వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైన్స్ ముందు కిలోమీటర్ల మేర క్యూ .. తెలంగాణాలోనూ మందుబాబుల మద్యం తిప్పలు షురూ

|
Google Oneindia TeluguNews

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా కేంద్రం మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తెలంగాణా సర్కార్ కూడా నిన్న క్యాబినెట్ భేటీ నిర్వహించి లిక్కర్ సేల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతి ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 42 రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో ఉదయం నుంచే దుకాణాల వద్ద మద్యంప్రియులు బారులు తీరారు. కిలోమీటర్ల మేర క్యూ కట్టారు.

 గొడుగులు, మాస్కులు , సామాజిక దూరం పాటిస్తూ క్యూలో నిల్చున్న మద్యం ప్రియులు

గొడుగులు, మాస్కులు , సామాజిక దూరం పాటిస్తూ క్యూలో నిల్చున్న మద్యం ప్రియులు

ఎండాకాలం కావటంతో గొడుగులతో కొందరు, మాస్కులు ధరించి , సామాజిక దూరం పాటిస్తూ క్యూ లైన్లలో బుద్ధిగా నిల్చున్నారు. భౌతిక దూరం, మాస్క్‌లు తప్పకుండా పాటించాలనే నిబంధనలను పాటిస్తున్న తెలంగాణా ప్రజలు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇక రాష్టంలో వైన్స్ దగ్గర ఇప్పటికే సామాజిక దూరం పాటించేలా గీసిన బాక్స్ లలో నిల్చుంటున్న మందుబాబులు చాలా పద్దతిగా కొనుగొలుకు శ్రీకారం చుట్టారు. మద్యం బ్యాన్ ఎత్తేసిన ఇతర రాష్ట్రాలలో భౌతిక దూరం పాటించకుంటే పోలీసులు లాఠీలకు పని చెప్పారు.

 ఇతర రాష్ట్రాలలో తలెత్తిన ఇబ్బంది తెలంగాణలో లేకుండా చర్యలు

ఇతర రాష్ట్రాలలో తలెత్తిన ఇబ్బంది తెలంగాణలో లేకుండా చర్యలు

ఇక అలాంటి పరిస్థితి రాకుండా దాదాపు చాలా ప్రశాంతంగా ఇప్పటి వరకు మద్యం కోసం వైన్స్ ముందు క్యూ కట్టారు మందుబాబులు . సామాజిక దూరం పాటిస్తున్న నేపధ్యంలో ఒకింత ఇబ్బంది లేకుండానే లిక్కర్ కొనుగోళ్ళు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అధికార యంత్రాంగం . లిక్కర్ ధరలు తెలంగాణా రాష్ట్రంలో కూడా పెంచిన నేపధ్యంలో చాలా వరకు కొనుగోళ్ళు తగ్గుతాయని భావిస్తున్నారు. కానీ మద్యానికి అలవాటైన వారు ఎత ధర ఉన్నా మద్యం కొనుగోలు చేసి తీరతారు అనేది పక్క తెలుగు రాష్ట్రం ఏపీని చూస్తే అర్ధం అవుతుంది.

ధరలు పెంచినా సరే కొనుగోలుకు మందుబాబుల ఆసక్తి

ధరలు పెంచినా సరే కొనుగోలుకు మందుబాబుల ఆసక్తి

నేటి నుంచి మద్యం విక్రయాలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన కేసీఆర్‌మద్యం ధరలను పెంచుతున్నట్టు ప్రకటించారు . చీప్‌ లిక్కర్‌పై 11 శాతం, మద్యంపై 16 శాతం ధర పెంచుతున్నట్టు వెల్లడించారు . ఈ ప్రకారం కొత్త మద్యం ధరలు అమల్లోకి వచ్చాయి. ఇక తెలంగాణలో 2,200 మద్యం దుకాణాలకు గానూ కంటైన్మెంట్‌ జోన్లలోని 15 దుకాణాలు మినహాయించి మిగిలిన వాటిని ఓపెన్‌ చేశారు . ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలు సాగనున్నాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కిలోమీటర్ల మేర క్యూ .. రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ అమమకాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం షాపుల ముందు మందుబాబులు పడిగాపులు పడుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో లిక్కర్ షాపు తెరవక ముందే వెళ్లి నిల్చున్న మందుబాబులు ముందు కిలోమీటర్ల మేర లిక్కర్ షాపుల ముందు క్యూ కట్టారు. కానీ సామాజిక దూరం పాటిస్తూనే లిక్కర్ కొనుగోలుకు శ్రీకారం చుట్టారు లిక్కర్ ప్రియులు. ఒక్క వరంగల్ జిల్లా మాత్రమే కాదు, రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది . కేంద్రం సడలింపు ఇచ్చిన తర్వాత తెలంగాణా రాష్ట్రం కంటే ముందే వేరే రాష్ట్రాలలో మద్యం షాపులు ప్రారంభం కాగా ఎప్పుడెప్పుడా ఎదురు చూసిన మందుబాబులు ఇక తెలంగాణాలోనూ వైన్స్ తెరుచుకోవటంహో సీఎం కేసీఆర్ చెప్పిన నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ మద్యం కొనుగోలు చేస్తున్నారు.

English summary
The center has given the green signal for liquor sales as part of the lockdown eases. However, Telangana government also held a Cabinet meeting yesterday and gave the green signal to Liquor Sales. Liquor stores have opened in the state almost 42 days after Chief Minister KCR's approval. This is the reason why alcoholics have been lining up at the shops since morning. The queue is lined up to kilometers .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X