ప్రగతి భవన్ ముందు నిరసన.!రాహుల్ ఓయూ పర్యటనకు అనుమతి ఎందుకివ్వరన్న జగ్గారెడ్డి.!
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ విధ్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి మాత్రమే నిర్థారించారు తప్ప రాజకీయం చేయడం కోసం కాదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, తూర్పు జగ్గారెడ్డి వివరించారు. రాష్ట్ర విభజన జరగాలని కోరిన ఉస్మానియా యూనివర్సిటీ విధ్యార్థులు రాష్ట్రం ఇచ్చిన తర్వాత, హామీలన్నీపూర్తయ్యాయా లేదా అనే విషయాన్ని విధ్యార్దులతో మాట్లాడాలనే ఉద్దేశంతో ఓయూకి వస్తున్నారు తప్ప వేరే కారణం కాదన్నారు జగ్గారెడ్డి. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వైస్ ఛాన్సలర్ కు వినతిపత్రం ఇస్తే, ఆ వినతి పత్రాన్ని పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. అందుకే న్యాయస్దానం గడపతొక్కామన్నారు జగ్గారెడ్డి.

అయినా రాహుల్ గాంధీ పర్యటన అనుమతి కోసం న్యాయపరంగా హైకోర్టును ఆశ్రయించామన్నారు జగ్గారెడ్డి. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను మరోసారి కలవడానికి ప్రయత్నించినా అందుబాటులో ఉండడంలేదని జగ్గారెడ్డి తెలిపారు. సీఎం చంద్రశేఖర్ రావు, రాహుల్ గాంధీ పర్యటనను వీసీ ప్రోద్బలంతో అడ్డుకుంటుంన్నారని, అందుకే ప్రగతి భవన్ ముందు తాను మరియు ఓయూ జేఏసీ విధ్యార్ది నాయకులు, ఎన్ ఎస్ యూ ఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు బుదవారం సాయంత్రం ప్రగతి భవన్ ముందు నిసరన తెలపాలని నిర్ణయించామని జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పట్ల, రాహుల్ గాంధీ పర్యటన పట్ల ఇన్ని ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందా అని తెలంగాణ ప్రభుత్వాన్ని జగ్గారెడ్డి సూటిగా ప్రశ్నించారు.