వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూతురి మాటలకు, పీవీ బతికుంటే ఆత్మహత్య -సీపీఐ నారాయణ సంచలనం -ఎమ్మెల్సీ‌గా ప్రొఫెసర్ నాగేశ్వర్

|
Google Oneindia TeluguNews

మాజీ ప్రధాని, కాంగ్రెస్ ఐకాన్ పీవీ నరసింహారావు కుమార్తె వాణిదేవి ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలోకి దిగడంతో తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మరింత ఉత్కంఠగా మారాయి. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల గ్రాడ్యువేట్స్ ఎమ్మెల్సీ సీటుకు ప్రధాన పార్టీల నుంచే కాకుండా, స్వతంత్ర్య అభ్యర్థులు గానూ పలువురు ప్రముఖులు పోటీ పడుతుండం గమనార్హం. కాగా, తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దక్కిన సందర్భంగా పీవీ కూతురు వాణిదేవి చేసిన కామెంట్లను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు..

IPL 2021: టీఆర్ఎస్ యూటర్న్ -BCCIకి మంత్రి కేటీఆర్ అభ్యర్థన -Sunrisers Hyderabadకు షాక్?IPL 2021: టీఆర్ఎస్ యూటర్న్ -BCCIకి మంత్రి కేటీఆర్ అభ్యర్థన -Sunrisers Hyderabadకు షాక్?

పీవీ బతికుంటే ఆత్మహత్య..

పీవీ బతికుంటే ఆత్మహత్య..

రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైన వాణీదేవీ.. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ను ఆకాశానికెత్తేశారు. పీవీకి, కేసీఆర్ కు దగ్గరి పోలికలున్నాయని తెలిపారు. ఆమె వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇప్పుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పీవీ బతికుంటే కూతూరు వాణిదేవి మాటలకు ఆత్మహత్య చేసుకునేవారని ఎద్దేవా చేశారు. ఆదివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు. ఇంకా..

కేసీఆర్‌తో పొలిక కామెడీ..

కేసీఆర్‌తో పొలిక కామెడీ..

''పీవీకి, కేసీఆర్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కేసీఆర్‌ను వాణీదేవి తన తండ్రి పీవీతో పోల్చటం హ్యాస్యాస్పదం. పీవీ చనిపోయి బతికిపోయారు. కుమార్తె మాటలకు ఏ లోకంలో ఉన్నా పీవీ బాధపడటం ఖాయం. పీవీ కుమార్తె రూపంలో అద్దె అభ్యర్థిని టీఆర్ఎస్ పార్టీ తెచ్చుకుంది. పీవీ శత జయంతి ఉత్సవాలు జరపకుండా కేసీఆర్ మోసం చేశాడు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయరు కాబట్టే పీవీ పేరుతో ఓట్లు అడుగుతున్నారు. పీవీ భుజంపై తుపాకీ పెట్టిన కేసీఆర్.. కాంగ్రెస్‌ను కాల్చుతున్నాడు..'' అని సీపీఐ నారాయణ అన్నారు.

Recommended Video

#Mlcelections టీఆర్ఎస్ చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటోంది : సీపీఐ నేత నారాయణ
గెలిచేది ప్రొఫెసర్ నాగేశ్వరే..

గెలిచేది ప్రొఫెసర్ నాగేశ్వరే..

రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల గ్రాడ్యువేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి పరాభవం తప్పదన్న సీపీఐ నారాయణ.. ఆ సీటులో స్వతంత్ర్య అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ గెలవటం ఖాయమని చెప్పారు. స్వతంత్ర్య అభ్యర్థి నాగేశ్వర్ కు సీపీఐ, సీపీఎం మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, పీవీ కూతురి అంశంలో కాంగ్రెస్ పార్టీ సైతం కేసీఆర్ ను విమర్శిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలుసుకున్న కేసీఆర్.. టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతుర్ని నిలబెట్టి ఆయన ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నారన్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

పెద్దగట్టు జాతర షురూ -4రోజులు విజయవాడ-హైదరాబాద్ హైవే మళ్లింపు -5రాష్ట్రాల భక్తులు -ఇవీ విశేషాలుపెద్దగట్టు జాతర షురూ -4రోజులు విజయవాడ-హైదరాబాద్ హైవే మళ్లింపు -5రాష్ట్రాల భక్తులు -ఇవీ విశేషాలు

English summary
CPI national secretary k.Narayana critisised TRS party MLC candidate Vanidevi, who is doughter of farmer prime minister pv narasimharao. narayana said, PV would commit suicide if alive. kcr has no quialities of pv, he added. Rangareddy, Hyderabad and Mahabubnagar districts graduates mlc election will be held on march 14th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X