కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనూహ్యం: జగన్ పార్టీలోకి డిఎల్ రవీంద్రా రెడ్డి? ఫ్లెక్సీల కలకలం

By Narsimha
|
Google Oneindia TeluguNews

కడప :రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2011 లో బరిలోకి దిగిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి వైఎస్ఆర్ సి పి లో చేరుతున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది.

వైఎస్ఆర్ సి పి అధినేత జగన్ పేరును చెబితేనే డిఎల్ రవీంద్రారెడ్డి ఒంటికాలిపై లేచేవాడు.ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిణామాలు నెలకొన్న నేపథ్యంలో డిఎల్ రవీంద్రారెడ్డి వైసిపిలోకి చేరుతారనే ప్రచారం సాగుతోంది.

2014 అసెంబ్లీ ఎన్నికల ముందు టిడిపిలోకి వెళ్ళేందుకు రవీంద్రారెడ్డి ప్రయత్నించారు. ఎన్నికల ముందు చంద్రబాబునాయుడును వచ్చి కలిసివెళ్ళాడు. అయితే ఏ స్థానం నుండి పోటీచేసే విషయంలో స్పష్టత రాలేదు.దీంతో రవీంద్రారెడ్డి టిడిపిలో చేరడం ఆగిపోయింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టిడిపి అభ్యర్థులకు సహకరించారు. అయితే ఎన్నికల తర్వాత మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల కాలంలో తిరిగి కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్నట్టుగా కన్పించారు.

 వైఎస్ఆర్ సి పి లోకి డిఎల్ రవీంద్రారెడ్డి?

వైఎస్ఆర్ సి పి లోకి డిఎల్ రవీంద్రారెడ్డి?


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి డిఎల్ రవీంద్రారెడ్డి చేరుతారని కడప జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మైదుకూరు నియోజకవర్గంలో ఈ ప్రచారం సాగుతోంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఫోటోను చేర్చారు. దీంతో డిఎల్ వైసిపిలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

 .డిఎల్ ను కలిసి వైఎస్ వివేకానందరెడ్డి

.డిఎల్ ను కలిసి వైఎస్ వివేకానందరెడ్డి


మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి కలిశారు. స్థానిక సంస్థల ఎంఏల్ సి ఎన్నికల్లో వివేకానంద రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.అయితే ఈ విషయమై మైదుకూరు నియోజవక్గంలోని తన అనుచరుల మద్దతును డిఎల్ కోరినట్టుగా తెలుస్తోంది. ఈ విషయమై డిఎల్ తో చర్చించారు. అయితే డిఎల్ నుండిఆయన సానుకూలమైన హమీని తీసుకొన్నారని ప్రచారం సాగుతోంది.

 డిఎల్ చేరితే రఘురామిరెడ్డి ఎటువైపు

డిఎల్ చేరితే రఘురామిరెడ్డి ఎటువైపు


మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే మైదుకూరు ఎంఏల్ఏ రఘురామిరెడ్డి పరిస్థితి ఏమిటనే విషయమై చర్చ సాగుతోంది. రఘురామిరెడ్డి గతంలో టిడిపిలో ఉండేవాడు. టిడిపిని వీడి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.అయితే డిఎల్ రవీంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే రఘురామిరెడ్డి అదే పార్టీలో ఉంటారా పార్టీ మారుతారా అనే చర్చ సాగుతోంది.

డిఎల్ నిర్ణయం జిల్లా రాజకీయాలపై ప్రభావం

డిఎల్ నిర్ణయం జిల్లా రాజకీయాలపై ప్రభావం

మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎన్నికల ముందే ఆయన టిడిపి వైపు చూసినప్పటికీ కూడ స్థానికంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన టిడిపిలో చేరలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న డిఎల్ రవీంద్రారెడ్డి తీసుకొనే నిర్ణయాలు ఆ జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది,

English summary
ys vivekanda met former minister dl ravindra reddy for his support upcomining mlc elections.there is a publicity dl ravindra reddy joih in ycp soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X