వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జక్కన్న ఛాలెంజ్‌కు సింహాద్రి సై: బాబాయ్‌ను ఫిక్స్ చేసిన అబ్బాయి,జర దేఖో..!

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళిస్తున్న వేళ ఆయా దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఈ క్రమంలోనే ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక ఇళ్లల్లోనే ఉంటున్న ప్రజలు ఇంటి పనులు చేస్తూ సరదాగా తమ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇది సెలబ్రిటీలకు కూడా మినహాయింపు ఏమీ కాదు. నిత్యం బిజీగా గడిపే సెలబ్రిటీలు తాము కూడా ఇళ్లకే పరిమితమై ఇంటిపనులు చేస్తూ వారి వీడియోలను షేర్ చేస్తున్నారు. పొలిటికల్ స్టార్స్ నుంచి సినిమా స్టార్స్ వరకు అంతా ఇదే ఫాలో అవుతున్నారు. ఇక నిత్యం సినిమాలతో బిజీగా ఉండే ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా చీపురు చాట పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఆ కథేంటో ఓ సారి చూద్దాం.

Recommended Video

#BetheREALMAN : Watch How RRR Movie Team Accepted The 'Be The Real Man' Challenge

రాజమౌళిని రియల్ మ్యాన్ ఛాలెంజ్‌కు నామినేట్ చేసిన సందీప్ వంగా

కరోనావైరస్ వేళ దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోవడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక సెలబ్రిటీల రూటే సపరేటు. నిత్యం సినిమా షూటింగులతో బిజీగా ఉండే వాళ్లు ఇప్పుడు ఇళ్లల్లో పనులు చేసుకుంటూ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. తాజాగా సెలబ్రిటీల మధ్య ఓ ఛాలెంజ్ నడుస్తోంది. అదే "బి ద రియల్ మ్యాన్ ఛాలెంజ్". ప్రస్తుతం ఇళ్లకే పరిమితం కావాల్సి రావడంతో ఇంట్లో గృహిణిలకు సహాయం చేయడం ఈ ఛాలెంజ్ ముఖ్య ఉద్దేశం. అర్జున్ రెడ్డి ఫేం డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా తన ఇంట్లోని పాత్రలను శుభ్రం చేస్తూ, అదే సమయంలో ఇంటిని క్లీన్ చేస్తూ వీడియో తీశారు. "మగవాడు నిజంగా మంచి ఇంటివాడిగా ఉండొచ్చు. మహిళను మాత్రమే ఇంటి పనికి పరిమితం చేసేవాడు మంచి మగాడు అనిపించుకోడు.ప్రత్యేకించి ఈ పనిమనిషి లేని సమయంలో ఇంట్లో మహిళలకు ఇంటిపనుల్లో సహాయం చేయాలంటూ ట్వీట్ చేస్తూ ఈ వీడియో పోస్టు చేసి దర్శకధీరుడు రాజమౌళికి ఛాలెంజ్ విసిరాడు. ఇలా తను కూడా మరికొందరికి ఛాలెంజ్ విసిరాలని కోరాడు.

టాస్క్ డన్ అన్న జక్కన్న

ఎప్పుడూ చేతిలో మైక్ పట్టుకుని స్టార్ట్..కెమెరా..యాక్షన్ అని చెప్పే జక్కన్న ఈ సారి సందీప్ వంగా విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి అదే చేత్తో చీపురు చాట పట్టుకున్నారు. అంతేకాదు ఇంటిని శుభ్రంగా చీపురుతో ఊడ్చాడు. ఇంటి ఫ్లోర్‌పై తడి బట్టతో తుడిచాడు. తలుపులు, కిటికీలను క్లీన్ చేశాడు. చివరకు తన సతీమణి రమా రాజమౌళి ఏదో ప్రిపేర్ చేస్తుండగా ఆమె వెనక నిల్చొని చీపురు చాట పట్టుకుని బాహుబలి స్టైల్‌లో నిల్చున్నాడు. అనంతరం సందీప్ వంగా ఇచ్చిన బి ది రియల్ మ్యాన్ టాస్క్ పూర్తయిందంటూ రాజమౌళి ట్విటర్‌లో వీడియో పోస్టు చేశాడు. అంతేకాదు ఆ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా ఆర్‌ఆర్ఆర్ హీరోలు రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లకు సవాల్ విసిరాడు. ఈ లాక్‌డౌన్ నుంచి సినిమా ఇండస్ట్రీ పూర్తిగా కోలుకునేందుకు దాదాపు ఏడాదికి పైగా సమయం పడుతుందని జక్కన్న ఇదివరకే చెప్పారు.

మగధీరుడు సింహాద్రిలను నామినేట్ చేసిన జక్కన్న

ఇక బాహుబలిని చెక్కిన జక్కన్న బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్‌ను రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లకు విసిరాడు. ఇక జక్కన్న విసిరిన ఛాలెంజ్‌ను సింహాద్రి స్వీకరిస్తున్నట్లు ట్వీట్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయగానే ఆయన అభిమానులు "ఆదికేశవరెడ్డి " ఇంట్లో ఏపని చేస్తాడా అంటూ సోషల్ మీడియా వేదికగా చర్చించుకున్నారు. ఇక జక్కన్నఛాలెంజ్ స్వీకరించిన సింహాద్రి తన ఇళ్లును క్లీన్ చేశాడు. అదే సమయంలో కిచెన్‌లో పాత్రలను బట్టపెట్టి తుడిచాడు.ఆ తర్వాత తన గార్డెన్‌లో ఉన్న చెత్తను శుభ్రంచేసి వీడియోను పోస్టు చేశాడు. వీడియోను పోస్టు చేసిన జూనియర్ ఎన్టీఆర్... మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు పనులను కూడా పంచుకుందాం అంటూ ట్వీట్ చేశారు. అనంతరం ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా తన బాబాయ్ బాలయ్యకు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, శివ కొరటాలను నామినేట్ చేశాడు. ఇక మెగాపవర్ స్టార్ రాంచరణ్‌ కూడా ఎలాంటి వీడియో పోస్టు చేస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అంతకు కొద్దిరోజుల ముందు రాంచరణ్ తన భార్య ఉపాసన కోసం కిచెన్‌లో గరిటె తిప్పిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ పొలిటీషియన్స్‌ను కూడా తాకుతుందా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. రాజకీయనాయకులను సినీ సెలిబ్రిటీలు ఫిక్స్ చేస్తారా అనేదానిపై నెటిజెన్లు జోరుగా చర్చించుకుంటున్నారు.

English summary
Filmmaker SS Rajamouli, on Monday, took the "Be the real man" challenge and shared the video on his Twitter profile. 'Be the real man' challenge is aimed to break the stereotype and encourage men to help women in household chores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X