హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌కు రాహుల్: కాంగ్రెస్‌కు చుక్కలు! విమానాశ్రయంలోకి జైపాల్ రెడ్డికి నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/బీదర్: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకున్నారు. ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అంతకు ముందు పార్టీ అధినేతకు స్వాగతం పలికేందుకు పదిమంది సీనియర్ నేతలను మాత్రమే లోపలకు అనుమతించారు. వీవీఐపీ టెర్మినల్‌కు రెండు కిలో మీటర్ల దూరంలో కాంగ్రెస్ నేతలను అనుమతించారు. ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ వచ్చే దారిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

జైపాల్‌కు నో, జానాకు అనుమతి

రాహుల్ గాంధీ రాక నేపథ్యంలో పలువురు సీనియర్ నేతలు ఎయిర్ పోర్టులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత జైపాల్ రెడ్డికి లోపలకు వెళ్లేందుకు సెక్యూరిటీ సిబ్బంది నిరాకరించారు. కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత జానారెడ్డిని అనుమతించారు. తెలంగాణ పీసీసీ జాబితాలో జైపాల్ రెడ్డి పేరు లేదని తెలుస్తోంది.

ర్యాలీకి అనుమతి నిరాకరించినా

రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు చెప్పగా.. శంషాబాద్‌లో 500 బైకులతో కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీకి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులను పట్టించుకోకుండా వారు బైక్ ర్యాలీ నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Rahul Gandhi Hyderabad visit: No entry to Jaipal Reddy

హైదరాబాద్ చేరుకున్న తర్వాత మధ్యాహ్నం మూడున్నర గంటలకు రాహుల్ మహిళా సంఘాలతో భేటీ అవుతారు. సాయంత్రం ఐదున్నర గంటలకు శేరిలింగంపల్లి నియోజకవర్గం నేతలతో సమావేశమవుతారు. రాత్రి హోటల్ హరిత ప్లాజాలో బస చేయనున్నారు.

Recommended Video

ఓయూలో రాహుల్ సదస్సుకు వీసీ అనుమతి నిరాకరణపై స్పందించిన రేవంత్ రెడ్డి

బీదర్ సభలో కేంద్రంపై రాహుల్ విమర్శలు

బీదర్ సభలో రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. రాఫెల్ డీల్‌లో వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. నిర్మలా సీతారామన్ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందన్నారు.

కాగా, తెలంగాణలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మధ్యాహ్నం హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత బీదర్ బహిరంగ సభ కోసం శంషాబాద్ విమానాశ్రయం నుంచి బీదర్ వెళ్లారు. సభ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు.

English summary
AICC president Rahul Gandhi Hyderabad visit. Securuty did not allowed former Union Minister Jailpal Reddy into Shamshabad airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X