వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌పై వర్మ అభ్యంతరకర ట్వీట్, కత్తి స్పందన: జీఎస్టీపై వర్మకు పోలీసుల దిమ్మతిరిగే షాక్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఆయన మరింత అభ్యంతరకర ట్వీట్ చేశారు. పవన్‌కు పోర్న్‌కు లింక్ పెడుతూ ట్వీట్ చేశారు.

తాను పోర్న్‌ను ఎంతగా ఇష్టపడతానో పవన్ కళ్యాణ్‌ను అంతే ఇష్టపడతానని వర్మ ట్వీట్ చేశారు. ఈ రెండింటిని కలుపుతూ పోర్న్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. అది గాడ్ సెక్స్ ట్రూత్ అంత నిజమైందన్నారు.

విపరీతమైన పాపులారిటీ

విపరీతమైన పాపులారిటీ

పవన్ కళ్యాణ్‌కు, అలాగే పోర్న్‌కు విపరీతమైన పాపులారిటీ ఉంటుందని, అందుకే పోర్న్ కళ్యాణ్ అల్టిమేట్ బ్రాండ్ అని తాను భావిస్తున్నానని వర్మ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. తనకు పోర్న్ అన్నా, పవన్ అన్నా ఇష్టమని చెప్పారు.

ఎవరంటే ఇష్టమని ప్రశ్న

ఎవరంటే ఇష్టమని ప్రశ్న

మరో ట్వీట్‌లో ఓ ప్రశ్న సంధించారు. మీకు పోర్న్ అంటే ఇష్టమా లేక పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా అని ప్రశ్న సంధించారు. వర్మ ట్వీట్‌పై మహేష్ కత్తి స్పందిస్తూ.. వావ్ పోర్న్ కళ్యాణ్ బాగుందని, ఎక్సైటింగ్‌గా ఉందని ట్వీట్ చేశారు. వర్మ.. జనసేనాని పైన గతంలోను వివాదాస్పద ట్వీట్లు చేశారు. వర్మ, మహేష్ కత్తి వంటి వారు పవన్‌నే టార్గెట్ చేసుకోవడం వెనుక వారి ఉద్దేశ్యం అందరికీ తెలుసునని అభిమానులు మొదటి నుంచి చెబుతున్నారు.

వర్మపై ఫిర్యాదు

వర్మపై ఫిర్యాదు

కాగా, గాడ్ అండ్ సెక్స్ ట్రూత్ వెబ్ సిరీస్‌కు సంబంధించి సీసీఎస్ పోలీసులు శనివారం వర్మను ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆయనకు పోలీసులు చుక్కలు చూపించారు.
ఈ వెబ్‌ సిరీస్‌ సినిమా పెద్ద దుమారం రేపింది. మహిళలను కించపరిచేలా, అశ్లీలంగా చూపించిన ఆ సినిమాపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. దీనిపై టీవీల్లో జరిగిన చర్చల సమయంలో సామాజిక కార్యకర్త దేవిపై వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో, మహిళలను కించపరిచేలా సినిమా తీసినందుకు, తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వర్మపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వర్మకు అలా షాకిచ్చిన పోలీసులు

వర్మకు అలా షాకిచ్చిన పోలీసులు

కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు రావాలంటూ వర్మకు నోటీసులు జారీ చేశారు. షూటింగ్‌లో బిజీగా ఉన్నానంటూ రెండుసార్లు వాయిదా వేసిన వర్మ శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. అదనపు డీసీపీ రఘువీర్‌ బృందం దాదాపు మూడున్నర గంటలపాటు వర్మను ప్రశ్నించింది. ఆయనను దాదాపు 25 ప్రశ్నలు అడిగారని తెలుస్తోంది. మీరు జీఎస్టీ సినిమాను ఎక్కడ తీశారన్న ప్రశ్నకు అసలు తాను ఆ సినిమానే తీయలేదని, తాను అసలు షూటింగ్‌లోనే పాల్గొనలేదని వర్మ చెప్పగా.. ప్రతిగా వర్మనే తన ట్విటర్లో పోస్టు చేసిన ఫొటోలు, కామెంట్లు సీసీఎస్ పోలీసులు ఆయన ముందు పెట్టి ప్రశ్నించారని తెలుస్తోంది. జీఎస్టీ సినిమాకు అంతా తానేనని మొదటి నుంచీ వర్మ ప్రచారం చేసుకున్నారు. నగ్నంగా ఉన్న మాల్కోవాతో తాను కెమెరా పట్టుకుని ఉన్న ఫొటోను కూడా ట్విటర్లో పోస్ట్ చేశారు. అటువంటి ఫొటోలు, కామెంట్లతో పోలీసులు వర్మను ఉక్కిరిబిక్కిరి చేశారు. స్కైప్‌లోనే డైరెక్షన్‌ చేశానని, భౌతికంగా చేయలేదని వర్మ చెప్పగా.. మాల్కోవాతో ఆయన ఉన్న ఫొటోలను ముందు పెట్టారు. దాంతో ఆయన ఆందోళన చెందినట్లు తెలిసింది. భారతీయ చట్టాల ప్రకారం నగ్నత్వాన్ని చూపడం నేరమే కదా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదని సమాచారం.

