నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయండి: ఆర్ నారాయణమూర్తి

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు సినీనటుడు ఆర్ నారాయణమూర్తి. కార్పొరేట్ వ్యవసాయంతో రైతు ఎప్పటికీ రాజు కాకపోగా.. అదే పొలంలో కూలీగా మారే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్, గిడ్డంగులు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయని అన్నారు.

సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్‌లోని ధర్నాచౌక్‌లో రైతు గర్జన సభ జరిగింది.
ఈ సభకు హాజరైన నారాయణ మూర్తి మాట్లాడుతూ.. మూడు వ్యవసాయ చట్టాలు రైతాంగానికి పూర్తిగా వ్యరేకమని వ్యాఖ్యానించారు. పార్టీలకతీతంగా రైతు పోరాటానికి మద్దతు పలకాలన్నారు.

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన పార్టీలు రైతులను మోసం చేశాయన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని సినీనటుడు ఆర్ నారాయణమూర్తి కోరారు.

R Narayanamurthy asks CM KCR to establish Federal Front

వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని పోరాటం చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం శోచనీయమని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. కేసీఆర్ పోడు భూములకు పట్టాలిస్తారా లేక దిగిపోతారా?.. మోడీ చట్టాలు రద్దు చేస్తారా? లేక దిగిపోతారా? తేల్చుకోవాలన్నారు. కాగా, నారాయణమూర్తి ఈ సభలో పాటపాడి అందరినీ ఉత్తేజపర్చారు.

జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ కూటములకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని కొంత కాలం క్రితం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీలకు సంబంధం లేని పార్టీలను కలుపుకుని కొత్త కూటమిని ఏర్పాటు చేసి... జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని చెప్పారు. అయితే, ప్రస్తుతం కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ను నారాయణమూర్తి కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

English summary
R Narayanamurthy asks CM KCR to establish Federal Front.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X