హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ దోపిడీకి కేసీఆర్ చప్పట్లు, కాంగ్రెస్‌లోకి రండి, అందరికీ ఉద్యోగాలు: తెలుగులో రాహుల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన విద్యార్థి - నిరుద్యోగ గర్జనలో తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నాలుగు కోట్ల మంది ప్రజల పోరాట ఫలితం ఒక్క కేసీఆర్ కుటుంబానికి దక్కుతోందన్నారు. తెలంగాణలో యువత భవిష్యత్ ఆందోళనకరంగా ఉందన్నారు.

కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. నీళ్లు, నిధులు, నియామకల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పాటులో విద్యార్థులది కీలకపాత్ర అన్నారు. తెలంగాణ వస్తేనే ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులు ఆశించారని చెప్పారు. కానీ ఏ కలల కోసం పోరాడామో ఆ కల నెరవేరలేదని చెప్పారు. తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి అన్నారు.

అమరవీరుల కుటుంబాల జీవితాలను, తెలంగాణ వారి జీవితాలను బాగు చేస్తానని కేసీఆర్ ఎన్నికల సమయంలో చెప్పారని రాహుల్ గాంధీ అన్నారు. లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారని గుర్తు చేశారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలి ఇస్తామని చెప్పారని, కానీ ఈ నాలుగేళ్లలో కనీసం పదివేల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు.

కాంగ్రెస్‌లోకి రండి, అందరికీ ఉద్యోగాలు

కాంగ్రెస్‌లోకి రండి, అందరికీ ఉద్యోగాలు

తెలంగాణ వచ్చినా ఎలాంటి నోటిఫికేషన్లు లేవని, రిక్రూట్మెంట్లు లేవని రాహుల్ అన్నారు. మనకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశపడితే వట్టిదే అయిందన్నారు. రైతుల ఆత్మహత్య పైన కేసీఆర్ కనీసం స్పందించడం లేదన్నారు. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ పథకాన్ని కూడా నీరు గారుస్తున్నారన్నారు. కాంగ్రెస్ వచ్చిన వెంటనే తెలంగాణలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తామన్నారు. తక్కువ ఖర్చుకే నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామన్నారు. తెలంగాణలోని యువత కాంగ్రెస్ పార్టీలోకి రావాలన్నారు. మీ శక్తిని, మీ సంపదను కేవలం ఒక్క కుటంబమే దోచుకుంటోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల కోసం పని చేస్తుందన్నారు.

కేసీఆర్ కోట్లాది రూపాయల దోపిడీ

కేసీఆర్ కోట్లాది రూపాయల దోపిడీ

ధనవంతుల రుణాలు మాఫీ చేస్తున్నారు కానీ, రైతుల రుణాలు మాఫీ కావడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తాను కాపలాదారును అని చెబుతారని, కానీ అంతా వట్టిదే అన్నారు. తెలంగాణలో కూడా రీ డిజైన్ల పేరుతో కేసీఆర్ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని ఆరోపించారు. రైతుల నుంచి భూములు లాక్కుంటున్నారన్నారు. ప్రాణహిత - చేవెళ్లను కాళేశ్వరం పేరుతో రీడిజైన్ చేస్తున్నారని, దీంతో దండుకుంటున్నారని ఆరోపించారు. రీడిజైన్ పైరుతో రూ.38వేల కోట్ల అంచనా ఒక్కసారిగా లక్ష కోట్లకు చేరిందన్నారు.

అనిల్ అంబానికి కట్టబెట్టారు, ప్రధాని ఇలా, నిర్మల అలా

అనిల్ అంబానికి కట్టబెట్టారు, ప్రధాని ఇలా, నిర్మల అలా

రాఫెల్ కాంట్రాక్టును తనకు కావాల్సిన వాళ్లకు మోడీ కట్టబెట్టారని రాహుల్ ఆరోపించారు. రూ.524 కోట్లకు కొనుగోలు చేయాల్సిన విమానాన్ని రూ.1600 కోట్లకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి అనుభవం లేని అనిల్ అంబానీ కంపెనీకి రాఫెల్ కాంట్రాక్టును కట్టబెట్టారన్నారు. రాఫెల్ డీల్‌తో అనిల్ అంబానికి ప్రధాని మోడీ కోట్ల రూపాయల గిఫ్ట్ ఇచ్చారన్నారు. రాఫెల్ డీల్‌లో ఎలాంటి రహస్య ఒప్పందం లేదని ఫ్రాన్సులో ప్రధాని మోడీ చెప్పారని, కానీ రక్షణ శాఖ మంత్రి మాత్రం ఆ ఒప్పందం రహస్యమని పార్లమెంటులో చెప్పారని తెలిపారు. ఢిల్లీలో మోడీ రీడిజైన్ చేస్తుంటే తెలంగాణలో కేసీఆర్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం అనేకమంది త్యాగాలు చేశారన్నారు.

మోడీ రీడిజైన్లను కేసీఆర్ చప్పట్లు కొడుతూ స్వాగతించారు

మోడీ రీడిజైన్లను కేసీఆర్ చప్పట్లు కొడుతూ స్వాగతించారు

తన కళ్లలో కళ్లు పెట్టి చూడాలంటే ప్రధాని మోడీకి భయమని రాహుల్ అన్నారు. ప్రధాని చేసే రీడిజైన్లన్నింటినీ కేసీఆర్ సమర్థిస్తున్నారని విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీలను కేసీఆర్ చప్పట్లు కొడుతూ స్వాగతించారన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీతో చిరు వ్యాపారులను కోలుకోకుండా చేశారన్నారు. కాంగ్రెస్ వచ్చాక చిరు వ్యాపారులకు జీఎస్టీ ఇబ్బందులు తప్పిస్తామన్నారు. కాంగ్రెస్ అదికారంలోకి వస్తే 5 రకాల శ్లాబులు ఉండవని, ఒకేరకమైన జీఎస్టీ ఉంటుందన్నారు. అక్కడ రీడిజైనర్, ఇక్కడ రీడిజైనర్.. ఇద్దరు ప్రజలను దోచుకుతింటున్నారన్నారు. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 31వేల కోట్లు రుణమాఫీ చేశామని చెప్పారు.

అక్కడ జంతర్ మంతర్, ఇక్కడ ధర్నా చౌక్

అక్కడ జంతర్ మంతర్, ఇక్కడ ధర్నా చౌక్

ప్రధాని మోడీ అక్కడ జంతర్ మంతర్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక్కడ ధర్నాచౌక్ లేకుండా చేశారని రాహుల్ దుమ్ముదులిపారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే వీలు లేకుండా చేశారన్నారు. భేటీ పడావో, భేటీ బచావో అని మోడీ చెబుతున్నారని, కానీ ఎవరి నుంచి రక్షించాలని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేల నుంచి ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై మోడీ మాత్రం నోరు విప్పడం లేదన్నారు. పార్లమెంటులో నేను అడిగిన ఏ ప్రశ్నకు మోడీ సమాధానం చెప్పలేదన్నారు.

పెట్రో ధరలు పెరుగుతున్నాయి

పెట్రో ధరలు పెరుగుతున్నాయి

క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతున్నా మన దేశంలో మాత్రం పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని రాహుల్ అన్నారు. పెట్రోల్ రేట్ల పేరుతో ప్రజల నుంచి దోచిన ధనాన్ని పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రాఫెల్ డీల్ పైన ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు.

English summary
AICC president Rahul Gandhi attacked Telangana Chief Minister KCR and Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X