వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: కేంద్రమంత్రి రాధాకృష్ణన్

|
Google Oneindia TeluguNews

వరంగల్‌: దేశంలో ప్రధాన మంత్రి మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పటిష్టంగా ఉందని ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు పరుస్తూ ప్రజల మన్ననలను పొందిందని కేంద్ర రవాణా శాఖ సహాయ మంత్రి రాధాకృష్ణన్‌ అన్నారు. దీంతో ప్రజలకు బీజేపీ ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరిగిందని అన్నారు.

గురువారం హన్మకొండలోని హరిత హోటల్‌లో మేధావులతో ఏర్పాటుచేసిన సమావేశంలో రాధాకృష్ణన్‌ ప్రసంగిస్తూ.. పెద్దనోట్ల రద్దు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపట్ల సంక్షేమ కార్యక్రమాలపట్ల ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారని, దానికి ఉదాహరణగా ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలేనని ఆయన అన్నారు.

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో అఖండ విజయాన్ని సంపాదించి దేశంలో బీజేపీ పార్టీకి ఎదురులేకుండా చేశారని, ఉత్తరాఖండ్‌లో కూడా అఖండ మేజార్టీని సంపాదించి మణిపూర్‌, గోవా రాష్ట్రల్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్నాయా ? లేదా ? అనే విషయాన్ని తెలుసుకోవడానికి తాను ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నానని ఆయన తెలిపారు.

Radhakrishnan visits warangal district

తెలంగాణ రాష్ట్రంలో 2019లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, దానికి బీజేపీ కార్యకర్తలు విశేషంగా పనిచేసి ప్రజల మన్ననలు పొంది పార్టీని అధికారంలోకి తీసుకరావడంలో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం కొరకు బీజేపీ పార్టీ, ఎంపీలు పార్లమెంటులో మద్దతు తెలిపారని, ఆ మద్దతు వలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ విషయాన్ని ప్రజలు మరవొద్దని అన్నారు.

తెలంగాణలో బీజేపీ శ్రేణులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు విశేషంగా కృషిచేసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని కేంద్ర మంత్రి రాధాకృష్ణన్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతోందని తెలిపారు.

రాష్ట్ర బీజేపీ అధ్యకక్షులు డాక్టర్‌ లక్ష్మణ్‌ మ్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేయించిన నిధులను తామే ఇచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రచారం చేసుకుటోందని ఆరోపించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

English summary
Union Minister Radhakrishnan visited Warangal district on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X