హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహుల్‌కు చెప్పేందుకు నాకు టైం దొరకలేదు: రోశయ్య, కలిసిన కిరణ్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమిళనాడు మాజీ గవర్నర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మంగళవారం హరిత ప్లాజాలో రాహుల్ గాంధీని కలిశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై వివరించేందుకు తనకు సమయం దొరకలేదని చెప్పారు. ప్రజల్లో మద్దతు పెరుగుతుందని, బాగా పని చేయాలని సూచించానని చెప్పారు.

పార్టీ నాయకత్వాన్ని సమష్టిగా ఉంచాలని రాహుల్ గాంధీని కలిసిన పొంగులేటి చెప్పారు. ప్యారాచూట్ నేతలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. రాహుల్‌ను కిరణ్ కుమార్ రెడ్డి కూడా కలిశారు. కాగా, ఆ తర్వాత రాహుల్ గాంధీ గన్ పార్క్‌కు చేరుకొని అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత సరూర్ నగర్ సభకు హాజరయ్యారు. గన్ పార్కుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వచ్చారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి కటౌట్‌లు దర్శనమిచ్చాయి.

Rahul Gandhi visits Gun Park: Kiran Reddy, Rosaiah meets

ఓయు, మత్స్యకారులతో రాహుల్ భేటీ

ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేతలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. మత్స్య సంఘం నేతలు భేటీ అయ్యారు. తమకు ఒక పార్లమెంటు, రెండు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని రాహుల్‌ను మత్స్య సంఘం నేతలు కోరారు. అలా చేస్తే 30 లక్షల మంది మత్స్యకారులు కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చేలా కార్యక్రమాలు రూపొందించామని వారు చెప్పారు.

రాహుల్ పర్యటనకు వరుణదేవుడి సహకారం: వీహెచ్

Recommended Video

కాంగ్రెస్ బూత్‌ కమిటీ అధ్యక్షులతో రాహుల్ టెలికాన్ఫరెన్స్

మీడియా దృష్టిని మరల్చేందుకే నిన్న (సోమవారం) టీఎర్ఎస్ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు అన్నారు. రాహుల్ గాంధీ పర్యటనకు ప్రాధాన్యత తగ్గించేందుకు కేసీఆర్ ప్లాన్ అన్నారు. వరుణుడు సైతం కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పారు. రాహుల్ పర్యటనకు వరుణదేవుడు సహకరిస్తున్నాడని చెప్పారు. కులాల పేరుతో ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. దళితులకు మూడు ఎకరాల భూమి అన్నారని గుర్తు చేశారు.

English summary
AICC president Rahul Gandhi on Tuesday visited Gun Park. Former Chief Ministers Kiran Kumar Reddy and Konijeti Rosaiah met Rahul Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X