• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కేసీఆర్‌కు మోదీ న్యూ ఇయర్ గిఫ్ట్ -కొత్త సచివాలయానికి గ్రీన్ సిగ్నల్ -కీలక అనుమతులు మంజూరు

|

కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతోన్న వేళ కేంద్రంలోని మోదీ సర్కారు నుంచి తెలంగాణ కేసీఆర్ సర్కారుకు గుడ్ న్యూస్ అందింది. న్యూ ఇయర్ గిఫ్ట్ తరహాలో.. తెలంగాణలో నిర్మించ తలపెట్టిన కొత్త సచివాలయం నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా విలయకాలంలోనూ రూ.400 కోట్ల వ్యవయంతో కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన కొత్త సెక్రటేరియట్ కు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే కొత్త సచివాలయ నిర్మాణానికి హైకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.

Bigg Boss Telugu 4 షాకింగ్ -చరిత్రలోనే అత్యధిక టీఆర్పీతో నేషనల్ రికార్డు: నాగ్ ప్రకటన

నెలల పాటు పెండింగ్‌లో..

నెలల పాటు పెండింగ్‌లో..

నిజాం జమానాలో నిర్మించిన పాత భవంతులు సహా పదేళ్లలోపు కట్టిన బిల్డింగులను సైతం సమూలంగా నేలమట్టం చేసే పనిని తెలంగాణ సర్కారు జులై నెలలో చేపట్టింది. ఇక కొత్త నిర్మాణమే తరువాయి అనుకొనగా, కోర్టుల్లో చిక్కులు ఎదురయ్యాయి. పలు వాయిదాల అనంతరం కొత్త సచివాలయ నిర్మాణానికి హైకోర్టు ఒకే చెప్పింది. కానీ పర్యావరణ అనుమతులు ఇవ్వాల్సిన కేంద్రం మాత్రం నెలలపాటు ఈ ఫైలును పెండింగ్ లో పెట్టింది. హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న స్థలంలో కట్టాలనుకున్న భవనానికి పర్యావరణ అనుమతులు ఇవ్వడం కష్టమన్నచర్చ జరిగింది. మరోవైపు..

ఎట్టకేలకు అనుమతులు..

ఎట్టకేలకు అనుమతులు..

కొత్త సచివాలయం నిర్మాణానికి టెండర్లు కూడా పూర్తయినా, కేంద్రం నుంచి ఈ కారణంగానే నిర్మాణం ఇంకా ప్రారంభించలేదు. ఎట్టకేలకు సంవత్సరం చివరి రోజున కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ.. తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణానికి అనుమతి మంజూరు చేయడంతో ఇప్పటివరకు అడ్డంకిగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోయినట్లయింది. ఇక..

ల్యాండ్ రిజిస్ట్రేషన్లపై కేసీఆర్ క్లారిటీ -ధరణి పోర్టల్ సూపరన్న సీఎం -భూములపై కీలక ఆదేశాలు

  LRS Abolish : Jaggareddy On CM KCR ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు..!!
  ప్రతిష్టాత్మకంగా నిర్మాణం..

  ప్రతిష్టాత్మకంగా నిర్మాణం..

  మొత్తం 6 అంతస్తుల్లో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో దీర్ఘచతురస్రాకారంలో కొత్త సచివాలయాన్ని నిర్మించనున్నారు. మంత్రుల పేషీల్లోనే ఆయా శాఖల కార్యదర్శులు, సెక్షన్‌ కార్యాలయాలు ఉండేలా నిర్మించనున్నారు. సీఎం ప్రవేశించడానికి ప్రత్యేక ద్వారం ఉంటుంది. మొత్తంగా 27 ఎకరాల స్థలంలో సమీకృత సచివాలయ భవనం కోసం 20 శాతమే వినియోగించనున్నారు.

  మిగతా స్థలంలో పార్కులు, పచ్చదనాన్ని పెంచనున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సచివాలయ ఆకృతిని రూపొందించారు. చెన్నైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్నీ సంస్థ ఈ డిజైన్‌ను రూపొందించింది. రూ.494 కోట్లకు షాపూర్జీ పల్లోంజి సంస్థ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది.

  English summary
  All hurdles cleared for the construction of new secretariat in Telangana as it received environmental clearance from the Union Ministry of Environment. It is known that the state High Court gave permission of the state government to construct the new building for the secretariat. Now, the state government received a crucial environmental clearance certificate from the Centre.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X