వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీవీ సంస్కరణలే దేశాన్ని కాపాడాయి.. మాజీ ప్రధానికి కేసీఆర్, జగన్ నివాళి.. హెచ్‌సీయూకు పీవీ పేరు..

|
Google Oneindia TeluguNews

''ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయానికి దేశం అధకారంలో ఉండింది.. ఉన్న బంగారం నిల్వలను విదేశాల్లో తాకట్టు పెట్టుకునే పరిస్థితి. తనకు మాత్రమే సాధ్యమైన దేశాన్ని కాపాడి, ఆర్థిక రంగంలో మరింత ముందుకు నడిపించిన ధీరుడాయన..'' అంటూ మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కీర్తించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దేశాభివృద్ధి కోసం పీవీ అందించిన సేవలను తరతరాలు గుర్తుంచుకుంటాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మాజీ ప్రధాని పీవీ శతజయంతి సందర్భంగా ఇద్దరు సీఎంలు నివాళులు అర్పించారు.

Recommended Video

PV Narasimha Rao Birth Anniversary: Father of Reforms & Only PM From Telugu State

కంది పప్పు ధరలపై నారా లోకేశ్ ఫైర్.. రఘురామ స్టైల్లో 'యుశ్రారైకాపా'.. కొవ్వెక్కిదంటూ రోజా కౌంటర్..కంది పప్పు ధరలపై నారా లోకేశ్ ఫైర్.. రఘురామ స్టైల్లో 'యుశ్రారైకాపా'.. కొవ్వెక్కిదంటూ రోజా కౌంటర్..

పీవీ జ్ఞానభూమిలో..

పీవీ జ్ఞానభూమిలో..

శతజయంతి సందర్భంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావును దేశమంతా స్మరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నిర్వహించిన ‘మన్ కీ బాత్' కార్యక్రమంలో పీవీ సేవలను యాదిచేసుకున్నారు. పీవీ తెలంగాణకు చెందినవారు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నది. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో ఆదివారం జరిగిన ముఖ్య వేడుకలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.

360 డిగ్రీల వ్యక్తిత్వం..

360 డిగ్రీల వ్యక్తిత్వం..

‘‘పీవీ తెలంగాణకు ఠీవి. ఆయనది 360 డిగ్రీల అసాధారణ వ్యక్తిత్వం. ఆయన జీవితమంతా సంస్కరణతోనే సాగింది. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా.. ఏ హోదాలో పనిచేసినా ఆ పదవికే గౌరవం తీసుకొచ్చారు. రాజకీయాలకు సంబంధంలేని మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించుకుని, గొప్ప సంస్కరణలతో దేశాన్ని గట్టెక్కించారు. విద్యాశాఖ పేరును హెచ్ఆర్డీగా మార్చడమేకాదు, దేశంలో గురుకుల పాఠశాలన్ని ప్రారంభించింది కూడా పీవీనే. స్వతహాగా 1200 ఎకరాల భూస్వామిఅయినా, తనవకు కేవలం 150 ఎకరాలు ఉంచుకొని మిగతాది ప్రజలకు ఉపయోగించిన ఉదారవాది పీవీ'' అని కేసీఆర్ గుర్తుచేశారు.

జగన్‌కు మరో షాక్.. వైసీపీ గుర్తింపు రద్దుకు ఈసీకి YSRకాంగ్రెస్ ఫిర్యాదు.. రఘురామ ఎపిసొడ్‌లో ట్విస్ట్జగన్‌కు మరో షాక్.. వైసీపీ గుర్తింపు రద్దుకు ఈసీకి YSRకాంగ్రెస్ ఫిర్యాదు.. రఘురామ ఎపిసొడ్‌లో ట్విస్ట్

హెచ్‌సీయూకు పీవీ పేరు..

హెచ్‌సీయూకు పీవీ పేరు..


ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)కి పీవీ నరసింహారావు పేరు పెట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. దేశానికి గొప్పగా దిశానిర్దేశం చేసిన పీవీకి తగిన గుర్తింపు లభించలేదని, ఆయన పేరు ప్రఖ్యాతలు మరింత ఇనుమడింపజేసేలా తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని, పీవీకి భారతరత్న పురస్కారం విషయంలోనూ కేంద్రానికి లేఖ రాశామని కేసీఆర్ తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూకు సమాంతర వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పీవీ అని, 50కిపైగా దేశాల్లో ఆయన శతజయంతి ఉత్సవాలు జరుగుతుండటం గమనార్హమని కేసీఆర్ అన్నారు.

భావితరాలూ పీవీని స్మరిస్తాయి..

భావితరాలూ పీవీని స్మరిస్తాయి..

ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధికి విశేష కృషి చేసిన పీవీ నరసింహారావును రాబోయే తరాలు కూడా స్మరించుకుంటాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మాజీ ప్రధాని పీవీ శతజయంతి సందర్భంగా ఆయనకు సీఎం నివాళులు అర్పించారు. వివేకవంతుడైన రాజకీయవేత్త, బహుభాషా కోవిదుడిగా పీవీని కీర్తించారు. ప్రధానిగా పీవీ సేవలను మరువలేమని, దేశంలో సంస్కరణలకు ఆయనే ఆద్యుడని, పీవీ నిర్ణయాలతో దేశముఖచిత్రమే మారిపోయిందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

English summary
PV Narasimha Rao was a 360 degree personality says telangana CM KCR on the occassion of former Prime Minister 100th birth aniversary. kcr address to the gathering at the PV Gnana Bonomi on sunday. andhra pradesh cm ys jagan and other ysrcp leaders also remebers PV Narasimha Rao
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X