వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడవిలో వదిలేస్తే కుక్క చావు చస్తారు .. వారిపై రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి . ఇటీవల గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ బాధితుడు మరణించటంతో వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు డాక్టర్లపై దాడి చేశారు. సోదరుడి మరణాన్ని జీర్ణించుకోలేక ఆగ్రహంతో వైద్యులపై దాడి చేసిన ఘటన అటు వైద్యులను, ఇటు ప్రజలను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. కరోనా రోగులకు పెద్దమనసుతో వైద్యం చేస్తున్న డాక్టర్ల పట్ల ఇలా వ్యవహరించడం సరి కాదనే భావన వ్యక్తం అవుతుంది. ఇక ఇదే సమయంలో వైద్యులపై దాడిని అటు రాజాకేయ నాయకులు సైతం ఖండిస్తున్నారు.

గాంధీ ఆస్పత్రి వైద్యులపై కరోనా పేషెంట్ తాలూకా మనుషుల దాడిని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్న వైద్యుల మీద దాడి మంచిది కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు . వారు చేసిన పనిపై మండిపడిన రాజా సింగ్ వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. నిజాముద్దీన్ జమాత్ కి వెళ్లిన వారు వేయి కి పైగా ఉన్నారు.. వాళ్లలో కూడా కొంతమంది కి కరోనా వచ్చిందని ఆయన పేర్కొన్నారు . ఇక వైద్యులపై దాడులకు పాల్పడుతున్న వారు మనుషులేనా అని ప్రశ్నించారు రాజా సింగ్ . గాంధీ ఆస్పత్రిలో రాత్రనక , పగలనకా కరోనా బాధితులకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ల పై దాడులు చేశారని, నర్సు ల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని అసలు వాళ్లు మనుషులేనా అని ప్రశ్నించారు.

Rajasingh denies attack on doctors and says leave them in forest

దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారిని అడవిలో వదిలేయాలి కుక్కలు చచ్చి నట్టు చస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజమైన దేవుళ్ళుగా ఈ రోజు డాక్టర్స్ ను చూడొచ్చని ఆ డాక్టర్ లు
పని చేయకుంటే ఒక్క వ్యక్తి కూడా మిగలరని ఆయన అన్నారు. సీఎంకి తాను కోరేది ఒక్కటేనని ఆయన దాడులకు పాల్పడే వారిని అడవిలో వదిలెయ్యాలని కోరారు . ఒవైసీ ఎందుకు సైలెంట్ ఉంటున్నావ్ అని ప్రశ్నించిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మీ వాళ్లకు సరైన మెస్సేజ్ ఇవ్వు అంటూ ఆయన ఎంఐఎం అధినేతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వాళ్ళు వైద్యులకు సహకరించేలా చెప్పమని రాజా సింగ్ డిమాండ్ చేశారు . ఢిల్లీ కి వెళ్లొచ్చిన వారు దాచుకుంటున్నారు వాళ్ళను వెంటనే ఐసోలేషన్ కి పంపించాలని లేకుంటే పేద ముస్లిం లకు ఇబ్బంది వస్తుందని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు.

English summary
Bharatiya Janata Party (BJP) MLA Rajasingh condemned the corona patient attack on Gandhi hospital doctors. He was outraged that the attack on doctors who were serving lives was not good. Furious at what they have done, Raja Singh urged them to be punished harshly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X