వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ప్రధాని కూతురికి కేసీఆర్ ఆఫర్!.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా వాణిదేవి?.. టీఆర్ఎస్ అనూహ్య ఎత్తుగడ..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ విషయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అనూహ్య ఎత్తుగడలను సిద్ధం చేసింది. ప్రతిపక్ష పార్టీలుగానీ, సొంత నేతలుగానీ నోరెత్తలేని విధంగా అభ్యర్థుల ఎంపికను చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా, 'తెలంగాణ ఠీవి పీవీ' అంటూ మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కీర్తించే ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ దివంగత నేత కుటుంబానికి పదవిని ఆఫర్ చేసినట్లు సమాచారం. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీలోనూ సీఎం ఈ అంశాన్ని ప్రస్తావించారని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి.

జగన్ గృహప్రవేశం నాడే రోజా కుండబద్దలు - వేణుగోపాల్ మాటే ఫైనల్ - రఘురామకు రాష్ట్రపతి రివర్స్ షాక్జగన్ గృహప్రవేశం నాడే రోజా కుండబద్దలు - వేణుగోపాల్ మాటే ఫైనల్ - రఘురామకు రాష్ట్రపతి రివర్స్ షాక్

మూడు ఎమ్మెల్సీలు ఖాళీ..

మూడు ఎమ్మెల్సీలు ఖాళీ..

అన్ని రకాల ఎమ్మెల్సీలు కలిపి తెలంగాణలో మొత్తం 40 పదవులు ఉండగా, అందులో గవర్నర్ కోటాకే చెందిన మూడు స్థానాల్ని భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన రాములు నాయక్ పదవీ కాలం ముగియడంతో మార్చిలో ఒకటి, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పదవి కాలం ముగియడంతో జూన్ లో మరో ఎమ్మెల్సీ ఖాళీకాగా, మండలిలో ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ గడువు ఆగస్టు 17తో ముగియనుంది. వీటి భర్తీలో ఈ మూడు పదవులపై పార్టీ చెందిన రెండు పదవులు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. ఆగస్టు 17న ఇదే కోటాలో మూడో పోస్టు కూడా ఖాళీ కానుంది.

పీవీ తనయ వాణిదేవికి అవకాశం..

పీవీ తనయ వాణిదేవికి అవకాశం..

ఖాళీ కానున్న మూడు ఎమ్మెల్సీల్లో రెండు స్థానాల్లో పాతవాళ్లనే కొనసాగిస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని నాయినికి.. ఎమ్మెల్సీగా మరో టర్మ అవకాశమిస్తానని కేసీఆర్ వాగ్ధానం చేశారని, విప్ గా కర్నె ప్రభాకర్ ను కొనసాగించడానికే సీఎం మొగ్గుచూపుతారని వినికిడి. ఇక మూడో పోస్టును మాత్రం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు వాణిదేవికి ఇవ్వాలని అధినేత భావిస్తున్నట్లు తెలిసింది. నెలన్నర గ్యాప్ తర్వాత సోమవారం రాజ్ భవన్ కు వెళ్లిన కేసీఆర్.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించబోయే పేర్లను గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

పెద్దాయనకు గౌరం.. పార్టీకి లాభం..

పెద్దాయనకు గౌరం.. పార్టీకి లాభం..

పీవీ చేపట్టిన సంస్కరణల వల్లే దేశం ఇవాళ మనగలుగుతున్నదని, ఆర్థికంతోపాటు వివిధ రంగాల్లోనూ పీవీ గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని సీఎం కేసీఆర్ పలు మార్లు వ్యాఖ్యానించారు. ఆ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహిస్తున్నది. అంతటి ఘనమైన వ్యక్తిని సొంత పార్టీ కాంగ్రెస్ సరిగా ఆదరించకపోగా, అవమానించిందని కూడా కేసీఆర్ విమర్శించారు. పీవీ లెగసీని టీఆర్ఎస్ కొనసాగిస్తుందని చెప్పారు. ఇప్పుడు పీవీ కుటుంబానికి రాజకీయంగానూ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపొచ్చని సీఎం భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో టీఆర్ఎస్ కు పలు విధాలుగా లాభం చేకురుతుందని కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి.

కూల్‌డ్రింక్‌లో మత్తు మందు.. వైసీపీ ఎంపీ భర్త వసూళ్లు.. జగన్ సన్నిహితుడికి లంచం.. జోని కుమారి సంచలనంకూల్‌డ్రింక్‌లో మత్తు మందు.. వైసీపీ ఎంపీ భర్త వసూళ్లు.. జగన్ సన్నిహితుడికి లంచం.. జోని కుమారి సంచలనం

గ్రేటర్ ఎన్నికల్లో ఎఫెక్ట్..

గ్రేటర్ ఎన్నికల్లో ఎఫెక్ట్..

పీవీ తయన వాణిదేవికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ ఫాయిదా లభించొచ్చని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. గ్రేటర్ లోని 20కిపైగా డివిజన్లలో బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉన్న నేపథ్యంలో పీవీ వారసులకు పదవుల అంశం కలిసొస్తుందని గులాబి నేతల భావన. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రాజకీయాలకు అతీతమైనదనే భావన ఉంది కాబట్టి, పీవీ కుటుంబం కూడా ఇందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

Recommended Video

Tollywood Director Wise Words On Covid 19 | Oneindia Telugu
ఆశావాహుల జాబితా పెద్దదే..

ఆశావాహుల జాబితా పెద్దదే..

అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటే తప్ప సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ ఛాన్స్ ఉండొచ్చనే చర్చ కూడా పార్టీలో నడుస్తున్నది. నాయిని, కర్నెలకు ఎక్స్ టెన్షన్ హామీ లభించినప్పటికీ, అనుకోని పరిణామాలతో తమకు అవకాశం దక్కపోదా అని గులాబీ దళంలోనే ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. ఆ జాబితాలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, గ్యాదరి బాలమల్లు, గట్టు రామచంద్రరావు, రమేశ్ రెడ్డి, రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, గుండు సుధారాణి, తుల ఉమ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర నేతలు ఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో రెండు ఎమ్మెల్సీల భర్తీపై ప్రకటన వస్తుందని, ఒకవేళ ప్రకటన రాకుంటే, మూడు పదవులనూ ఆగస్టులోనే భర్తీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

English summary
Former Prime Minister PV Narasimha Rao’s daughter S Vani Devi might soon be entering the portals of Telangana Legislative Council as the Governor’s nominee. CM KCR reportedly discussed his proposal with Governor Tamilsai Soundararajan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X