హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంచి పద్ధతి కాదు: మీడియాకు గవర్నర్ చురకలు (ఫోటోలు)

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మీడియా మారాలాని, మానవత్వాన్ని అలవర్చుకోవాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ హితవు పలికారు. గురువారం ఎంతో ఆడంబరంగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన రాఖీ పూర్ణిమ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్ధులతో గవర్నర్ నరసింహన్ కుటుంబం కొద్దిసేపు గడిపింది.

వివిధ పాఠశాలలకు చెందిన బాలలు, బాలికలు పెద్దఎత్తున రాజ్‌భవన్‌కు తరలివచ్చి గవర్నర్‌కు రాఖీలు కట్టారు. చిన్నారులకు కూడా గవర్నర్ రాఖీలు కట్టి ముచ్చట తీర్చుకున్నారు. ఈ సందర్భంలో రాఖీ పండుగ విశిష్టతను తెలియచేసిన గవర్నర్, పనిలోపనిగా మీడియాకు చురకలు అంటించారు.

 మంచి పద్ధతి కాదు: మీడియాకు గవర్నర్ చురకలు

మంచి పద్ధతి కాదు: మీడియాకు గవర్నర్ చురకలు

అస్సాం క్యాడర్‌లో ఐఏఎస్ అధికారిగా పనిచేసిన తన సోదరుడు పేలుడు ప్రమాదంలో మరణించిన సందర్భంలో మీడియా వచ్చి ‘మీరెలా ఫీలవుతున్నారు?' అని ప్రశ్నించారని ఆవేదనతో గుర్తు చేసుకున్నారు.

మంచి పద్ధతి కాదు: మీడియాకు గవర్నర్ చురకలు

మంచి పద్ధతి కాదు: మీడియాకు గవర్నర్ చురకలు

సాధారణంగా అలాంటి సమయాల్లో ఎలా ఫీలవుతామో మీడియానే చెప్పాలన్నారు. మీడియా తన దృష్టి కోణంలోనూ, దృక్పథంలోనూ మార్పు తెచ్చుకోవాలని, వాస్తవాలను చెప్పొచ్చని, అయితే దాంట్లో మానవీయత కోణంలో ఆలోచించాలని గవర్నర్ వ్యాఖ్యానించారు.

 మంచి పద్ధతి కాదు: మీడియాకు గవర్నర్ చురకలు

మంచి పద్ధతి కాదు: మీడియాకు గవర్నర్ చురకలు

ఈ సందర్భంగా గవర్నర్ చీ.. ఛీ.. మీడియా మారాలి అంటూ కఠిన పదాలతో వ్యాఖ్యానించారు. బాలికలు, పిల్లలు, మహిళలపై జరిగిన దాడులను పదే పదే చూపిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను రిపీటెడ్ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి నిమిషం చూపించిందే చూపించడం మంచి పద్ధతి కాదని అన్నారు.

మంచి పద్ధతి కాదు: మీడియాకు గవర్నర్ చురకలు

మంచి పద్ధతి కాదు: మీడియాకు గవర్నర్ చురకలు

ఈ పరిస్థితి వల్ల ప్రమాదాల సమయంలో బాధితులకు ప్రజలు సహకరించడంపోయి, మీడియాలో చూపిస్తున్నారంటూ వారి దృష్టి అటేపోతోంది. ఫలితంగా బాధితులకు అవసరమైన సాయం అందకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

 మంచి పద్ధతి కాదు: మీడియాకు గవర్నర్ చురకలు

మంచి పద్ధతి కాదు: మీడియాకు గవర్నర్ చురకలు

ప్రమాదాలు సంభవించినపుడు బాధితులను కాపాడే విషయంలో మీడియా సైతం మానవీయ కోణంతో వ్యవహరించాలని హితవు పలికారు. ప్రమాదం గురించి బాధితుడిని అడిగి ఇబ్బంది పేట్టేకంటే, సహాయంపై దృష్టి పెడితే మంచిది కదా? అని హితవు పలికారు.

English summary
Rakhi Purnima Celebrations in Raj Bhavan at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X