హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గద్వాల సభలో డీకే అరుణ ట్రాన్స్‌లేషన్: నవ్వుకుంటూనే రాహుల్ గాంధీ అసంతృప్తి!

|
Google Oneindia TeluguNews

గద్వాల: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గద్వాల బహిరంగ సభలో మహాకూటమి మద్దతుతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీకే అరుణ ట్రాన్సులేట్ చేశారు. రాహుల్ హిందీలో మాట్లాడగా అరుణ దానిని సభికులకు తెలుగులో అందించారు. అయితే ఆమె పలుమార్లు తడబడ్డారు. రాహుల్ గాంధీని కూడా ఇది అసంతృప్తికి గురి చేసినట్లుగా తెలుస్తోంది.

<strong>చంద్రబాబు కూటమికి షాక్: టీఆర్ఎస్ గెలుపుకు హైదరాబాద్‌లో రంగంలోకి జనసేన, వైసీపీ!</strong>చంద్రబాబు కూటమికి షాక్: టీఆర్ఎస్ గెలుపుకు హైదరాబాద్‌లో రంగంలోకి జనసేన, వైసీపీ!

రాహుల్ గాంధీ మాటలకు, డీకే అరుణ ట్రాన్సులేషన్ మధ్య పొంతన కుదరలేదు. రాహుల్ గాంధీ మాట్లాడిన ఒకటి రెండు కీలక అంశాలను కూడా ఆమె అందుకోలేకపోయారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును రూ.10వేల కోట్ల ప్రాజెక్టును ప్రారంభించామని చెప్పారు. దానికి డీకే అరుణ మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు నాడు కాంగ్రెస్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అవసరముందని గుర్తించి, దానికోసం సర్వే చేయించిందని మరో మాట చెప్పారు.

 ట్రాన్సులేషన్ పట్ల రాహుల్ గాంధీ అసంతృప్తి

ట్రాన్సులేషన్ పట్ల రాహుల్ గాంధీ అసంతృప్తి

తన ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించే సమయంలో రాహుల్ గాంధీ పలుమార్లు అసంతప్తికి గురైనట్లుగా కనిపించింది. ఓ సమయంలో టీఆర్ఎస్ఎస్ అని రాహుల్ గాంధీ చెబితే ఆమె స్పష్టంగా చెప్పలేకపోయారు. రాహుల్ గాంధీ కల్పించుకొని.. టీఆర్ఎస్ఎస్ అని చెప్పారు. టీఆర్ఎస్ అసలు పేరు టీఆర్ఎస్ఎస్ (అంటే ఆరెస్సెస్) అని రాహుల్ చెప్పారు. దీనిని డీకే అరుణ సరిగా చెప్పలేకపోయారు. దీంతో రాహుల్ అలా కాదని తలఊపి సరి చేయించారు.

కాస్త ఆలస్యంగా అందుకున్నారు

కాస్త ఆలస్యంగా అందుకున్నారు

బంగారు తెలంగాణ కలలు కన్నామని రాహుల్ చెప్పారు. డీకే అరుణ వెంటనే అందుకుంటారేమోనని చూశారు. ఆమె కాస్త ఆలస్యంగా అందుకున్నారు. దీంతో రాహుల్ మరో మాట చెప్పబోయేలాగా అప్పుడు డీకే అరుణ దానిని అనువదించారు.

రాహుల్ హిందీలో రెండోసారి చెప్పారు

రాహుల్ హిందీలో రెండోసారి చెప్పారు

ప్రధాని మోడీ కేవలం పదిహేను మందికి మూడున్నర లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తే, కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. దానిని డీకే అరుణ వెంటనే అందుకోలేకపోయారు. దీంతో అదే మాటను రాహుల్ గాంధీ హిందీలో రెండోసారి చెప్పారు. ఆ సమయంలో కూడా రాహుల్ ఇబ్బందిగా కనిపించారు. ఆ సమయంలో సభావేదిక పైనే అతనిని ట్రాన్సులేట్ చేయనివ్వమని చెప్పారు. కానీ ఆ తర్వాత కూడా ఆమెనే కొనసాగారు.

కాసేపు ఏమీ చెప్పలేక

కాసేపు ఏమీ చెప్పలేక

ధాన్య్ కే లియే రూ.2వేలు అని రాహుల్ గాంధీ చెప్పారు. ఆ సమయంలోను ఆమె ఇబ్బంది పడ్డారు. కాసేపు ఏమీ చెప్పలేకపోయారు. దీంతో రాహుల్ గాంధీ వెనక్కి తిరిగి నవ్వుకున్నారు. ఆ తర్వాత వరికి రూ.2వేలు అని డీకే అరుణ చెప్పారు. మరో సందర్భంలో మై అండ్ కాంగ్రెస్ పార్టీ అంటూ రాహుల్ మాట్లాడారు. దానిని ఒకటికి రెండుసార్లు ఆయన ఆమెకు చెప్పవలసి వచ్చింది.

గద్వాల డీకే అరుణ సొంత నియోజకవర్గం

గద్వాల డీకే అరుణ సొంత నియోజకవర్గం

గద్వాల నియోజకవర్గం నుంచి డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆమె నియోజకవర్గం ఎప్పటి నుంచో అదే. తన నియోజకవర్గంలో రాహుల్ గాంధీ బహిరంగ సభ నేపథ్యంలో తానే స్వయంగా ట్రాన్సులేషన్ చేయాలని భావించారు. కానీ వెంటనే అందుకోలేని ట్రాన్సులేషన్‌తో ఆమె ఇబ్బంది పడ్డారు.

English summary
Rahul Gandhi, DK Aruna Gadwal Public Meeting, Rahul Gandhi disappointed with DK Aruna translation. The Telangana Legislative Assembly election is scheduled to be held in Telangana on 7 December 2018 to constitute the second Legislative Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X