వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో పీసిసి నేత‌ల‌తో రాహుల్ భేటీ..! తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన, జ‌ర‌గ‌బోవు ఎన్నిక‌ల‌పై చ‌ర్చ‌

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైద‌రాబాద్ : సాధార‌ణ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగ‌త బ‌లోపేతం దిశాగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా స్థానిక పార్టీల ప‌టిష్టత ఎన్నిక‌ల్లో అనుస‌రించ‌బోవు వ్యూహాలు, పొత్తులు తదిత‌ర అంశాల పై లోతైన చ‌ర్చ జ‌రుపుతున్నారు. ఢిల్లీ లోని వార్ రూం లో పిసీసీ నేత‌ల‌తో ఏఐసీసీ ఆద్య‌క్షుడు రాహుల్ గాంధీ భైటీ నిర్వ‌హించి ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పీసీసీ నేత‌ల‌తో రాహుల్ గాందీ ప్ర‌త్యేకంగా స‌మావేశమై రాష్టంలో నెలకొన్న ప‌రిస్థితుల‌పై లోతుగా చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. పార్టీ సంస్థాగ‌తంగా ప‌టిష్ట‌మవ్వ‌డంతో పాటు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం ఉద్రుతం చేయ‌డం వంటి అంశాల‌పై చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల పిసీసీ నేత‌ల‌తో రాహుల్ గాంధీ వేర్వేరుగా స‌మావేశ‌మైన‌ట్టు తెలుస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బ‌లోపైతం ఇటు తెలంగాణ పిసీసీ అద్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, అటు ఏపి పిసీసీ అద్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి తో రాహుల్ భేటీ అయ్యారు. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను, ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను, అదికార గులాబీ పార్టీ పై ఉన్న ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను ఆ పార్టీ ఎలా అదిగ‌మించింద‌నే అంశాల‌ను ఉత్త‌మ్ ను అడిగి తెలుసుకున్న‌ట్టు తెలుస్తోంది. రాబోవు పంచాయ‌తీ ఎన్నిక‌లు, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలో ఉత్త‌మ్ తో రాహుల్ చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

Rahul meeting with PCC leaders in Delhi Talk about elections in both telugu states..!!

ఇక ఏపీలో కూడా పార్టీ మ‌నుగ‌డ‌, పొత్తులు, బ‌లోపేతం త‌దిత‌ర అంశాల‌పై లోతైన చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. అదికార టీడిపి పార్ట‌తో కలిసి ముందుకు వెళ్తే ఎలాంటి ప‌రిణామాలు ఉంటాయి., కల‌వకుండా ఉంటే ఎలా ఉంటుంది అనే అంశాల‌ప‌ట్ల ర‌ఘువీరాతో రాహుల్ చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ‌లో ఓట‌ద‌మిపై విశ్లేష‌ణ చేస్తూనే ఏపీలో భ‌విష్య‌త్తుకు రాహుల్ బాట‌లు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే నెల‌లో రాహుల్ తెలంగాణ, ఏపిలో ప‌ర్య‌టించ‌బోతున్న‌ట్టు పీసిసి వ‌ర్గాలు తెలియ‌జేస్తున్నాయి.

English summary
The Congress party Strengthening local parties is a deep debate on the strategies and alliances that will follow in the elections. AICC chief Rahul Gandhi conducted a meeting with PCC leaders at War Room in Delhi and discussed various issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X