వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'డ్రగ్స్‌'కు వ్యతిరేకంగా సినిమాల ద్వారా ప్రచారం: వెంకయ్యనాయుడు

డ్రగ్స్ విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి ఎం. వెంకయ్యనాయుడు కోరారు. కెబిఆర్ పార్క్ వద్ద ఆదివారం ఉదయం నిర్వహించిన యాంటీ డ్రగ్స్ వాక్‌లో ఆయన పాల్గొన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి ఎం. వెంకయ్యనాయుడు కోరారు. కెబిఆర్ పార్క్ వద్ద ఆదివారం ఉదయం నిర్వహించిన యాంటీ డ్రగ్స్ వాక్‌లో ఆయన పాల్గొన్నారు. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే చెడు ప్రభావాలపై ప్రచారం చేయాలని ఆయన సూచించారు.

మత్తులో కొందరు తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ తోడ్పాటును అందించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.

డ్రగ్స్ వల్ల ఏ రకంగా జీవితాలు నాశనం అవుతున్నాయో ప్రజలకు వివరించాలని, ఈ విషయంలో మీడియా తనవంతు పాత్రను పోషించాలని ఆయన కోరారు. శరీరం, మనస్సు, సృజనాత్మకతను డ్రగ్స్ చిద్రం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

punish who sold drugs, says venkaiah naidu

డ్రగ్స్‌కు దూరంగా ఉండేటా సినిమాల ద్వారా ప్రచారం చేయాలని ఆయన కోరారు. సే నో టూ డ్రగ్స్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు.

డ్రగ్స్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్ చెప్పారు. డ్రగ్స్ మహహ్మారిని నిర్మూలించేందుకు కృషి చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. డ్రగ్స్ నిర్మూలన అనేది ప్రభుత్వ బాధ్యతే కాదన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
NDA vice presidential candidate Venkaiah Naidu participated in anti drugs walk held at Hyderabad on Sunday.he demanded to officials to punish who sold drugs .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X