వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాజికల్ గా గేమ్ ఆడుతున్న రాజగోపాల్ రెడ్డి.. కన్ఫ్యూజ్ అవుతున్న తెలంగాణా కాంగ్రెస్ పార్టీ

|
Google Oneindia TeluguNews

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారా ? కాంగ్రెస్ లో కొనసాగుతారా ? అన్న సందిగ్ధం వీడలేదు. పార్టీ మారతాను అన్నట్టు మాట్లాడుతూ పార్టీ మారటం లేదని చెప్తూ పార్టీ పైనే సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. పార్టీ అధిష్టానంపై దుమ్మెత్తి పోస్తున్నారు. పార్టీ కి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరకుండా , పార్టీకి అనుకూలంగా పని చెయ్యకుండా లాజికల్ గా గేమ్ ఆడుతున్నారు రాజ గోపాల్ రెడ్డి . ఇక ఎటూ తేల్చుకోలేక కన్ఫ్యూజ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ.

గులాబీ పార్టీ ఆఫీసుల భూమిపూజ .. భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సోదరుడు , సూర్యాపేటలో రైతులు అడ్డగింతగులాబీ పార్టీ ఆఫీసుల భూమిపూజ .. భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సోదరుడు , సూర్యాపేటలో రైతులు అడ్డగింత

రాజగోపాల్ రెడ్డి క్రమశిక్షణా రాహిత్యంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. క్రమశిక్షణా చర్యలకు రంగం సిద్ధం

రాజగోపాల్ రెడ్డి క్రమశిక్షణా రాహిత్యంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. క్రమశిక్షణా చర్యలకు రంగం సిద్ధం

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది . సొంత పార్టీపై విమర్శలు గుప్పించడం చేస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అతి త్వరలోనే కోమటిరెడ్డి మరికొందరు నాయకులతో పాటు కాషాయ కండువా కప్పుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కానీ ఆయన పార్టీ మారటం లేదు. అలాగని సొంతపార్టీపై విమర్శలు ఆపటం లేదు . ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి క్రమశిక్షణా రాహిత్యంపై కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్ గా ఉంది . పార్టీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుండటంతో పాటు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తోన్న ఆయనపై కాంగ్రెస్ అధిష్టానం కన్నెర్ర చేస్తుంది . పార్టీలో క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ చర్యలకు సిద్ధమైంది.

Recommended Video

బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
గోల్కొండ హోటల్ లో కోర్ కమిటీ భేటీ .. సస్పెన్షన్ పై చర్చ .. ఏం చెయ్యాలన్న సందిగ్ధంలో కాంగ్రెస్

గోల్కొండ హోటల్ లో కోర్ కమిటీ భేటీ .. సస్పెన్షన్ పై చర్చ .. ఏం చెయ్యాలన్న సందిగ్ధంలో కాంగ్రెస్

ఇక ఈనేపధ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌ గొల్కొండ హోటల్‌లో జరిగిన పీసీసీ కోర్ కమిటీ సమావేశంలో పార్టీ ఫిరాయింపులపై ప్రధానంగా చర్చించారు. పార్టీ మారే విషయంలో కఠినంగానే వ్యవహారించాలని నేతలు నిర్ణయించారు. రాజగోపాల్ రెడ్డిని ఏకంగా ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే రాజకీయ ఫిరాయింపు చట్టం వర్తించదని పలువురు సీనియర్లు చెప్పడంతో దీనిపై న్యాయ సలహా తీసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు.

ఇదంతా రాజగోపాల్ రెడ్డి గేమ్ .. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అడకత్తెరలో పోక చెక్కే కాంగ్రెస్

ఇదంతా రాజగోపాల్ రెడ్డి గేమ్ .. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అడకత్తెరలో పోక చెక్కే కాంగ్రెస్

ఇప్పటి వరకు తెలంగాణాకాంగ్రెస్ పార్టీ నుండి చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. వెళ్తూ సంచలన ఆరోపణలు చేశారు . ఇక పార్టీ లో ఉన్నజగ్గా రెడ్డి, వీహెచ్ వంటి నేతలు సైతం పార్టీ పై ఆరోపణలు చేస్తున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి ఇష్యూనే హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆయనపై గతంలో ఎవరిపై తీసుకోని విధంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవటం కూడా రాజ గోపాల్ రెడ్డి గేమ్ ప్లాన్ లో భాగం అనే భావన కలుగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ అలాంటి నిర్ణయం తీసుకుంటే ఆయనను సస్పెండ్ చేస్తే అప్పుడు ఆయనకు కచ్చితంగా స్వేచ్చ దొరికినట్టే. ఒకవేళ ఆయన పార్టీ మారినా ఆయనపై ఫిరాయింపుల చట్టం వర్తించదు . కాబట్టి ఆయనపై కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం ఏదైనా అది ఆయనకే మేలు చేసేలా వుంది.ఇక ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయన విషయంలో కన్ఫ్యూజన్ లో ఉంది.

ఉపేక్షిస్తే లాభం లేదు వేటు వెయ్యండి అంటున్న కాంగ్రెస్ నేతలు .. రియాక్షన్ ఎలా ఉంటుందో

ఉపేక్షిస్తే లాభం లేదు వేటు వెయ్యండి అంటున్న కాంగ్రెస్ నేతలు .. రియాక్షన్ ఎలా ఉంటుందో

ఇక కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత అభద్రతా భావం కలగకుండా ఉండేందుకు గోడ దూకాలనుకున్న ఎమ్మెల్యేలను ఉపేక్షించటం కరెక్ట్ కాదని , ఆలస్యం అమృతం విషం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. రాజగోపాల్ రెడ్డి విషయంలో ఆలస్యం చేయడం మంచిది కాదని చెప్తున్న నేతలు ఆయన ఎలాగో పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నందున ఏ మాత్రం సహించవద్దని అంటున్నారు. అవసరమైతే పార్టీ నుంచి బహిష్కరించాలని పలువురు నేతలు సూచించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి చూస్తే కోమటిరెడ్డికి షాకివ్వాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది.అయితే.. కాంగ్రెస్ పెద్దల నిర్ణయం అదే అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే .

English summary
Rajagopal Reddy joins BJP? Will he continue in Congress? The ambiguity does not go away. Rajagopal Reddy is making comments on the party leaders and high command . It was in this context that the Congress showcause notices issued . At the PCC core committee meeting held at Golconda Hotel, Hyderabad, the party's main focus was on the defects of the party. Rajagopal Reddy to be suspended from party.Congress seniors are expected to seek legal advice on the matter, as many seniors have said the suspension from the party does not apply to political defection law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X