• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పెళ్ళిచేసుకొంటానంటూ టెక్కీ నుండి రూ.14 లక్షలు లాగేశాడు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: యూకేలో డాక్టర్ అని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న యువతిని పెళ్ళిచేసుకొంటానని నమ్మించాడు. అంతేకాదు ఆ యువతి నుండి రూ.14 లక్షలను తీసుకొన్నాడు. అయితే ఎట్టకేలకు బాధితురాలు తాను మోసపోయాయని గుర్తించి పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఢిల్లీకి చెందిన ఓ నిందితుడిని అరెస్టుచేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.

యూకేలో డాక్టర్ గా పనిచేస్తున్నానంటూ మ్యాట్రిమోనీ వెబ్ సైట్ ద్వారా ఓ మహిళ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో పరిచయం పెంచుకొన్నాడు ఢిల్లీకి చెందిన రషీద్ ఖాన్.ఈ కేసులో ప్రధాన నిందితుడైన నైజీరియాకు చెందిన వ్యక్తి పరారీలో ఉన్నాడు.

cheating

అయితే అతడికి బ్యాంక్ ఖాతాల విషయంలో సహకరించిన ఢీల్లికి చెందిన రషీద్ ఖాన్ ను రాచకొండ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. ఢిల్లీ నుండి ట్రాన్సిట్ వారంట్ పై ఆయన్ను మంగళవారం నాడు తీసుకొచ్చారు.

గచ్చిభౌలిలోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న యువతికి పెళ్ళి సంబంధాల కోసం మ్యాట్రిమోనీ వెబ్ సైట్లలో రిజిస్టర్ చేసుకొంది.

ఫిబ్రవరి 7వ, తేదిన డాక్టర్ సుమంత్ భరత్ పేరుతో ఆమె మ్యాట్రిమోనీ ఖాతాకు ఓ మేసేజ్ వచ్చింది. తమ పూర్వీకులు భారత్ కు చెందినవారేని, తాను యూకేలో పుట్టిపెరిగాని, డాక్టర్ గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకొన్నాడు.

నెలకు లక్షల్లో జీతం ఉంటుందని, పెళ్ళికి అంగీకరిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకొంటానని నమ్మించాడు. అతడి ప్రోఫైల్ చూసిన ఆమె పెళ్ళికి అంగీకరించింది. ఏప్రిల్ తొలివారంలో తనతో పాటు తన సోదరి , ఆమె ఐదేళ్ళకుమారుడుఇండియాకు తిరిగివస్తున్నారని చెప్పారు. వీసా చార్జీలకు ఇండియా కరెన్సీని ఏజంట్ కు పంపించాలని, ఆ తర్వాత ఒక మిలియన్ పౌండ్లను పంపిస్తానని నమ్మించాడు.

కాబోయే భర్త ఇండియాకు వస్తున్నాడని కొంత డబ్బును ఏజంట్ ఖాతలో జమచేసిందామె. రెండు రోజుల తర్వాత ఢిల్లీ ఎయిర్ కస్టమ్స్ అధికారినంటూ ఫోన్ వచ్చింది. మీకు ఓ పార్శిల్ వచ్చింది. అది మీ దగ్గరికి రావాలంటే యాంటీ టెర్రరిస్టు సర్టిఫికెట్టు, కస్టమ్స్ క్లియరెన్స్ ఛార్జీలు చెల్లించాలంటూ అడిగాడు. ఆమెను నమ్మించడానికి యూకే పౌండ్లు ఉన్న పార్శిల్ ఫోటోలను వాట్సాప్ లో షేర్ చేశాడు. నిజమేనని నమ్మిన బాధితురాలు ఏ మాత్రం ఆలోచించకుండా రూ.14 లక్షలు వారు సూచించిన ఖాతాలో డిపాజిట్ చేసింది.

ఎన్ని రోజులైనా యూకే పౌండ్లు రాకపోవడంతో మోసపోయానని గుర్తించిన బాధితురాలు రాచకొండ పోలీసులను ఆశ్రయించింది.ఇండియాలోని ఓ మధ్యవర్తిద్వారా ఓ నైజీరియన్ ఈ మోసానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.

బాధితురాలు 11 బ్యాంక్ ఖాతాల్లో జమచేసిన రూ.14 లక్షల్లో పదిశాతం కమిషన్ కు ఆయా బ్యాంక్ ఖాతాదారులకు నిందితుడు ఇచ్చాడు. ఈ ఖాతాదారుల్లో ఒకడైన రషీద్ ఖాన్ అలియాస్ ఇమ్రాన్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అతడికి సహకరించిన ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.

English summary
Rachakonda police arrested Imran khan for cheating a lady software engineer. police searching for accused persons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X