హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప్పల్ నరబలి: తల మాత్రమే డాబాపై ఉంచడం వెనుక?, ఆ సలహాతోనే ఇదంతా..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉప్పల్ నరబలి కేసులో నిజానిజాలను పోలీసులు నిగ్గుతేల్చారు. కేసులో మొదటినుంచి అనుమానాస్పదంగానే వ్యవహరిస్తూ వచ్చిన రాజశేఖరే అసలు నిందితుడిగా పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.

Recommended Video

చిన్నారిది నరబలే! అతనే నిందితుడు.. అదే పట్టించింది..!

బలిచ్చిన చిన్నారి వివరాలతో పాటు క్షుద్ర పూజ చేసిన తీరును దానికి దారితీసిన పరిస్థితులను పోలీసులు క్షుణ్ణంగా వివరించారు. బలి తర్వాత మొండేన్ని పడవేసి.. తలను మాత్రమే ఎందుకు ఇంటి డాబాపై ఉంచారన్న దానికి కూడా పోలీసులు వివరణ ఇచ్చారు.

ఉప్పల్ నరబలి: డీఎన్ఏ రిపోర్ట్ వచ్చేసింది.., వాటితో మ్యాచ్ అయితే మరో మలుపు తిరిగినట్టే? ఉప్పల్ నరబలి: డీఎన్ఏ రిపోర్ట్ వచ్చేసింది.., వాటితో మ్యాచ్ అయితే మరో మలుపు తిరిగినట్టే?

చిలుకానగర్ నరబలి: నగ్నంగా రాజశేఖర్ దంపతుల క్షుద్రపూజలు, బోయిగూడ నుండి చిన్నారి కిడ్నాప్ చిలుకానగర్ నరబలి: నగ్నంగా రాజశేఖర్ దంపతుల క్షుద్రపూజలు, బోయిగూడ నుండి చిన్నారి కిడ్నాప్

తల మాత్రమే ఎందుకు ఉంచారు?:

తల మాత్రమే ఎందుకు ఉంచారు?:

చంద్రగ్రహణం రోజు చిన్నారిని బలి ఇవ్వడంతో.. సంపూర్ణ గ్రహణం వీడే సమయంలో బలిచ్చిన తలపై వెన్నెలతో పాటు తెల్లవారుజామునే సూర్యకిరణాలు ప్రసరిస్తే ఫలితం ఉంటుందని మాంత్రికులు రాజశేఖర్‌కు చెప్పారు. దీంతో చిన్నారి తలను డాబాపై నైరుతి ప్రాంతంలో ఉంచాడు రాజశేఖర్.

ఇలా వెలుగులోకి:

ఇలా వెలుగులోకి:

రాత్రి నరబలి ఇచ్చి తలను డాబాపై ఉంచిన తర్వాత.. ఎవరికీ అనుమానం రాకుండా ఆరోజంతా డ్యూటీలోనే ఉన్నానని చెప్పేందుకు ఉదయాన్నే తన క్యాబ్ తీసుకుని మాదాపూర్ వెళ్లిపోయాడు రాజశేఖర్.

అయితే ఈ తతంగమంతా తెలియని రాజశేఖర్ అత్త వీరకొండ బాలలక్ష్మి ఉతికిన బట్టలు ఆరేసేందుకు డాబా పైకి వెళ్లి చిన్నారి తలను చూసి ఒక్కసారిగా గట్టి గట్టిగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కలవారంతా రావడంతో ఈ దారుణం వెలుగుచూసింది.

ఆ సలహాతోనే:

ఆ సలహాతోనే:

క్యాబ్‌ డ్రైవర్ రాజశేఖర్‌ భార్య నాలుగేళ్లుగా తరచూ అనారోగ్యానికి గురవుతోంది.రెండేళ్ల క్రితం మేడారం జాతరకు వెళ్లిన సందర్భంగా.. ఓ కోయదొరను కలిసి తన భార్య ఆరోగ్యం నయం చేయాలని కోరాడు రాజశేఖర్. దీనికి నరబలే పరిష్కారమని, అలా చేస్తే దుష్టశక్తులు తొలగిపోతాయని కోయదొర చెప్పడంతో రాజశేఖర్‌ దంపతులు నరబలికి ఒడిగట్టారు.

అంతకుముందు పాతబస్తీ ఘాంసీబజార్‌కు చెందిన సయ్యద్‌షా మహమూద్‌ ఖైసర్‌ పాషా, బోడుప్పల్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు శ్రీలత, సరితతో పాటు కీసర మండలం చీర్యాలకు చెందిన మల్లారపు లక్ష్మీనారాయణగౌడ్‌లతో క్షుద్రపూజలు కూడా నిర్వహించారని పోలీసులు తెలిపారు.

బోయిగూడ నుంచి కిడ్నాప్..:

బోయిగూడ నుంచి కిడ్నాప్..:

నరబలికి ఆడశిశువును బలివ్వాలని నిర్ణయించుకున్నాక.. గతనెల 31వ తేదీ రాత్రి 7గం.-8 గంటల సమయంలో సికింద్రాబాద్‌ బోయిగూడ వెళ్లాడు రాజశేఖర్. బోయిగూడ గుడిసెల ప్రాంతంలో రెక్కీ నిర్వహించాడు. ఆ సమయంలో రోడ్డు పక్కనే ఓ మహిళ తన ఆర్నెళ్ల బిడ్డతో పాటు నిద్రిస్తుండటం గమనించాడు.

తిరిగి అదే రోజు అర్థరాత్రి దాటాక.. 1.30గం. సమయంలో 'ఏపీ20-టీవీ 1646' కారులో చిన్నారిని అపహరించాడు.

కిడ్నాప్ తర్వాత..:

కిడ్నాప్ తర్వాత..:


చిన్నారిని కిడ్నాప్ చేసిన తర్వాత తెల్లవారుజామున 2గం. సమయంలో నగర శివారులోని ప్రతాపసింగారం వద్ద మూసీ నది సమీపానికి వెళ్లాడు. అక్కడే కత్తితో చిన్నారి మెడ కోశాడు. ఆపై మొండెం, కత్తిని నదిలోనే విసిరేసి.. తల నుంచి రక్తస్రావం ఆగిపోయేంతవరకు వేచి చూసి.. ఆపై తలను పాలిథిన్‌ సంచిలో ఇంటికి తీసుకొచ్చాడు.

నగ్నంగా పూజలు:

నగ్నంగా పూజలు:

చిన్నారిని తలను ఇంటికి తీసుకొచ్చాక.. దాన్ని బలిపీఠంపై ఉంచి దంపతులిద్దరూ నగ్నంగాక్షుద్రపూజలు నిర్వహించారు. గతంలో రాజశేఖర్ పూజలు చేసినట్టు గుర్తించిన పోలీసులు.. ఇంటిలో కంటికి కనిపించని రక్తపు మరకలను గుర్తించడం కేసులో కీలకంగా మారింది. అలాగే రాజశేఖర్ కారులో దొరికిన తాయెత్తులు కూడా అనుమానం బలపడేలా చేశాయి. డీఎన్ఏ రిపోర్టులో చిన్నారి మెడపై ఉన్న రక్తపు మరకలకు ఇంట్లో గుర్తించిన మరకల డీఎన్ఏ కూడా సరిపోవడంతో రాజశేఖర్ దంపతులే నిందితులని తేలింది.

English summary
Two weeks after the severed head of an infant was found on the roof of a cab driver's house in Hyderabad's Uppal area, the police say they have managed to crack the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X