హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సింధు రికార్డ్: ఫైనల్ మ్యాచ్‌ని 6.6 కోట్లమంది చూశారు, హైద్రాబాద్‌లోను

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు తేజం పీవీ సింధు రియో ఒలింపిక్స్ ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో తలపడింది. పీవీ సింధు మ్యాచ్‌ను భారత్‌లో రికార్డు స్థాయిలో వీక్షించారు. ఆమె మ్యాచ్‌ను దేశంలో 6.6 కోట్ల మంది చూశారు. భారత దేశంలో 30 లక్షల మంది చూశారు.

ఇప్పటి వరకు మన దేశంలో సింగిల్ మ్యాచ్ ఆటలో అత్యధిక మంది చూసిన మ్యాచ్ పీవీ సింధుదే. అంతేకాదు, ఈ ఒలింపిక్స్‌లో ఓ మ్యాచ్‌ను అత్యధికంగా వీక్షించింది కూడా ఇదే. సెమీ ఫైనల్ కంటే ఫైనల్ మ్యాచ్‌ను 57.4 శాతం మంది ఎక్కువ చూశారు.

నెంబర్ 1 లక్ష్యం, పీవీ సింధుకు పోటీ కావొద్దని వదిలేశా: యాంకర్ సుమ

PV Sindhu's final match at Rio grabbed 66.5 m eyeballs in India

తద్వారా రెండింతల కంటే ఎక్కువ. ఫైనల్ మ్యాచ్ ప్రారంభ సమయంలో చూసిన వారు 1.64 కోట్ల మంది ఉండగా, క్రమంగా అది పెరిగింది. పదిహేను నిమిషాల తర్వాత ఈ మ్యాచ్ చూసే వారి సంఖ్య బాగా రిగింది. పదిహేను నిమిషాల్లోనే 1.64 కోట్ల నుంచి 3.8 కోట్లకు చేరుకుంది. సాధారణంగా ది కపిల్ శర్మ షోకు 5 కోట్ల వ్యూయర్ షిప్ ఉంది. పీవీ సింధు మ్యాచ్ దీనిని దాటేసింది.

కాగా, భారత్ తరఫున ఈసారి 117 మంది రియో ఒలింపిక్స్‌కు వెళ్లారు. ఇందులో పీవీ సింధు, సాక్షి మాలిక్‌లు వరుసగా రజతం, కాంస్యం సాధించారు. దీపా కర్మాకర్ జిమ్నాస్టిక్స్‌లో పతకం తృటిలో కోల్పోయింది. అయినా అందర్నీ ఆకట్టుకుంది.

English summary
Shuttler PV Sindhu’s badminton final match against Spain's Carolina Marin at the Rio Olympics had garnered 66.5 million viewers in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X