హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాఖీ పండుగ: రాజ్ భవన్‌లో గవర్నర్, ఫాంహౌస్‌లో కేసీఆర్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాఖీ పండుగ రోజున రాజ్ భవన్‌లో ముద్దులొలికే చిన్నారులు సందడి చేశారు. వారందరినీ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు అక్కున చేర్చుకుని ముద్దులాడారు.

చిన్నారులకు గవర్నర్ దంపతులు మిఠాయిలు పంచారు. రక్షాబంధన్ సందర్భంగా రాజ్ భవన్‌లో రాఖీ వేడుకలు వైభవంగా జరుగగా, గవర్నరుకు రాఖీలు కట్టేందుకు చిన్నారులు క్యూ కట్టారు.
ప్రొటోకాల్ గురించి, గవర్నర్ వద్ద వ్యవహరించాల్సిన తీరు గురించి ఏ మాత్రమూ తెలియని చిన్నారులు అల్లరి చేశారు.

వారి అల్లరిని మురిపెంగా చూస్తు గవర్నర్ దంపతులు సంబరపడిపోయారు. పిల్లలను ఒక వరుసలో నిలబెట్టి ఫోటోలు తీయించేందుకు అధికారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. రాజ్ భవన్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్‌కు విద్యార్ధులు, బ్రహ్మకుమారీలు రాఖీ కట్టారు.

మహిళలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

రాఖీ పండుగను పురస్కరించుకుని మహిళలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అక్క చెల్లెళ్లు, అన్నాతమ్ముళ్ల అనుబంధానికి రక్షాబంధన్ ప్రతిక అని వెల్లడించారు. మహిళలను అన్నిరకాలుగా కాపాడుకోవాలన్నదే రక్షాబంధన్ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ ఆడపడుచులకు తెలంగాణ ప్రభుత్వమే సోదరుడిగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మరోవైపు సీఎం కేసీఆర్ శనివారం రాఖీ పౌర్ణమి వేడుకలను మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం ఎర్రవల్లి గ్రామంలోని తన ఫాంహౌస్‌లోనే నిర్వహించుకున్నారు. ఆదివారం వరకు సీఎం కేసీఆర్ ఇక్కడే ఉంటారని, కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సీఎం సోదరీమణులు ఫాంహౌస్‌కు వచ్చి సోదరునికి రాఖీ కట్టారని తెలుస్తోంది.

అదేవిధంగా మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత కూడా ఫాంహౌస్‌కే వస్తున్నట్లు తెలిసింది. గతేడాది కూడా రాఖీ పండుగను కేటీఆర్‌, కవితఫాంహౌస్‌లోనే నిర్వహించుకున్న సంగతి తెలిసిందే. రాఖీ పండుగ అనంతరం శనివారం సీఎం కేసీఆర్ శనివారం మెదక్ జిల్లాలోని ఎర్రవల్లిలో పర్యటించారు.

రాజ్ భవన్‌లో గవర్నర్ రక్షాబంధన్ వేడుకలు

రాజ్ భవన్‌లో గవర్నర్ రక్షాబంధన్ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాఖీ పండుగ రోజున రాజ్ భవన్‌లో ముద్దులొలికే చిన్నారులు సందడి చేశారు. వారందరినీ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు అక్కున చేర్చుకుని ముద్దులాడారు.
రాజ్ భవన్‌లో గవర్నర్ రక్షాబంధన్ వేడుకలు

రాజ్ భవన్‌లో గవర్నర్ రక్షాబంధన్ వేడుకలు

చిన్నారులకు గవర్నర్ దంపతులు మిఠాయిలు పంచారు. రక్షాబంధన్ సందర్భంగా రాజ్ భవన్‌లో రాఖీ వేడుకలు వైభవంగా జరుగగా, గవర్నరుకు రాఖీలు కట్టేందుకు చిన్నారులు క్యూ కట్టారు.

 రాజ్ భవన్‌లో గవర్నర్ రక్షాబంధన్ వేడుకలు

రాజ్ భవన్‌లో గవర్నర్ రక్షాబంధన్ వేడుకలు


ప్రొటోకాల్ గురించి, గవర్నర్ వద్ద వ్యవహరించాల్సిన తీరు గురించి ఏ మాత్రమూ తెలియని చిన్నారులు అల్లరి చేశారు. వారి అల్లరిని మురిపెంగా చూస్తు గవర్నర్ దంపతులు సంబరపడిపోయారు.

 రాజ్ భవన్‌లో గవర్నర్ రక్షాబంధన్ వేడుకలు

రాజ్ భవన్‌లో గవర్నర్ రక్షాబంధన్ వేడుకలు


పిల్లలను ఒక వరుసలో నిలబెట్టి ఫోటోలు తీయించేందుకు అధికారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. రాజ్ భవన్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్‌కు విద్యార్ధులు, బ్రహ్మకుమారీలు రాఖీ కట్టారు.

English summary
Raksha bandhan was celebrated at Rajbhavan here on Saturday. About 400 children from different schools attended.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X