వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాయగిరి రైల్వే స్టేషన్ పేరు మార్పు - ఇకపై అది యాదాద్రి రైల్వే స్టేషన్ - భారీ ప్రణాళికలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణలోని రాయగిరి రైల్వే స్టేషన్ పేరును రైల్వే శాఖ మార్చేసింది. ఇకపై దానిని యాదాద్రి రైల్వే స్టేషన్ గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో రాకేశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

భీవండిలో భయానక దుర్ఘటన - కుప్పకూలిన బిల్డింగ్ - చిన్నారులు సహా పదుల సంఖ్యలో మృతి భీవండిలో భయానక దుర్ఘటన - కుప్పకూలిన బిల్డింగ్ - చిన్నారులు సహా పదుల సంఖ్యలో మృతి

సికింద్రాబాద్ - ఖాజీపేట రూట్ లో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న రాయగిరి రైల్వేస్టేషన్ పేరును యాదాద్రి రైల్వే స్టేషన్ గా మార్చే ప్రక్రియపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నామని రైల్వే అధికారులు తెలిపారు. స్టేషన్ కోడ్ ను YADD గా నిర్ణయించినట్లు చెప్పారు.

Raigir railway station renamed as Yadadri railway station: SCR

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిని ప్రపంచ స్థాయి క్షేత్రంగా మలచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం, ఆ మేరకు భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టడం, ఆలయ రూపురేఖలను వైభవంగా మార్చేయడం, చుట్టు పక్కల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తుండటం తెలిసిందే. రాబోయే రోజుల్లో యాదాద్రి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో రైల్వే స్టేషన్ కు కూడా పుణ్యక్షేత్రం పేరునే పెట్టాలని కేసీఆర్ సర్కారు కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సికింద్రాబాద్ లోని ఎస్‌సీఆర్ అధికారులు ప్రకటన చేశారు.

ఆందోళనల వేళ, ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన - కీలక అంశాలివే - వీలైతే ప్రధాని మోదీతోనూ భేటీఆందోళనల వేళ, ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన - కీలక అంశాలివే - వీలైతే ప్రధాని మోదీతోనూ భేటీ

రాయగిరి నుంచి యాదాద్రిగా పేరుమారిన రైల్వే స్టేషన్ ను కూడా కేంద్రం సాయంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని కేసీఆర్ సర్కారు భావిస్తున్నది. మరోవైపు, హైదరాబాద్ మెట్రో రైలు సేవలను యాదాద్రి వరకు పొడగించే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నది. మొత్తంగా యాదాద్రి అభివృద్ధిలో రైల్వే స్టేషన్ పేరు మార్పు కీలక పరిణామంగా నిలిచింది.

English summary
the competent authority has approved the change in name of 'Raigir' railway station located on secunderabad - kazipet of secunderabad division over south central railway(SCR) as 'Yadadri' railway station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X