హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కత్తి మహేష్‌ను జీవిత కాలం బహిష్కరించాలి, పరిపూర్ణానందను అరెస్ట్ చేస్తారా?: బీజేపీ ఎమ్మెల్యేలు

|
Google Oneindia TeluguNews

raja singh and nvs prabhakar fires at Telangana government for not arresting kathi mahesh

Recommended Video

కత్తి మహేష్ పై సిటీ డీజీపీ వ్యాఖ్యలు

హైదరాబాద్: హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై ఆరు నెలల నగర బహిష్కరణ సరిపోదని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. గృహ నిర్బంధంలో ఉన్న స్వామి పరిపూర్ణానందను కలిసేందుకు ఉప్పల్ బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ తోపాటు రాజా సింగ్ వచ్చారు.

కాగా, స్వామి పరిపూర్ణానందను కలిసేందుకు వచ్చిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు సినీ నటి కరాటే కళ్యాణిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాజా సింగ్ మాట్లాడారు.

కత్తి మహేష్‌ను హైదరాబాద్ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని, జీవితకాలంపాటు నిషేదం విధించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలుగా స్వామి పరిపూర్ణానందను కలిసేందుకు వస్తే పోలీసులు అనుమతి ఇవ్వలేదని, దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. దళితుల పేరుతో రాజకీయం చేయడం సరికాదన్నారు.

ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ.. స్వామి పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ప్రభుత్వానికి పట్టగా? నిలదీశారు.

English summary
BJP MLAs Raja Singh and NVS Prabhakar on fired at Telangana Government for not arresting Kathi Mahesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X