వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘కాకతీయ కళావైభవం’కు ఆదిలోనే అడ్డంకులు, ఇది సుబ్బరామిరెడ్డి కుట్ర, పెల్లుబుకుతున్న నిరసన?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వరంగల్: 'కాకతీయ కళావైభవం' పేరుతో మార్చి 11న చారిత్రక వరంగల్ కోటలో.. సినీ ప్రముఖులకు సన్మానం చేసేందుకు టి.సుబ్బరామిరెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు స్థానికుల నుంచి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి.

ఈ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించాలనే విషయమై రెండ్రోజుల క్రితమే స్థల పరిశీలన జరిగింది. వరంగల్‌కు వచ్చిన ఆయన హన్మకొండలోని వేయి స్తంభాల గుడి, ఓరుగల్లు కోట, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం తదితర ప్రాంతాలను పరిశీలించారు.

చివరికి వరంగల్ కోటలోని ఖుష్ మహాల్‌ను ఆనుకుని ఉన్న స్థలా ఈ కార్యక్రమానికి అనువుగా ఉంటుందని నిర్ణయించారు. ఈ ప్రాంతంలో భారీ వేదిక నిర్మాణానికి కూడా సుబ్బరామిరెడ్డి ఆదేశాలు ఇచ్చేశారు. కానీ ఈ కార్యక్రమ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

అక్కడి వాళ్లకు.. ఇక్కడ సన్మానమా?

అక్కడి వాళ్లకు.. ఇక్కడ సన్మానమా?

సినీ ప్రముఖులకు అవార్డులు ఇవ్వడం, సన్మాన కార్యక్రమాలు నిర్వహించడం టి.సుబ్బరామిరెడ్డికి కొత్త కాదు. ఇప్పటికే ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు. ఈ నేపథ్యంలో మార్చి 11న చారిత్రక వరంగల్ కోటలో ‘కాకతీయ కళా వైభవం' పేరుతో సినీరంగ ప్రముఖులను సత్కరించే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అయితే దీనిపై తెలంగాణ వాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆంధ్ర సినీ ప్రముఖులను తీసుకొచ్చి తెలంగాణలో సన్మానించడం వెనుక సుబ్బరామిరెడ్డి ఆంతర్యం ఏమిటని నిరసనకారులు ప్రశ్నిస్తున్నారు. ఇది సుబ్బరామిరెడ్డి నాటకమని, దీన్ని జరగనివ్వమని, అడ్డుకుని తీరుతామని వారు పేర్కొంటున్నారు.

తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి...

తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి...

తెలంగాణ గురించి ఏనాడు పట్టించుకోని, పైగా ప్రత్యేక ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పచ్చి తెలంగాణ వ్యతిరేకి అయిన సుబ్బరామిరెడ్డికి ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలపైన ఎందుకింత ప్రేమ పుట్టుకొస్తోంది? అంటూ పలువురు తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సినీ కళాకారులను ఏనాడు పట్టించుకోనీ, వారికి ఏ మాత్రం చేయూతనివ్వని సుబ్బరామిరెడ్డికి ఉన్నట్టుండి వరంగల్‌పై ఇంత దయకలగడం వెనుక ఏదో కుట్ర ఉందన్న అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

ఏం ఆంధ్రలో స్థలమే దొరకలేదా?

ఏం ఆంధ్రలో స్థలమే దొరకలేదా?

ఆంధ్రప్రాంత సినీ కళాకారులను సన్మానించుకోడానికి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా చోటు దొరకలేదా? ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విడిచిపెట్టి తెలంగాణలోని జిల్లా కేంద్రాల్లోనే వారికి సన్మానం చేయాలన్న నిర్ణయం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇవీ నిరసనకారులు సంధిస్తున్న ప్రశ్నలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మూడున్నరేళ్ళ తర్వాత సుబ్డరామిరెడ్డికి ఇలాంటి ఆలోచన కలగడం వెనుక ఏదో మతలబు ఉందని వారు అంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తెలంగాణలోని కళాకారులు ఇప్పుడిప్పుడే సినీ రంగంలో నిలదొక్కుకుంటున్న తరుణంలో వారి ఆస్తిత్వాన్ని, ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఆంధ్ర సినీ ప్రముఖలకు ఇక్కడ సన్మానం చేయాలని ఆయన చూస్తున్నాడనేది వారి ఆలోచన.

పెత్తనాన్ని తిరిగి నిలుపుకోవాలనా?

పెత్తనాన్ని తిరిగి నిలుపుకోవాలనా?


ఆంధ్ర సినీ పెద్దల పెత్తనం తెలంగాణలో జారీ పోతున్న క్రమంలో దానిని తిరిగి నిలబెట్టుకునేందుకు ఆడుతున్న తెరచాటు నాటకంలో ఇది ఒక భాగమై ఉంటుందని తెలంగాణ వాదులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పాపరావు ఇదివరకే సుబ్బరామిరెడ్డి ప్రయత్నాలను ఖండించారు. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణవాదులు బహిష్కరించాలని కోరుతూ వారం రోజుల క్రితం ప్రకటన కూడా చేశారు. తాజాగా ఖిలా వరంగల్‌ ప్రాంతానికి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కూడా సోమవారం సుబ్బరామిరెడ్డి కార్యక్రమాన్ని ఖండించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘కాకతీయ కళావైభవం' పేరుతో జరిపే ఆంధ్రసినీ ప్రముఖల సన్మాన కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ప్రకటించారు.

English summary
Local Telangana Leaders are protesting against the awards felicitation function for Cine Artists which is going to organize by T.Subbarami Reddy in the name of 'Kakatiya Kala Vaibhavam' here in Warangal Fort on 11th March. Two days back Subbarami Reddy came to warangal and searched for a place to organize this program. He selected the place beside Khush Mahal in Warangal Fort and ordered the concerned people to construct a huge dias in that place. But Telangana Leaders and locals are giving warnings that they are going to stop this event at any cost.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X