వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్ తీసుకున్నాడా, లేదా.. తేలనుంది: పూరీ జగన్నాథ్‌కు సిట్ షరతులు

ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని పరిశీలించేందుకు వీటిని తీసుకున్నారు. ఈ శాంపిల్స్‌ను పరీక్షిస్తే ఎఫ్ఎస్ఎల్ నివేదికలో ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా తెలియనుంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ నుంచి వైద్యులు రక్తం, 50 వెంట్రుకలు, గోర్లు తీసుకున్నారు. ఆయన కాలి, చేతి గోళ్లను తీసుకున్నారు. అలాగే 5 ఎంఎల్ రక్తం తీసుకున్నారు.

కెల్విన్‌తో పరిచయంపై పూరీ జగన్నాథ్ షాకింగ్, కానీ: పూరీతోనే రవితేజ, చార్మిలకు.. కెల్విన్‌తో పరిచయంపై పూరీ జగన్నాథ్ షాకింగ్, కానీ: పూరీతోనే రవితేజ, చార్మిలకు..

శాంపిల్స్ సేకరణ

శాంపిల్స్ సేకరణ

ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని పరిశీలించేందుకు వీటిని తీసుకున్నారు. ఈ శాంపిల్స్‌ను పరీక్షిస్తే ఎఫ్ఎస్ఎల్ నివేదికలో ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా తెలియనుంది.

పూరీ సహకరించారు

పూరీ సహకరించారు

తాను శాంపిల్స్ తీసుకునే సమయంలో పూరీ జగన్నాథ్ సహకరించారని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వైద్యులు చెప్పారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. బీపీ, షుగర్ లెవల్స్ నార్మల్‌గా ఉన్నాయన్నారు.

ప్రతి కదలిక చెప్పాలి..

ప్రతి కదలిక చెప్పాలి..

కాగా, బుధవారం సుదీర్ఘ విచారణను ఎదుర్కొన్న పూరీ జగన్నాథ్ నీరసంగా కనిపించారు. మీడియాతో మాట్లాడకుండానే ఇంటికి వెళ్లిపోయారు. మరో విడుత విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని సిట్ అధికారులు చెప్పారు. ఆయన అంగీకరించారు. అదే సమయంలో తమకు చెప్పకుండా విదేశాలకు వెళ్లరాదని సిట్ అధికారులు ఆదేశించారు. ప్రతీ కదలికను తమకు చెప్పాలని, ఎక్కడ డ్రగ్స్ మూలాలున్నా సమాచారం అందించాలన్నారు.

వాట్సాప్ సందేశాలు చూపించారు..

వాట్సాప్ సందేశాలు చూపించారు..

డ్రగ్స్‌కు సంబంధించి అడిగినప్పుడు తనకు ఎలాంటి సంబంధం లేదని పూరీ తొలుత చెప్పినప్పటికీ.. ఇటీవల కెల్విన్‌తో పూరీ, అతని మనుషులు జరిపిన వాట్సప్‌ సందేశాలను చూపించగా.. వాటితో తనకు సంబంధం లేదని చెప్పాడని సమాచారం.

కెల్విన్‌తో మాట్లాడిన విషయాలు పూరి ముందు..

కెల్విన్‌తో మాట్లాడిన విషయాలు పూరి ముందు..

కెల్విన్‌తో తనకు పెద్దగా సంబంధాలు లేవని పూరీ జగన్నాథ్ చెప్పగా.. ఇరువురి మధ్యా జరిగిన సంభాషణలు ఆయన ముందు పెట్టినట్లుగా తెలుస్తోంది. కాగా, నోటీసులు అందుకున్న ఎక్కువ మంది ప్రముఖుల్లో పూరీ సన్నిహితులో ఉన్నారు.

English summary
The Special Investigation Team of the prohibition and excise department grilled film director Puri Jagannath, followed by the NCB for about 11 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X