నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అత్తారింట భార్యతో కలిసి హీరో రామ్ చరణ్: కోటపై ఆసక్తి, సైకిళ్ల పంపిణీ

By Pratap
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ గడికోటపై హీరో రామ్ చరణ్ తేజ ఆసక్తి చూపించారు. గడికోటలోని మహాదేవుని ఆలయంలో జరిగిన మహారుద్ర శత చండీ యాగంలో గురువారం సతీమణి ఉపాసనతో పాటు పాల్గొన్న ఆయన కోటలో అందాలను, కట్టడాలను తిలకించారు. వీటికి సంబంధించిన వివరాలను గైడ్ ను అడిగి తెలుసుకున్నారు.

హీరో రాంచరణ్ తేజ కోటకు వచ్చిన విషయం తెలుసుకున్న ప్రజలు అక్కడికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చెర్రీ.. చెర్రీ.. అని నినాదాలు చేశారు. ఈ సందర్భం గా అభిమానులకు హీరో హాయ్ అంటూ పలకరించారు. పోలీసులు, ప్రైవేటు సిబ్బంది బందోబస్తు చేపట్టారు.

ఉమాపతి రావు, అనిల్, రాంచరణ్ తేజ 16 సైకిల్ రిక్షాలను పంపిణీ చేశారు. దోమకొండ గ్రామంలోని 16 వార్డుల్లో రోడ్లు శుభ్రంగా ఉంచేందుకు వీటిని అందజేసినట్లు రామ్ చరణ్ తేజ చెప్పారు. గతంలో ఆటో ట్రాలీ రిక్షాను మామయ్య కామినేని అనిల్ సహకారంతో అందించామని చెప్పారు.

Ram Charan and Upasana in Shata handiyagam at Domakonda

కోటలో భవనాలకు మరమ్మతు పనులు పూర్తి అ య్యాయని సిబ్బంది తెలిపారు. రెండు నెలలు తర్వాత భవనాలను హీరో రాంచరణ్ తిరిగి ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఇదే సమయంలో రాంచరణ్‌ తేజను దోమకొండ గ్రామస్తులు సన్మానిం చారు.

గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తీగల తిర్మల్‌గౌడ్, మాజీ సర్పంచి ఐరేని నర్సయ్య, అనంతరెడ్డి, నల్ల పు శ్రీనివాస్, జనార్దన్‌రెడ్డి, సాయబుగారి రాజు మధుసూదన్‌రెడ్డి, షమ్మీ, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

English summary
Tollywood hero Ram Charan Tej has been explained by the guide about the Gadikota at Domakonda village in Nizamabad district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X