• search
  • Live TV
ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వ్యభిచారం దందాలో కొత్త పోకడ.. కస్టమర్లకు ఈజీగా.. తెలివిమీరిన దళారులు..!

|

ఖమ్మం : టెక్నాలజీ పెరిగింది. అరచేతిలో ప్రపంచం చూస్తున్న రోజులివి. అయితే పెరుగుతున్న సాంకేతికతను మంచికి ఉపయోగించాల్సింది పోయి కొందరు అడ్డదిడ్డంగా వాడేస్తున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు యధేచ్ఛగా వాడేస్తున్నారు. ఆ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వెలుగుచూసిన ఘటన విస్మయం కలిగిస్తోంది. వ్యభిచారానికి టెక్నాలజీని వాడుకోవడం చర్చానీయాంశమైంది. జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వ్యాపారులే టార్గెట్‌గా అమ్మాయిలను సరఫరా చేసే దళారులు రెచ్చిపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. సాంకేతికతను జోడించి వ్యభిచారం నిర్వహిస్తుండటంతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారా.. లేదంటే పోలీసులే చూసీచూడనట్లు వదిలేస్తున్నారా అనే అనుమానాలు లేకపోలేదు.

యధేచ్ఛగా వ్యభిచారం.. రెచ్చిపోతున్న దళారులు

యధేచ్ఛగా వ్యభిచారం.. రెచ్చిపోతున్న దళారులు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యభిచారం దందా ముగ్గురు యువతులు ఆరుగురు విటులు అన్నచందంగా నడుస్తోంది. అమ్మాయిలను సరఫరా చేసే బ్రోకర్లు రెచ్చిపోతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు నలుమూలలా వ్యభిచార గృహాలు వెలుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే పోలీసులు ఆమ్యామ్యాలతో చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే వాదనలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాదు అడపాదడపా కనీసం దాడులు చేస్తున్న దాఖలాలు కూడా లేవు.

జిల్లా కేంద్రమైన ఖమ్మంలో వ్యభిచారం దందా జోరుగా సాగుతుందనే ఆరోపణలు కొకొల్లలు. వివిధ పనుల నిమిత్తం ఖమ్మంకు వచ్చే వ్యాపారులు గానీ ఇతర వ్యక్తులు గానీ లాడ్జీల్లో బస చేస్తుంటారు. ఆ క్రమంలో వారిని టార్గెట్ చేస్తూ దళారులు వ్యభిచారం దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

సినిమా చూసి కిడ్నాప్ కథ.. "రాక్షసుడు" స్ఫూర్తిగా డిగ్రీ విద్యార్థిని డ్రామా..!

మొబైల్ ఫోన్లలో అమ్మాయిల ఫోటోలు చూపిస్తూ..!

మొబైల్ ఫోన్లలో అమ్మాయిల ఫోటోలు చూపిస్తూ..!

ఇక సింగరేణి ప్రాంతాలైన కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు లాంటి ఏరియాల్లో లగ్జరీ లైఫ్‌కు అలవాటుపడ్డవారు చాలామంది తారసపడతారు. ఆ నేపథ్యంలో వారు డబ్బులు లెక్కచేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. అయితే ఇక్కడ దళారులు టెక్నాలజీ వాడేస్తూ అమ్మాయిలను సరఫరా చేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. మొబైల్ ఫోన్లలో అమ్మాయిల ఫోటోలు చూపిస్తూ రేట్లు ఫిక్స్ చేస్తూ సరఫరా చేస్తున్నారు.

వాట్సాప్ ద్వారా అమ్మాయిల ఫోటోలు షేర్..!

వాట్సాప్ ద్వారా అమ్మాయిల ఫోటోలు షేర్..!

కొందరు దళారులు హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తుండటం చర్చానీయాంశమైంది. వివిధ పనుల నిమిత్తం ఖమ్మం వచ్చే వ్యాపారుల ఫోన్ నెంబర్లతో పాటు.. అమ్మాయిలు కావాలంటూ కోరే విటుల నంబర్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఆ క్రమంలో వారికి వాట్సాప్ ద్వారా అమ్మాయిల ఫోటోలతో పాటు రేట్ల వివరాలు కూడా పంపించేస్తున్నారట. దాంతో అవతలివారు తమకు ఎవరు నచ్చారో చెబితే వారిని పంపిస్తున్నారట. అలా గంటకో రేటు, రోజుకో రేటు చొప్పున దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

గంట సమయం గడపాలనుకుంటే దాదాపు వెయ్యి రూపాయల నుంచి నాలుగైదు వేల వరకు వసూలు చేస్తున్నారట. అదే రోజుకైతే సుమారుగా 10 వేల నుంచి మొదలుపెట్టి అమ్మాయిల రేంజ్‌ను బట్టి ముప్పై, నలభై వేల దాకా తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఓయూ క్యాంపస్‌లో విద్యార్థినుల ఆందోళన.. ఆగంతకుడు చొరబడ్డ ఘటనపై సీరియస్..!

పేదరికంలో ఉన్న కుటుంబాలే ఆసరాగా..!

పేదరికంలో ఉన్న కుటుంబాలే ఆసరాగా..!

కొన్ని కుటుంబాల పేదరికాన్ని ఆసరాగా చేసుకుంటూ దళార్లు రెచ్చిపోతున్నారనే వాదనలున్నాయి. ఈజీగా మనీ సంపాదించొచ్చని ఆశ పెట్టి వారిని ఈ మురికి కూపంలోకి లాగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇంటర్ స్టేట్ ఎక్చేంజ్‌‌తో వేలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం. ఇక్కడి అమ్మాయిలను ఇతర రాష్ట్రాలకు పంపడం.. అక్కడి నుంచి ఇక్కడకు అమ్మాయిలను తెప్పించుకోవడం చేస్తూ దళారులు ఎప్పటికప్పుడూ వ్యూహాలు మార్చుతున్నట్లు టాక్ నడుస్తోంది.

టెక్నాలజీ వాడుతూ, వాట్సాప్ సాయంతో దళారులు వ్యభిచారం దందా యధేచ్ఛగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు కొకొల్లలు. ఆ క్రమంలో పోలీసుల మాత్రపై అనుమానాలు లేకపోలేదు. వారి నుంచి మామూళ్లు తీసుకుంటూ చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

English summary
Technology has increased. The world is looking at the palm of the day. However, some are using the technology as a hindrance to better utilize the growing technology. They are used for non-formal activities. To that end, the event in the joint Khammam district is astonishing. The use of technology for prostitution has been debated. There are claims that business men coming to the district center are targeting by brokers who supply girls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X