వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉపాధి హమీ పథకంలో భేష్.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు అగ్రస్థానం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీమ్ - ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా రాష్ట్రాల వారీగా ర్యాంకులు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో చూసినట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు వికారాబాద్ జిల్లా ముందువరుసలో నిలిచింది. ఈ రెండు జిల్లాలు మొదటి రెండు స్థానాలు దక్కించుకుని పలువురి ప్రశంసలు పొందుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఉపాధి హమీ పథకం అమలులో రాజన్న సిరిసిల్ల, వికారాబాద్ జిల్లాలకు 4.58 శాతం మార్కులు లభించాయి. ఆ తర్వాతి స్థానాల్లో మిగతా జిల్లాలకు ర్యాంకులు దక్కాయి. నిర్మల్ 3వ స్థానంలో, మెదక్ జిల్లా 4వ, సిద్దిపేట 5వ, వనపర్తి 6వ, రంగారెడ్డి జిల్లా 7వ స్థానాల్లో నిలిచాయి.

Recommended Video

మూడోసారి వాయిదా పడిన ఎంపీపీ ఎన్నిక
rajanna sircilla top in central scheme of MGNREGS

పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. ట్రైనింగ్ మరిచారు, జీతాల్లేవు.. ఆ పోస్టుతో తిప్పలెన్నో..!పేరుకే ప్రభుత్వ ఉద్యోగం.. ట్రైనింగ్ మరిచారు, జీతాల్లేవు.. ఆ పోస్టుతో తిప్పలెన్నో..!

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద కూలీలకు రోజువారీ వేతనం కింద 176 రూపాయల 50 పైసలు చెల్లిస్తున్నారు. అంతేగాకుండా వంద రోజులు నూటికి నూరు శాతం కూలీలకు పని కల్పించి అగ్రస్థానంలో నిలిచింది. 7 రోజుల్లో ఎఫ్‌టీవోలను అప్‌లోడ్‌ చేయడంలో రాజన్నసిరిసిల్ల జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఉపాధి హామీ కూలీలకు సగటు వేతనం ఇప్పించడంలో ఈ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.

ఉపాధి హామీ పథకం కింద పూర్తి చేసిన పనులను, వాటికి సంబంధించిన తదితర వివరాలను జియోట్యాగింగ్ చేయడంలోనూ.. కేటాయించిన పనులను పూర్తి చేయడంలోనూ మెరుగైన పనితీరు కనబరిచింది రాజన్న సిరిసిల్ల జిల్లా. అగ్రస్థానంలో నిలవడంపై జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్.. డీఆర్డీవో రవీందర్ తో పాటు ఏపీడీలను, ఈసీ, టీఏ, సీవోలను, ఫీల్డ్ అసిస్టెంట్లను అభినందించారు.

English summary
Central Government Released MGNREGS implementation rankings. For Telangana Rajanna Sircilla District got first rank and Vikarabad District got second rank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X