ఇవాంకా అందాల్ని చూడాలనుకుంటున్నా: సన్నీలియోన్‌తో పోల్చిన వర్మ, సిటీలో ఇవాంకా కళ
హైదరాబాద్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ త్వరలో హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ ఆమెపై కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో ఆయన స్పందించారు.

హైదరాబాద్‌కు ఇవాంకా, సామాన్యులకు చుక్కలు: 'ఇళ్ల నుంచి బయటకు రావొద్దు', టెక్కీలకూ
రామ్ గోపాల్ వర్మ ఆమెను సన్నీ లియోన్‌తో పోల్చారు. ఇవాంకా ట్రాంప్ గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూయర్స్ సమ్మిట్‌కు ఈ నెలాఖరులో వస్తున్న విషయం తెలిసిందే. ఇవాంకా రాక చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వర్మ తనదైన స్టయిల్లో స్పందించారు.
అంతా అబద్దం: ఇవాంకా 'ఖర్చు'పై కేటీఆర్, 'ఆయుధాలకు అనుమతివ్వండి'

ఆమె అందాన్ని చూడాలనుకుంటున్నా
తనకు రాజకీయాలపై ఎలాంటి జ్ఞానం, అవగాహన లేదని, ఇవాంకా హైదరాబాద్‌లో ఎందుకు పర్యటించాలనుకుంటోందో తనకు అర్థం కావడం లేదన్నారు. కానీ తాను మాత్రం ఆమె అందాన్ని చూడాలని ఎంతగానో ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.

సన్నిలియోన్ వచ్చినప్పుడు ఇలానే థ్రిల్లయ్యా
గతంలో సన్నీలియోన్ భారత్ వచ్చినప్పుడు కూడా నేను ఇలాగే చాలా థ్రిల్లయ్యానని రామ్ గోపాల్ వర్మ తన ఫేస్బుక్ పోస్ట్ చేశారు.
ఇవాంకా రానున్న సందర్భంగా హైదరాబాద్ ముస్తాబవుతోంది. ఇవాంకా కోసం తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రత్యేక విందు ఇవ్వనున్నారు.

హైదరాబాద్ కళకళ
ఇవాంకా హైదరాబాద్ రాక సందర్భంగా నగరం కళకళలాడుతోంది. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఆమె నగరంలో రాకపోకలు సాగిస్తున్న మార్గాలన్నింటిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హైటెక్ నుంచి హెచ్ఐససీ వెళ్లే మార్గమంతా అందంగా తీర్చిదిద్దారు.

ఎవరి ప్రయత్నాలు వారివి
ఇవాంకా రాకకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ భాగ్యనగరంలో సందడి కనిపిస్తోంది. ఇవాంకాతో పాటూ ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా పలువురు వ్యాపారవేత్తల సిద్ధమవుతున్నారు. సదస్సులో ఆహ్వానం పొందేందుకు ఎవరికి వారే ప్రయత్నాలు మమ్మురం చేస్తున్నారు.