హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రయాణికులే టార్గెట్: సెల్‌ఫోన్లు, పర్సులు క్షణాల్లో మాయం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆటో ప్రయాణికులనే టార్గెట్ చేస్తూ సెల్ ఫోన్ల దొంగ తనాలకు పాల్పడుతున్న ముఠా ఆటకట్టించారు పోలీసులు. ఆటో ప్రయాణికుల దృష్టి మరల్చి వారి నుంచి పర్సులు, సెల్ ఫోన్లు కొట్టే వాటిని జగదీశ్ మార్కెట్లో ఈ దొంగల పని అని తూకారం గేట్ పోలీసులు తెలిపారు.

నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్: నిందితుల్లో మాజీ హోంగార్డు

తాము టాస్క్‌ఫోర్స్‌ పోలీసులమంటూ బెదిరిస్తూ.. ఒంటరిగా సంచరించే వ్యక్తుల నుంచి నగలు, నగదు దోచుకుంటున్న నలుగురు నకిలీలను ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. ఏసీపీ వేణుగోపాల్‌రావు తెలిపిన ప్రకారం కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన ముత్తవరపు వెంకటేశ్వర్లు అలియాస్‌ శ్రీను(48) పలు ఠాణాల్లో 1987 నుంచి 2000 వరకు హోంగార్డుగా పనిచేశాడు.

అక్రమ వసూళ్ల కారణంగా సస్పెన్షన్‌కు గురయ్యాడు. కాగా, బంజారాహిల్స్‌కు చెందిన షేక్‌ మహమ్మద్‌(44) అనే ఆటోడ్రైవర్‌, మొఘల్‌పురాకు చెందిన మహ్మద్‌ అజీజ్‌(34) అనే బైక్‌ మెకానిక్‌, గౌలిగూడకు చెందిన ఆటోడ్రైవర్‌ గోలి రవి అలియాస్‌ రవికుమార్‌(54)లతో ముఠాగా ఏర్పడ్డారు. పోలీస్‌ కానిస్టేబుళ్లుగా నకిలీ గుర్తింపు కార్డులు చేసుకున్నారు.

స్కూటర్‌పై సంచరిస్తూ ఒంటరిగా సంచరించే వారిని, రాత్రిళ్లు ఇంటికి వెళ్తున్న పాదచారుల్ని అడ్డగించి పోలీసులమంటూ బెదిరించి నగలు, నగదు దోచుకుంటున్నారు. ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో 3 చోట్ల వీరు దోపిడీలకు పాల్పడ్డారు.

మంగళవారం ఉదయం ఓ నగల దుకాణం వద్ద సంచరిస్తున్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నేరం బయటపడింది. నలుగురు నిందితుల్నీ అరెస్ట్‌చేసిన పోలీసులు వారి వద్ద రూ.20 వేల నగదు, 1.5తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు.

ఫర్వేజ్

ఫర్వేజ్

ఆటో ప్రయాణికులనే టార్గెట్ చేస్తూ సెల్ ఫోన్ల దొంగ తనాలకు పాల్పడుతున్న ముఠా ఆటకట్టించారు పోలీసులు.

ఫయాజ్

ఫయాజ్

ఆటో ప్రయాణికుల దృష్టి మరల్చి వారి నుంచి పర్సులు, సెల్ ఫోన్లు కొట్టే వాటిని జగదీశ్ మార్కెట్లో ఈ దొంగల పని అని తూకారం గేట్ పోలీసులు తెలిపారు.

ఖాదిర్

ఖాదిర్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారాసిగూడకు చెందిన ఖాజా పాషా(23) అనే ఆటో డ్రైవర్.. ఇదే ప్రాంతానికి చెందిన మహ్మద్ సల్మాన్(24), పాతబస్తీకి చెందిన ఫర్వేజ్(22), మహ్మద్ ఖాదిర్(21), మహ్మద్ షహ్వాజ్(22) ముఠాగా ఏర్పడ్డారు. కొంతకాలంగా వీరు ఆటో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు.

ఖాజా పాషా

ఖాజా పాషా

ప్రతి రోజూ ముఠాలో కొందరు ఖాజా పాషా ఆటోలో ప్రయాణికుల మాదిరిగా ఎక్కి కూర్చుంటారు. ఆ ఆటో ఎక్కిన ప్రయాణికుల దృష్టి మరల్చి వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు, పర్సులు చోరీ చేస్తారు. ఆ తర్వాత వాటిని జగదీవ్ మార్కెట్‌లోని మరో స్నేహితుడు ఫయాజ్(23)కు విక్రయిస్తారు.

సల్మాన్

సల్మాన్

ఆదివారం సాయంత్రం వీరందరూ సికింద్రాబాద్ మహేంద్రాహిల్స్‌లోని సంతోష్ సొసైటీకి వచ్చి చోరీ సొత్తు అమ్మగా వచ్చిన డబ్బులు పంచుకుంటున్నారు.

షావాజ్

షావాజ్

విశ్వసనీయ సమాచారం ప్రకారం తుకారంగేట్ ఎస్ఐ సాయికుమార్ తమ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లి ఆరుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల్లో మహ్మద్ ఫర్వేజ్‌పై మర్డర్ కేసు, రెయిన్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ ఉందని, మిగితా వారు జేబుదొంగలని పోలీసులు తెలిపారు. నిందితులందర్నీ రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్

నకిలీ పోలీసుల ముఠా అరెస్ట్

తాము టాస్క్‌ఫోర్స్‌ పోలీసులమంటూ బెదిరిస్తూ.. ఒంటరిగా సంచరించే వ్యక్తుల నుంచి నగలు, నగదు దోచుకుంటున్న నలుగురు నకిలీలను ఎల్బీనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు.

English summary
Hyderabad LB Nagar police on Tuesday busted a four-member pseudo police gang and recovered Rs 50,000 worth property from their possession.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X