వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజయ్య బర్తరఫ్ , జగదీష్ రెడ్డి సేఫ్ .. ఇది కుల వివక్ష కాదా... కేసీఆర్ పై మంద కృష్ణ మాదిగ ఫైర్

|
Google Oneindia TeluguNews

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు . ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద అంబేద్కర్ వాదుల నిర్వహించిన మహాగర్జన నిరసన సభలో పాల్గొన్న ఆయన దళిత వర్గాలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కేసీఆర్ కు కులవివక్ష నేటికి ఉందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అన్ని పార్టీల్లోని అంబేద్కర్ వాదులను ఏకతాటి మీదకు తెచ్చి కేసీఆర్ పై వార్ ప్రకటిస్తానని ఆయన చెప్పారు.

దళితుల ఆరాధ్యదైవం అయిన అంబేద్కర్‌ను టీఆర్ఎస్ సర్కార్ అవమానించిందంటూ మండిపడ్డారు. ఎలాంటి ఆరోపణలు లేకపోయినా మంత్రివర్గం నుంచి రాజయ్యను బర్తరఫ్ చేసిన కేసీఆర్ విద్యాశాఖలో ఇన్ని అవకతవకలు కళ్ళ ముందు కనిపిస్తున్నా జగదీష్ రెడ్డిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు .ఇది కుల వివక్ష కాదా కేసీఆర్ అంటూ మందా కృష్ణ మాదిగ ప్రశ్నించారు.

కేసీఆర్ దేశాన్ని ఉద్ధరించటానికి వెళ్తున్నారా? భ్రష్టు పట్టించింది టీఆర్ఎస్సే..సాధినేని యామిని ఫైర్కేసీఆర్ దేశాన్ని ఉద్ధరించటానికి వెళ్తున్నారా? భ్రష్టు పట్టించింది టీఆర్ఎస్సే..సాధినేని యామిని ఫైర్

Rajaiah bartaraf .. Jagadish reddy safe .. is this not caste discrimination.. Manda Krishna Madiga fired on KCR

అంబేద్కర్ విగ్రహం పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై గవర్నర్ , జాతీయ ఎస్సీ ఎస్టీ కమీషన్ ను కలిసి ఫిర్యాదు చేస్తానని మంద కృష్ణమాదిగ పేర్కొన్నారు. కేసీఆర్ కులవివక్షపై యుద్ధం చేస్తామని చెప్పారు.

English summary
The founder president of the MRPS, Manda krishna Madiga fired on Telangana CM KCR .The KCR government has cheated his Dalit groups he said when he participating in the Mahagharjana protest organized by Ambedkar activists at the Indira Park Dharna Chowk. KCR was accused of caste discrimination today. Ambedkar's allies in all parties in protest against the TRS government's attitude will be brought to unity and will announce the war on KCR.Despite the absence of any allegations, Rajaiah has been eliminated from the cabinet. In the education department there are lot of allegations on minister Jagdish Reddy but KCR never take a decision of elimination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X