అక్కడే భోజనం

అక్కడే భోజనం

వర్మ మాత్రం సీసీఎస్‌లో పోలీసులతో పద్ధతిగానే వ్యవహరించారని తెలుస్తోంది. విచారణ మధ్యలో లంచ్‌ ఏర్పాట్లు చేస్తామని, భోజనం చేయాలని పోలీసులు వర్మను అడిగారు. దాంతో, తాను భోజన ఏర్పాట్లు చేసుకొని వచ్చానని, మీరు అనుమతిస్తే చేస్తానని ఆయన జవాబిచ్చారు. కంట్రోల్‌ రూంలోనే ఏర్పాట్లు చేయడంతో తాను తెచ్చుకున్న భోజనాన్ని వర్మ అక్కడే తిన్నారు.

వర్మ పాస్‌పోర్టు స్వాధీనం

వర్మ పాస్‌పోర్టు స్వాధీనం

విచారణ అనంతరం వర్మకు చెందిన ల్యాప్‌టాప్, పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇచ్చిన సమాధానాలను రికార్డు చేశారు. ఆయన ఇచ్చిన సమాధానాలపై సంతృష్తి చెందలేదు. దాంతో, తదుపరి విచారణకు శుక్రవారం రావాలని ఆదేశించారు. తాము అడిగిన కొన్ని సాంకేతిక అంశాలకు వర్మ జవాబులు చెప్పలేదన్నారు. విమియో వెబ్‌సైట్‌ గురించి కొన్ని ప్రశ్నలు అడిగామని, వాటికి ఆయన సరైన సమాధానం చెప్పలేదని, దాంతో, శుక్రవారం మరోసారి విచారణకు రావాలని ఆదేశించినట్లు తెలిపారు.

వర్మ సమాధానాలు ఇలా..

వర్మ సమాధానాలు ఇలా..

జీఎస్టీ సినిమాను భారత్‌లో తీయలేదని తనది కేవలం కాన్సెప్ట్‌ మాత్రమేనని, సినిమాను అమెరికా, పోలెండ్‌, యూకేల్లో తీశారని, దానికి భారతీయ చట్టాలు ఎంత మాత్రం వర్తించవని, ఆ సినిమాకు నేను ఫిజికల్‌గా డైరెక్షన్‌ చేయలేదని, స్కైప్‌లో మాత్రమే డైరక్షన్‌ చేశానని, దానిని అమెరికన్‌ ప్రొడక్షన్స్‌ వారు తీశారని, వారే ఈ సినిమాకు నిర్మాతలు అని, ఆ సినిమాకు సంబందించి తాను ఒక్క రూపాయి కూడా వారి నుంచి రెమ్యునరేషన్‌ తీసుకోలేదని, హీరోయిన్‌ మాల్కోవాతో మాట్లాడినప్పుడు వేరే సినిమా షూటింగ్‌లో ఉన్న ఆమె.. ఆ సినిమాకు సంబంధించి తను పంపిన ఫొటోలనే నేను సోషల్‌ మీడియాలో పెట్టానని, దేవిపై ఉద్దేశ్యపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని, అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే ఉద్రేకంలో అలా అన్నానని, మీరు కోరిన విధంగా మరిన్ని ఆధారాలు తదుపరి విచారణలో సమర్పిస్తానని వర్మ చెప్పారని తెలుస్తోంది.

English summary
Filmmaker Ram Gopal Varma on Saturday told the police during questioning that he had no association with the short film God, Sex and Truth, starring American pornographic actor Mia Malkova, except giving the concept and directing it online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X