వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అటు సంతోషం, ఇటు బాధ: రైల్వే బడ్జెట్‌పై ఎవరేమన్నారు?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు గురువారం రైల్వే బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే...

ప్రధాని నరేంద్రమోడీ:

ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన మంత్రి సురేశ్ ప్రభుతో పాటు యావత్ రైల్వే కుటుంబానికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. సురేశ్ ప్రభు ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందన్నారు. భారత ఆర్థిక అభివృద్ధిలో రైల్వే బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

Also Read: రైల్వే బడ్జెట్లో తెలుగురాష్ట్రాలకు నిరాశ, బాబుకు మోడీ చేయి! ఇవే...

రైల్వే బడ్జెట్ దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండేలా రైల్వే బడ్జెట్ ఉందన్నారు. రైల్వే బడ్జెట్ ఆశాజనకంగా ఉందని, అంత్యోదయ ఎక్స్‌ప్రెస్, దీనదయాల్ బోగీల ఏర్పాటు వల్ల తమ ప్రభుత్వం పేదలకు కట్టుబడి ఉందన్న అంశం మరోసారి రుజువైందన్నారు.

గత ఏడాది మెరుగైన రీతిలో విజయం సాధించామని, ప్రస్తుత రైల్వే బడ్జెట్ కూడా భవిష్యత్తులో మరింత ప్రగతిని చూపిస్తుందన్నారు. గత రైల్వే బడ్జెట్‌లను విమర్శించాలన్న ఉద్దేశం తనకు లేదని, కానీ ఈసారి బడ్జెట్‌లో రైల్వే పెట్టుబడులను రెండున్నర రేట్లు పెంచామన్నారు.

Rail Budget 2016 highlights: politicians talking about railway budget

రైళ్లలో సాంకేతికతను పెంచామన్న ప్రధాని మోడీ, ప్రయాణికులకు అవసరాలపైన దృష్టి పెట్టడమే తమ లక్ష్యమన్నారు. పరిశుభ్రత, కస్టమర్ బెనిఫిట్, టెక్నాలజీ అప్‌గ్రేడ్ లక్ష్యాలతో గత రెండు రైల్వే బడ్జెట్‌లను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.

కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు:
గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రయాణికుల సంక్షేమానికి పెద్ద పీట వేశారన్నారు. భారతీయ రైల్వే వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. రైల్వే బడ్జెట్‌ ప్రయాణికుల సంతృప్తిపై దృష్టిసారించేలా ఉందన్నారు.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్‌ ప్రకాశ్‌ నడ్డా:
రైల్వే బడ్జెట్‌లో సురేశ్‌ ప్రభు దార్శనికత, సృజన శీలత కన్పించాయన్నారు. భవిష్యత్తు పట్ల ఆశావహదృక్పథం ఏర్పడిందన్నారు.

కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా:
రైల్వేలు భారత ఆర్థికవ్యవస్థకు వెన్నెముక అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ చక్కటి సమన్వయంతో కూడిన రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టారని మంత్రి సురేశ్ ప్రభుని కొనియాడారు.

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి:
కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సప్లమెంటరీ బడ్జెట్‌లో అయినా రాష్ట్ర ప్రాధాన్యతలు గుర్తించాలని కోరారు.

తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న:
రైల్వే బడ్జెట్‌లో ఆదిలాబాద్ జిల్లాకు పూర్తిగా అన్యాయం జరిగిందని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్ నుంచి రాష్ట్ర రాజధానికి రైల్వే అనుసంధానం లేదని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాపై కేంద్రం చిన్న చూపు చూస్తుందన్నారు.

ఆదిలాబాద్ జిల్లాకు కొత్త లైన్లు కేటాయించలేదని చెప్పారు. రాష్ట్ర ప్రతిపాదనలు రైల్వే శాఖ పరిగణనలోకి తీసుకోలేదు అని పేర్కొన్నారు. రాష్ర్టానికి జరిగిన అన్యాయంపై ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని కలుస్తామని చెప్పారు.

తెలుగుదేశం ఎంపీ తోట నర్సింహం:

రైల్వే బడ్జెట్‌పై టీడీపీ ఎంపీ తోట నర్సింహం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... బడ్జెట్‌లో పిఠాపురం-కాకినాడ రైల్వేలైన్‌కు రూ.50కోట్లు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్‌కు రూ.200 కోట్లు మంజూరు చేసిన రైల్వే మంత్రి, ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Rail Budget 2016 highlights, politicians talking about railway budget.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X