మెట్రో కారిడార్లో హఠాత్తుగా మార్పు కనిపించింది.

మోడీ చేతుల మీదుగా మెట్రో సస్పెన్స్: అమీర్పేట స్టేషన్ అదుర్స్, విమానస్థాయి వసతులు ఇవీ..

మెట్రో రైలు ప్రయాణం సులభం
రానున్న మెట్రో రైలు ప్రయాణం చాలా సులభం కానుంది. ఈ నేపథ్యంలో మెట్రో స్టేషన్ పరిసరాల్లో నివసించేందుకు చాలామంది ఇష్టపడతారు. కాబట్టి ఈ ప్రాంతాల్లో అనూహ్యంగా రేట్లు పెరుగుతున్నాయి.

ప్రయాణ సమయం తగ్గుతుంది అందుకే
మియాపూర్ - నాగోల్ రోడ్డు ప్రయాణానికి గంటల కొద్ది పడుతుంది. మెట్రో రైలులో అయితే నలభై నిమిషాల్లోనే ప్రయాణించవచ్చునని తెలుస్తోంది. దీంతో చాలామంది ఇప్పుడు మెట్రో రైలు మార్గానికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

భూముల ధరలు పెరుగుతున్నాయి
మియాపూర్లో కంటే నాగోల్లో అద్దెలు, భూముల ధరలు తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న వారి దృష్టి కూడా ఇప్పుడు నాగోలు, ఉప్పల్, తార్నాక తదితర ప్రాంతాల్లో పడింది. స్థానిక బస్తీలలో ఇళ్లకు గిరాకీ పెరిగిందని అంటున్నారు. అయితే నాగోల్ నుంచి మియాపూర్ వరకు మెట్రోకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మాత్రం ధరలు పెరుగుతున్నాయి.

షాపింగ్ మాల్స్ పుంజుకునే అవకాశం
నాగోలు మెట్రో రైల్వే స్టేషన్ను అనుకొని హెచ్ఎండీఏకు భూమి ఉంది. మెట్రో కారిడార్ రాకతో ఇక్కడ ధర అనూహ్యంగా పెరుగుకుంటూ వస్తోందట. ఈ కారిడార్లో ఇక షాపింగ్ మాల్స్ కూడా బాగు పుంజుకుంటాయని భావిస్తున్నారు.