వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌లో అంతే .. సొంత పార్టీనేతలను మీడియా ముఖంగా కడిగేసిన వీహెచ్ !

|
Google Oneindia TeluguNews

అంభేడ్కర్ విగ్రహ ధ్వంసం సంఘటన పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వివక్ష చూపిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ.హనుమంతరావు విమర్శించారు. విగ్రహ ధ్వంసంపై రాహుల్ గాంధి సైతం స్పందించాలని ఆయన కోరారు.

స్వపక్షంలో విపక్షం ...

స్వపక్షంలో విపక్షం ...

స్వపక్షంలో విపక్షం ఉన్న పార్టీ ఏదైన ఉంది అంటే ,అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పకతప్పదు. ఏది మాట్లాడిన అది ఒక కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం, తన మన భేదం లేకుండా స్వంత పార్టీ అధినేతలనే పార్టీ వేదికల మీద దుమ్ము దులిపేయవచ్చు. తమకు నచ్చని నాయకుల పై ఆరోపణలు సంధించవచ్చు . అదేమంటే కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత ప్రజాస్వామ్యం అంటారు కాంగ్రెస్ నేతలు , ఇలా స్వంత పార్టీ నేతలపై ఎన్నో విమర్శలు చేసిన నాయకులు ఉన్నారు.వాళ్లను జైళ్లకు పంపిణ పరిస్థితులు కూడ ఉన్నాయి. తాజాగ ఇలాంటీ సంఘటనే గాంధి భవన్ వేదికగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ పై వీహెచ్ మరోసారి విరుచుడ్డారు.

అంబేద్కర్ విగ్రహ ధ్వంసం పై రాహుల్ స్పందించాలి:

అంబేద్కర్ విగ్రహ ధ్వంసం పై రాహుల్ స్పందించాలి:

కాంగ్రెస్ పార్టీ నేత వీహెచ్ మరోసారి ఉత్తమ్ పై మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కి రాజకీయాల మీద ఉన్న శ్రద్ద , సామాజిక సమస్యలపై లేదని విమర్శించారు. అంబేద్కర్ విగ్రహ ధ్వంసంలో ఉత్తమ్ వివక్ష చూపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. లోకల్ బాడీస్ ఎన్నికలపై ప్రత్యేక కమిటిని నియమించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, అంబేడ్కర్ విగ్రహ ధ్వంసంపై మాత్రం సరిగా స్పందించలేదని విమర్శించారు. కాగా ఈ అంశంపై ఆందోళన నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధి సైతం విగ్రహ ధ్వంసంపై స్పందించాలని ఆయన కోరారు.

విగ్రహం స్థాపించకపోతే నిరహర దీక్ష .. వీహెచ్

విగ్రహం స్థాపించకపోతే నిరహర దీక్ష .. వీహెచ్

చాల కాలంగా బీసీల ఓట్లతో గెలిచి వారి సమస్యలు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.ఈ నేపథ్యంలోనే ఓట్లు మావి ,సీట్లు మీవా అంటూ దుయ్యబట్టారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే నిరహర దీక్ష చేస్తానని హెచ్చరించారు వీ. హనుమంతరావు.

English summary
Congress party senior leader v. hanumanta rao once again fire on pcc chief uttamkumar reddy, vh alleged that uttam kumar reddy properly not responding on ambedker statue destroy in hyderabad, and he asks that rahul gandhi has to respond on this issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X