హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహుల్! వీటిపై నువ్వు మాట్లాడటమా?: కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన హైదరాబాద్ పర్యటనలో కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏఐసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ మీ మాటేమిటని ప్రశ్నించారు.

రీడిజైన్ల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతోందని రాహుల్ ఆరోపించారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. 'రాహుల్ జీ!.. మీరు అవినీతి గురించి మాట్లాడటమా? అసలు మీరు నిలుచున్న డయాస్ (సరూర్ నగర్ స్టేడియం)లో ఎవరున్నారో చూడండి. నీ చుట్టు కూర్చున్న సగం మంది బెయిల్ పైన ఉన్నవారే!! కొందరు సీబీఐ కేసులలో, ఇంకొందరు అవినీతి కేసుల్లో ఉన్నారని చెప్పారు. ఓహ్, నేను మరిచిపోయా అసలు ఇది స్కాంగ్రేస్ పార్టీ. ఏ ఫర్ ఆదర్శ్ బీ ఫర్ బోఫోర్స్, సీ ఫర్ కామన్వెల్త్, ఇంకా నన్ను కొనసాగించమంటారా, సర్!' అని ఓ ట్వీట్ చేశారు.

గన్ పార్క్ వద్ద రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు అమరవీరులకు నివాళులు అర్పించారు. దీనిపై కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. 'రాహుల్ గాంధీ గారు, తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించింది ఎవరో తెలుసా!?' 1969 తెలంగాణ ఉద్యమం సమయంలో ఇందిరాగాంధీ కారణంగా మృతి చెందిన 369 మంది అమరవీరులు, అలాగే 2009 నుంచి 2014 వరకు యూపీఏ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం వల్ల ఎంతోమంది యువకులు మృతి చెందారు. వీటికి కారణమైన కాంగ్రెస్ నివాళులు అర్పిస్తోందన్నారు.

రాహుల్ గాంధీ వాక్‌స్వాతంత్ర్యం గురించి, మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడటమా అని కేటీఆర్ మరో ట్వీట్లో ఎద్దేవా చేశారు. వావ్.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మీకు ఓ విషయం గుర్తు చేస్తున్నానని, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఒకే ఒక ఎమర్జెన్సీ వచ్చిందని దుమ్ముదులిపారు. అసలు ప్రజాస్వామ్యాన్ని ఎవరు ఖూనీ చేశారని ప్రశ్నించారు. ఇవి చేసింది మా స్కాంగ్రేస్ (స్కాంలు చేసే కాంగ్రెస్) పార్టీ కాదా? అని ప్రశ్నించారు.

Rahul Ji, You are talking about Corruption and freedom of expression?: KTR
English summary
It was the same 369 youth Indira Gandhi had ruthlessly shotdown in 1969 agitation & hundreds of youth that’ve killed themselves from 2009-14 as UPA reneged on its promise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X