వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిరీష కేసులో అసలేం జరిగింది: కుకునూరుపల్లికి రాజీవ్-శ్రవణ్! తేజస్విని పాత్ర ఎంత?

బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు శ్రవణ్, రాజీవ్‌లను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకోనున్నారు. వారిని రెండు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో సోమ, మంగళవారాలు వారిని విచారించనున్నారు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్యూటీషీయన్ శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు శ్రవణ్, రాజీవ్‌లను పోలీసులు సోమవారం కస్టడీకి తీసుకున్నారు. ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం పోలీస్ స్టేషన్ తీసుకు వెళ్లారు.

వారిని రెండు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో సోమ, మంగళవారాలు వారిని విచారించనున్నారు. రాజీవ్, శ్రవణ్‌ల నుంచి పోలీసులు పలు అంశాలు రాబట్టాల్సి ఉంది. పోలీసుల ప్రశ్నలకు వారు సమాధానం చెబుతారా అనే చర్చ సాగుతోంది.

<strong>శిరీష మృతి, రాజీవ్ రాసలీలలు: శ్రవణ్-రాజీవ్‌ల విచారణకు ఓకే</strong>శిరీష మృతి, రాజీవ్ రాసలీలలు: శ్రవణ్-రాజీవ్‌ల విచారణకు ఓకే

వారు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందంటున్నారు. ఈ కేసులో ఎన్నో ప్రశ్నలకు సమాధానం వారి నోటి నుంచే రావాలంటున్నారు. వారిని రెండు రోజుల పాటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తారు. పోలీసులు ముఖ్యంగా పది ప్రశ్నలకు వారి నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేయనున్నారని తెలుస్తోంది. అవసరమైతే కుకునూరుపల్లి తీసుకు వెళ్లి విచారించనున్నారు.

ఎస్సై క్వార్టర్లో ఏం జరిగింది?

ఎస్సై క్వార్టర్లో ఏం జరిగింది?

రాజీవ్, తేజస్విని, శిరీషల గొడవలను ఎస్సై ప్రభాకర్ రెడ్డి ద్వారా రాజీ ప్రయత్నాలు చేయాలనుకున్నారు. ఇందుకోసం రాజీవ్, శ్రవణ్, శిరీషలు కుకునూరుపల్లి వెళ్లారు. అయితే ఎస్సై క్వార్టర్లో లేదా ఫాం హౌస్‌లో ఏం జరిగిందో పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇది రాజీవ్, శ్రవణ్‌లు చెబితేనే తెలుస్తుంది. కాబట్టి శిరీషను ఎస్సై క్వార్టర్స్‌కు తీసుకు వెళ్లారా, లేదా ఫాం హౌస్ తీసుకు వెళ్లారా, అక్కడ ఏం జరిగిందని వారి నుంచి పోలీసులు కూపీ లాగనున్నారు.

నందు, నవీన్ ఎవరు?

నందు, నవీన్ ఎవరు?

ఇటీవల శిరీష.. నవీన్, నందు అనే వ్యక్తులతో మాట్లాడిన ఆడియో టేపులు కలకలం రేపాయి. అసలు శిరీషతో మాట్లాడిన వారు ఇద్దరు ఎవరు అనే విషయాలను పోలీసులు రాజీవ్, శ్రవణ్‌ల నుంచి రాబట్టనున్నారు. నందు, నవీన్‌లు రాజీవ్, శ్రవణ్‌ల స్నేహితులా లేక శిరీష స్నేహితులా తెలియాల్సి ఉంది.

అత్యాచారం జరిగిందా? హత్యనా, ఆత్మహత్యనా?

అత్యాచారం జరిగిందా? హత్యనా, ఆత్మహత్యనా?

కుకునూరుపల్లిలో శిరీష పైన అత్యాచారం జరిగిందా, లేక ఎస్సై అనుచితంగా ప్రవర్తించాడా, ఇంకేం జరిగింది అనే విషయాలను పోలీసులు రాజీవ్, శ్రవణ్‌ల నుంచి రాబట్టనున్నారు. అలాగే, శిరీషది హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే విషయాలు ఆరా తీయనున్నారు.

ఎస్సై వద్ద ఒంటరిగా ఎందుకు వదిలేశారు?

ఎస్సై వద్ద ఒంటరిగా ఎందుకు వదిలేశారు?

కుకునూరుపల్లిలో శిరీషను ఎస్సై ప్రభాకర్ రెడ్డి వద్ద రాజీవ్, శ్రవణ్‌లు ఎందుకు వదిలేశారు, వారి ఇంటెన్షన్ ఏమిటి అనే కోణాల్లో పోలీసులు ఇద్దరిని విచారించనున్నారని తెలుస్తోంది. అలాగే, కారులో మద్యం బాటిళ్ల గురించి విచారించనున్నారు.

దెబ్బలకు చనిపోయిందా?

దెబ్బలకు చనిపోయిందా?

శిరీష ఆర్జే స్టూడియోలో ఆత్మహత్య చేసుకుందా? లేక అంతకుముందే రాజీవ్ కొట్టిన దెబ్బలకు చనిపోయిందా అనే కోణంలోను పోలీసులు ఆరా తీయనున్నారని తెలుస్తోంది. అలాగే, అసలు శిరీషను మార్గమధ్యలో కొట్టవలసిన అవసరం ఏం వచ్చిందో ప్రశ్నించనున్నారు.

ఆడియో టేపుల వెనుక ఎవరు..?

ఆడియో టేపుల వెనుక ఎవరు..?

శిరీష మృతి అనంతరం రెండు ఆడియో టేపులు వెలుగు చూశాయి. ఈ ఆడియో టేపులు వెలుగు చూడటం వెనుక ఎవరున్నారనే విషయాలను కూడా పోలీసులు ఆరా తీయనున్నారని తెలుస్తోంది.

తేజస్విని పాత్ర ఎంత?

తేజస్విని పాత్ర ఎంత?

ఈ కేసులో తేజస్విని పాత్రపై కూడా పోలీసులు ఆరా తీయనున్నారు. ఆమె పాత్ర ఎంత వరకు ఉందో తెలుసుకోనున్నారు. అవసరమైతే తేజస్విని ఎదుట.. రాజీవ్, శ్రవణ్‌లను పోలీసులు విచారించనున్నారని తెలుస్తోంది.

English summary
Rajeev and Sravan into police custody for two days in Beautician Sirisha death case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X