హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ హత్యకు కుట్ర, నిధుల సమీకరణ?: వరవరరావు అరెస్ట్, ఇళ్లలో పోలీసుల సోదాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరరావు నివాసంలో పుణె పోలీసులు మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేశారు. ఆయన కుమార్తెతో పాటు నాగోల్‌లో ఓ రిపోర్టర్ నివాసంలోనూ సోదాలు నిర్వహించారు.

గాంధీనగర్‌లోని వీవీ హౌస్‌లో వరవరరావును పోలీసులు విచారించారు. అనంతరం వరవరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. పుణెకు తరలించారు. వరవరరావు ఆరోగ్యం బాగోలేదని కుటుంబసభ్యులు చెప్పగా.. తాము ఆయనకు అవసరమైన వైద్యం అందిస్తామని పోలీసులు తెలిపినట్లు సమాచారం.

మోడీ హత్య కుట్రలో వరవరరావు

మోడీ హత్య కుట్రలో వరవరరావు


ప్రధాని మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు చేసిన కుట్రలో వరవరరావు పేరు ఉన్నట్లు గతంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మావోయిస్టులు రాసిన లేఖలో వరవరరావు పేరు ఉన్నట్లు గుర్తించిన పుణె పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

 నిధులు సమీకరించారు?

నిధులు సమీకరించారు?

ఈ కుట్రలో మావోయిస్టులకు నిధుల సమీకరణలోనూ వరవరరావు పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పుణె నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న పోలీసులు మంగళవారం తెల్లవారుజామున నాలుగు బృందాలుగా ఏర్పడి సోదాలు చేపట్టారు.

నగరంలోని నాలుగు చోట్ల సోదాలు

నగరంలోని నాలుగు చోట్ల సోదాలు

వరవరరావు, ఆయన కుమార్తె, ఆయన స్నేహితులు, నాగోల్‌లోని ఓ రిపోర్టర్ నివాసంలో పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. వరవరరావు ఎవరితోనూ సంప్రదింపులు చేయకుండా ఆయన ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేయించారు.

 గతంలో ఖండించిన వరవరరావు... సంధ్య ఆగ్రహం

గతంలో ఖండించిన వరవరరావు... సంధ్య ఆగ్రహం


మోడీ హత్య కుట్రకు సంబంధించి గతంలో కేసు నమోదైన అందరి ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే, గతంలో వచ్చిన ఆరోపణలను వరవరరావు గతంలోనే ఖండించారు. తాజాగా, వరవరరావు ఇంట్లో సోదాలు నిర్వహించడంపై సామాజిక కార్యకర్త సంధ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాధార ఆరోపణలతో సోదాలు నిర్వహించడం సరికాదన్నారు.

English summary
Police from Pune conducted searches at the residences of revolutionary writer P Varavara Rao and a local journalist in the city on Tuesday in connection with a letter containing the Maoists plot to assassinate PM Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X