వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్స్ కేసులో మహేశ్, పవన్‌లను లాగిన వర్మ: ఏమన్నారంటే..?

డ్రగ్స్ వ్యవహారంలో మరోసారి తనదైన శైలిలో స్పందించారు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. డ్రగ్స్ కేసులో సినీ నటులు, దర్శకులకు నోటీసులు జారీ చేసిన నాటి నుంచి ఎక్సైజ్ శాఖ, సిట్‌పై ఆరోపణలు .

|
Google Oneindia TeluguNews

ముంబై: డ్రగ్స్ వ్యవహారంలో మరోసారి తనదైన శైలిలో స్పందించారు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. డ్రగ్స్ కేసులో సినీ నటులు, దర్శకులకు నోటీసులు జారీ చేసిన నాటి నుంచి ఎక్సైజ్ శాఖ, సిట్‌పై ఆరోపణలు చేస్తున్న వర్మ.. తాజాగా సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

తీవ్ర వ్యాఖ్యలు

తీవ్ర వ్యాఖ్యలు

ఇటీవల నిర్వహించిన యాంటీ డ్రగ్స్ ర్యాలీ(డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ)కి ఒకరిద్దరు మినహా సినీ ప్రముఖులు ఎవరూ పెద్దగా హాజరుకాలేదు. దీంతో వారినుద్దేశించి వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యాంటీ డ్రగ్స్ ర్యాలీకి హాజరుకాని సినీ ప్రముఖులు ఏదో ఒక రూపంలో డ్రగ్స్‌కు కనెక్ట్ అయ్యారా? అనే సందేహాన్ని వర్మ వ్యక్తపరిచారు.

నోటీసులు వారికీ పంపండి..

యాంటీ డ్రగ్ మూమెంట్‌కు మద్దతు ఇవ్వకుండా ఉన్న సినీ ప్రముఖులకు నోటీసులు ఎందుకు జారీ చేయకూడదని ఆయన ప్రశ్నించారు. చివర్లో జస్ట్ ఆస్కింగ్ అంటూ ముగించారు. తన ఫేస్‌బుక్ ఖాతాలో ఈ మేరకు ఆయన స్పందించారు.

తాగదుర్రా మొర్రో..

అంతకుముందు ఫేస్‌బుక్‌లో మరో పోస్టు పెట్టారు. ‘గత 50ఏళ్లుగా సిగరేట్ తాగద్దురా మొర్రో అని అరిచి అరిచి చెప్పి సినిమాల్లో, పబ్లిక్ సర్వీస్ చిత్రాల్లో వేల సార్లు చూపించినా వినని వాళ్లు ఒక యాంటీ డ్రగ్ ర్యాలీ చేసినంత మాత్రాన మాత్రాన మానేస్తారా?' అని వర్మ ప్రశ్నించారు.

నమ్మకముందా?

‘వీళ్లు చేసిన ర్యాలీ చూసి డ్రగ్స్ తీసుకునే వాళ్లు డ్రగ్స్ తీసుకోవటం మానేస్తారని కనీసం ర్యాలీలో పాల్గొన్న వాళ్లలో ఒక్కరైనా నమ్ముతారా?' అంటూ రాంగోపాల్ వర్మ నిలదీశారు.

Recommended Video

Rana opens up about his involvement in the drugs scandal
మహేశ్, పవన్‌లపై వ్యంగ్యాస్త్రాలు

మహేశ్, పవన్‌లపై వ్యంగ్యాస్త్రాలు

టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, తారక్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ఎస్ రాజమౌళి, వీవీ వినాయక్, త్రివిక్రమ్, హరీశ్ శంకర్, తదితరులు యాంటీ డ్రగ్స్ ర్యాలీలో పాల్గొనడం చాలా గొప్ప విషయం అంటూ వ్యంగ్యంగా స్పందించారు వర్మ. ఈ విధంగా సిట్‌కు వారు మద్దతుగా నిలిచారని వ్యాఖ్యానించారు.

English summary
Maverick director Ram Gopal Varma has been vocal about the ongoing interrogation of Tollywood artistes by SIT, in regard to the drug scandal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X