• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా క్లిష్ట సమయంలో ప్రజాసేవ.!దైర్యంతో ముందడుగు వేస్తున్న శైలేష్ సేవా సదన్ యజమాని.!

|

హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో తను తన కుటుంబం క్షేమంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఆ దిశగా అలుపెరగని ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఎవరైనా ఏదైనా సహాయం కోసం ఇంటిముందుకొచ్చి అర్థించినా కాదు, కుదరదు అని మొహం మీదే చెప్పేసి తలుపు ధడేల్ మని వేసేసుకుంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకుంటున్నాయి. పక్క వాడికి జ్వరం వచ్చింది అని తెలిస్తే చాలు అటువైపు చూడడం మానేస్తున్నారు చాలా మంది. ఇక అవతలి వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయని తెలిస్తే దాదాపు సమాజం నుండి వెలివేసినంత పని చేస్తున్నారు మరికొంత మంది.

 కరోనా క్లిష్ట సమయం.. వారికి సేవచేయడమే లక్ష్యం అంటున్న శైలేష్ సేవా సదన్ యజమాని..

కరోనా క్లిష్ట సమయం.. వారికి సేవచేయడమే లక్ష్యం అంటున్న శైలేష్ సేవా సదన్ యజమాని..

ఇలాంటి తరుణంలో కరోనా రోగులు త్వరగా కోలుకునేందుకు వారికి అనూహ్య రీతిలో వినూత్న సేవలు చేస్తున్నారు శైలేష్ సేవా సదన్ యజమాని తూము శైలేష్ కుమార్. కేవలం కరోనా పేషెంట్లకే కాకుండా నగరంలోని పలు అనాథలకు కూడా చేతనైన సాయం చేస్తుంటాడు శైలేష్ కుమార్. ముఖ్యంగా కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షలతో ఉపాదికోల్పోయిన చాలా మందికి మద్యాహ్నం, రాత్రి ఉచితంగా భోజన సదుపాయం ఏర్పాటు చేస్తుంటాడు శైలేష్ కుమార్. అంతే కాకుండా నిరుపేదలకు కూరగాయలు, బియ్యంతో పాటు నిత్యవసర సరుకులను కూడా ఉచితంగా పంపిణీ చేస్తుంటారు.

 కోవిడ్ పేషెంట్ల కి సేవ.. తెగింపు, ధైర్యం ఉండాలంటున్న డాక్టర్లు..

కోవిడ్ పేషెంట్ల కి సేవ.. తెగింపు, ధైర్యం ఉండాలంటున్న డాక్టర్లు..

ప్రస్తుతం కరోనా రెండవ దశ తీవ్రంగా ప్రభావం చూపిస్తున్న తరుణంలో కరోనా పేషెంట్ల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు శైలేష్. ప్రధానంగా రక్తం కావాలన్నా, ప్లాస్మా కావాలన్నా తనకున్న పరిచయాలతో తన దగ్గరికి వస్తున్న వారికి ఆ సౌకర్యాలు అందేలా చూస్తున్నారు. తానే స్వయంగా బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులతో మాట్లాడి బ్లడ్ కావాలన్నా, ప్లాస్మా కావాలన్ని ఇప్పిస్తుంటారు. అంతే కాకుండా ప్రముఖ ఆసుపత్రులకు ఫోన్ చేసి కరోనా పేషెంట్లకు బెడ్లు ఇప్పించి తన సేవా తత్వాన్ని చాటుకుంటున్నారు శైలేశ్ కుమార్.

 గత లాక్‌డౌన్ లో ఎన్నో కార్యక్రమాలు.. ఎంతోమంది నిరుపేదల ఆకలి తీర్చిన సేవా సదన్..

గత లాక్‌డౌన్ లో ఎన్నో కార్యక్రమాలు.. ఎంతోమంది నిరుపేదల ఆకలి తీర్చిన సేవా సదన్..

ప్రస్తుతం కరోనా కష్ట కాలంలో పేదలకు అండగా వుండాలని, ఒక వేళ లాక్‌డౌన్ నిబంధనలు అమలైతే ఏవిధంగా సహాయ కార్యక్రమాలు రూపొందించాలనే దృఢ సంకల్పంతో శైలేశ్ సేవా సదన్ ఉన్నట్టు తెలుస్తోంది. పక్క గ్రామాలనుండి కూరగాయలు తెప్పించి నిరుపేదలకు పంచే క్రమంలో నగరం చుట్టు పక్క గ్రామాల రైతులతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. కరోనా మరింత విజృంభించి లాక్‌డౌన్ పరిస్థితులు అనివార్యం అయితే తన కార్యాచరణ పట్ల స్పస్టతతో ఉన్నట్టు శైలేష్ చెప్పుకొస్తున్నారు. నిరుపేదలకు, అనాథలకు సేవచేయడంలో ఉన్న ఆత్మ సంతృప్తి మరే ఇతర సేవలో ఉండదని శైలేశ్ అభిప్రాయపడుతున్నారు.

 సేవ చేయడంలో ఉన్న తృప్తి ఎందులో ఉండదు.. సేవా సదన్ యజమాని అంతరంగం..

సేవ చేయడంలో ఉన్న తృప్తి ఎందులో ఉండదు.. సేవా సదన్ యజమాని అంతరంగం..

కరోనా సమయంలోనే కాకుండా మూడు కాలాల్లో సంభవించే విపత్తుల ద్వారా ప్రజానికాన్ని ఆదుకుంటారు శైలేష్. చలి కాలంలో రోడ్లపై చలికి వణికిపోతున్న అభిగ్యులను గుర్తించి వారికి స్వచ్చందంగా రగ్గులు పంపిణీ చేయడం, ఎండా కలాంలో అనేక కూడళ్ల వద్ద చలివేంద్రాలు, మజ్జిగ సౌకర్యాలు కల్పంచడం శైలష్ సేవా సదన్ లక్ష్యమని పేర్కొంటున్నారు. రాజకీయాలకు అతీతంగా కష్టాల్లో ఉన్న ఎవరినైనా ఆదుకోవడం శైలష్ సేవా సదన్ ద్యేయమని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. చిన్న సహాయం చేసి పెద్ద ప్రచారం కల్పించుకునే ఈ రోజుల్లో ఇంత సేవ చేస్తున్నా ప్రచారంకన్నా ప్రజల మనసుల్లో ఉంటే చాలు అంటున్న శైలేష్ వ్యక్తిత్వానికి నిజంగా హాట్స్ ఆఫ్..!!

English summary
Shailesh is currently doing a number of service programs for corona patients at a time when the second phase of corona is having a serious impact. He seeks to facilitate those who come to him with contacts who are primarily in need of blood or plasma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X