వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుదైన గౌరవం: సీఆర్పీఎఫ్ హానరరీ కమాండెంట్‌గా సింధు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : రియో ఒలింపిక్స్ 2016లో రజత పతక విజేత పీవీ సింధుకు మరో అరుదైన గౌరవం లభించింది. సింధును బ్రాండ్ అంబాసిడర్, గౌరవ కమాండెంట్‌గా నియమించాలని సీఆర్పీఎఫ్ నిర్ణయం తీసుకుంది.

కేంద్రమంత్రి ముందు సీఆర్పీఎఫ్ అధికారులు ఈ మేరకు తమ నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి ముందు ఉంచారు. ఆయన ఆమోదం లభించిన వెంటనే సీఆర్ఫీఎఫ్ సింధును బ్రాండ్ అంబాసిడర్, గౌరవ కమాండెంట్‌గా నియమించనుంది.

PV Sindhu appointed honorary commandant and brand ambassador by CRPF

ఈ మేరకు సమాచారాన్ని సింధుకు కూడా చేరవేసినట్లు సమాచారం. సీఆర్పీఎఫ్ కమాండెంట్ ర్యాంకు అంటే సాధారణంగా ఎస్పీ స్థాయి అధికారాలుంటాయి. ఒక వేళ ఫీల్డ్ ఆపరేషన్స్ కోసం వెళితే.. కమాండెంట్ కింద 1000మంది భద్రతా దళాలు పని చేస్తాయి.

ప్రస్తుతం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్స్‌లో పాల్గొంటున్న సీఆర్పీఎఫ్ దళాలు.. అవసరమైనప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాల్లో భద్రతా చర్యలను కూడా చేపడతాయి. అయితే, సింధు మాత్రం విరామం దొరికినప్పుడు సీఆర్ఫీఎఫ్ బలగాలు ప్రేరణ పూర్వకమైన కార్యక్రమాల్లో పాల్గొని, వారికి సందేశాలను ఇవ్వాల్సి ఉంటుంది.

ఇది ఇలా ఉండగా, రెండ్రోజుల క్రితం సింధు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

English summary
Country's largest paramilitary force CRPF has decided to appoint Olympic silver medallist P V Sindhu as it's brand ambassador and bestow the honorary rank of Commandant on the ace badminton player.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X