వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాడ్సే జ్ఞాపకం గాల్లో కలిసిపోయింది .!తవ్వితీసిన నాగబాబు..!సర్వత్రా వినిపిస్తున్న విమర్శలు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కాలగర్బంలో కలిసిపోయిన కొన్ని సంచలన సంఘటనలను మననం చేసుకోవడం వేరు, వాటి గురించి స్పందించడం వేరు. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిపోయి చరిత్రాత్మకమయిన ఘటనలకు ప్రస్తుతం వ్యక్తుల అభిప్రాయాలతో ఏమాత్రం సంబందం ఉండదు. ఎవరు ఎంత స్పందించినా, గింజుకున్నా ఆ సంఘటనలకు ఉండే ప్రాముఖ్యత అలాగే ఉంటుంది తప్ప దాని ఉద్దేశం మాత్రం మారదు. అలాంటి ఘటనల పట్ల స్పందన వ్యక్తం చేసినప్పుడు నియంత్రణ, ఇంగితం, విజ్ఙత కోల్పోతే స్పందిచిన వ్యక్తి పెద్ద ప్రమాదంలో పడే ఆస్కారం కూడా ఉంటుంది. మరి కొన్ని సందర్బాల్లో రాజ్యాంగానికి లోబడి శిక్షలు కూడా ఖరారవుతాయి.

ఏపీ బెటర్! మహమ్మారి కరోనా విషయంలో ఇలానా?: తెలంగాణ సర్కారుపై కేంద్రం ఆగ్రహంఏపీ బెటర్! మహమ్మారి కరోనా విషయంలో ఇలానా?: తెలంగాణ సర్కారుపై కేంద్రం ఆగ్రహం

భారతదేశంలో ఉన్న ఎత్తైన శిఖరం లాంటి వ్యక్తి గాంధీ.. ప్రతి పౌరుడు గర్వపడాల్సిందే..

భారతదేశంలో ఉన్న ఎత్తైన శిఖరం లాంటి వ్యక్తి గాంధీ.. ప్రతి పౌరుడు గర్వపడాల్సిందే..

అంతకన్నా ముందు సామాన్య ప్రజానికం ద్వారా తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జబర్థస్థ్ యాంకర్ కొణిదెల నాగబాబు నాథూరాం గాడ్సే గొప్ప దేశభక్తిగలవాడని స్పందించినందుకు ఊహించని వ్యతిరేకతను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఇదే అంశం పట్ల నాగబాబు మీద ఫిర్యాదుల వెల్లువలు కూడా తెరమీదకు వస్తున్నాయి. వాస్తవానికి మన దేశంలో నాథూరాం గాడ్సేను సమర్థించేవారంతా గాంధీ వ్యతిరేకులు కాదు. ఐనప్పటికి ఏదైనా ప్రకటన చేసేముందు కొందరి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని సంయమనంగా వ్యవహరించడం శ్రేయస్కరమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తలచుకోవడం వేరు, స్పందించడం వేరు.. గాడ్సే గురించి స్పందించి ఇరుక్కుపోయిన నాగబాబు..

తలచుకోవడం వేరు, స్పందించడం వేరు.. గాడ్సే గురించి స్పందించి ఇరుక్కుపోయిన నాగబాబు..

ఒక వర్గం బలపడటానికి గాంధీయే కారణం అన్న బాధతో గాడ్సేను సమర్థించే వాళ్లు కూడా దేశంలో లేకపోలేదు. అసలు గాడ్సే నేపథ్యం ఏంటో కూడా వారికి తెలియదు. ఐనప్పటికి గాంధీ మరణానికి కారణమయ్యాడని గాడ్సేను చాలా వరకు వ్యతిరేకిస్తుంటారు భారతీయులు. ఐతే ఇక్కడ నాగబాబు గాంధీ చరిత్ర చదివినట్టే, గాడ్సే గురించి కూడా బాగా తెలుసుకున్న తర్వాతే ట్వీట్ చేసినట్టు వివరణ ఇస్తున్నారు. ఎన్ని వివరణలు ఇచ్చినా, మెగా ఫ్యామిలీతో పాటు, జనసేన పార్టీకి నాగబాబు పెద్దయెత్తున చిక్కులు తెచ్చి పెట్టాడనే చర్చ జరుగుతోంది. అంతా జరిగిన తర్వాత తనకు మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవమని వివ‌ర‌ణ ఇస్తున్నా నాగబాబు మీద విమర్శలు మాత్రం తగ్గడం లేదు.

మహాత్ముడి ఔన్నత్యం గొప్పది.. గాడ్సే ఓ ముగిసిన అద్యాయం..

మహాత్ముడి ఔన్నత్యం గొప్పది.. గాడ్సే ఓ ముగిసిన అద్యాయం..

గాంధీ ఔన్నత్యం గురించి పూర్తిగా తెలిసినప్పటికి, నాగబాబు నాథూరామ్ గాడ్సే తరఫున అనూహ్యంగా స్పందించి నిట్ట నిలువునా ఇరుక్కుపోయారు. నాగబాబు వివాదం ఆ కుటుంబాన్ని ఇరుకున పెట్టడమే కాదు, రాజకీయంగా జనసేనను ఇరుకున పెట్టింది. వీటికితోడు కాంగ్రెస్ నేత కోటూరి మానవతారాయ్ తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషనులో నాగబాబుపై కేసు పెట్టారు. ఆయనకు మతి భ్రమించిందని, ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి తరలించమని కోరారు. అతని మానసిక స్థితి బాలేనందు వల్లే గాడ్సేను కీర్తించారన్నారు.

Recommended Video

Mega Brother Nagababu Praises PM Modi & CM KCR
నాగబాబును ఇరుకున పెట్టిన ట్వీటు.. సంచలనాలకు కారణమవుతుంది ఇదే..

నాగబాబును ఇరుకున పెట్టిన ట్వీటు.. సంచలనాలకు కారణమవుతుంది ఇదే..

ఇంతకీ నాగబాబు చేసిన ట్వీట్ ను, అందులోని అంశాన్ని ఓ సారి చూద్దాం. ఈ రోజు నాధురాం గాడ్సే పుట్టిన రోజు.నిజమైన దేశ భక్తుడు.గాంధీ ని చంపడం కరెక్టా కదా అనేది చర్చనీయాంశం. కానీ అతని వైపు ఆర్గుఎమెంట్ ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు.కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే).గాంధీ ని చంపితే ఆపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేసాడు.కానీ నాధురాం దేశభక్తి ని శంకించలేము.ఆయన ఒక నిజమైన దేశభక్తుడు.ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తుచేసుకోవలనిపించింది.పాపం నాధురాం గాడ్సే...మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అని నాగబాబు ట్వీట్ చేసారు. మనకు ఎన్నయినా అభిప్రాయాలుండొచ్చు. కానీ అన్నిటినీ బయటకు చెప్పలేం. కొన్ని మనసులో దాచుకోక తప్పదు. కాదని బహిర్గతంగా స్పందిస్తే.. ఇదుగో ఇలాగే ఉంటుంది.

English summary
Nagababu responded spectacularly on behalf of Nathuram Godse and was trapped. Not only did the conflict not only the Nagababu family but also politically embarrass Janasena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X